Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజకీయ విమర్శల్లో ఘాటు వోకే… కానీ జాతుల్ని కించపరచడం దేనికి..?

April 6, 2026 by M S R

.

కేరళ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్లి… తెలంగాణ మోడల్ గురించి మాట్లాడటంలో అర్థముంది… తన పాలనను, తన రాష్ట్ర అభివృద్ధిని ప్రమోట్ చేసుకోవడమే కాదు, మా తెలంగాణ మోడల్ మీకూ ఉపయుక్తం, యూడీఎఫ్‌కు వోట్లేయండి అని కేరళ వోటర్లకు మర్యాదగా అప్పీల్ చేయడం..! ఇది ఎక్కడో బాగానే చురుక్కుమంది, ఎల్డీఫ్ సారథి పినరై విజయన్‌కు… అందుకే ఎవరెవరో గెస్ట్ స్పీకర్స్ వచ్చి ఏవో విమర్శలు చేస్తున్నా పట్టించుకోలేదు గానీ రేవంత్ రెడ్డి స్ట్రాటజిక్ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని ఏదో కౌంటర్ కూడా వదిలాడు…

కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటుంది… ఎఐసీసీ అధినేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలే అనవసర వివాదాలకు తావిచ్చి, కేరళలో యూడీఎఫ్‌కు నష్టం చేకూర్చేలా ఉన్నాయి… 83 ఏళ్ల వయస్సులో ఆయన మాటలు దారితప్పుతున్నాయి… తాజాగా వివాదం, దుమారం, చర్చ ఏమిటంటే..?

Ads

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్గే ప్రసంగిస్తూ… “ప్రధాని మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ ఇద్దరూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు… మోదీ గారు.., మీరు గుజరాత్ ప్రజలను లేదా ఇతర ప్రాంతాల వారిని అమాయకులను చేసి నమ్మించగలరేమో కానీ, అక్షరాస్యులైన (Literate) కేరళ ప్రజలను మాత్రం మోసం చేయలేరు” అని వ్యాఖ్యానించాడు… ఈ క్రమంలో ఆయన పరోక్షంగా గుజరాతీయులు “అజ్ఞానులు” లేదా “అక్షరాస్యత లేనివారు” అన్న భావన వచ్చేలా మాట్లాడటం వివాదానికి కేంద్రబిందువైంది…

అక్షరాస్యత గణాంకాలు ఏం చెబుతున్నాయి? … 

రాష్ట్రం అక్షరాస్యత (%)
కేరళ 95.3%
గుజరాత్       84.6%
కర్ణాటక 82.7%

విశ్లేషణ…: పైన చూసినట్లుగా, గుజరాత్ కంటే ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలోనే అక్షరాస్యత తక్కువగా ఉంది… ఖర్గే తర్కం ప్రకారం చూస్తే, గుజరాతీయుల కంటే కన్నడిగులే ఎక్కువ “అమాయకులు” ‘‘నిరక్షరాస్యులు’’ అని ఆయన ఒప్పుకున్నట్లా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి…

జాతులను కించపరచడం దుర్మార్గం… రాజకీయాల్లో నాయకులు ఒకరి విధానాలను ఒకరు విమర్శించుకోవడంలో తప్పు లేదు. కానీ, ఒక రాష్ట్రం కంటే మరో రాష్ట్రం గొప్పదని లేదా ఒక జాతి ప్రజలు చదువుకోని వారని ముద్ర వేయడం ఏం ప్రజాస్వామిక ధోరణి..?

  • గుజరాత్…: వ్యాపారానికి, పారిశ్రామికాభివృద్ధికి మారుపేరు… అక్షరాస్యతలో జాతీయ సగటు కంటే మెరుగ్గానే ఉంది…

  • కర్ణాటక…: ఐటీ హబ్ (బెంగళూరు) కు నిలయం, ఎంతోమంది మేధావులను అందించిన గడ్డ…

  • కేరళ…: సామాజిక అభివృద్ధిలో, అక్షరాస్యతలో దేశానికే ఆదర్శం…

అక్షరాస్యత అనేది కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాదు, అది రాజకీయ చైతన్యాన్ని కూడా సూచిస్తుంది… అయితే, కేరళలో ఓట్ల కోసం పక్క రాష్ట్రాలను లేదా ఇతర జాతులను కించపరచడం వల్ల ఆయా ప్రాంతాల మధ్య దూరం పెరుగుతుంది… రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సృష్టించడం దేనికి..? అదీ ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు..?!

ఆల్రెడీ గుజరాత్ బీజేపీ స్పందించింది, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘవి… ఖర్గే వ్యాఖ్యలు 6 కోట్ల గుజరాతీలను అవమానిస్తున్నాయని స్పందించాడు… ఈ రాష్ట్రం మహాత్మాగాంధీని, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్‌ను అందించిందని మరిచిపోతే ఎలా అంటున్నాడు… గుజరాత్ ప్రజలు మీ పార్టీని ఇక జన్మలో క్షమించరు అని ఘాటుగా కౌంటర్ వదిలాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయ విమర్శల్లో ఘాటు వోకే… కానీ జాతుల్ని కించపరచడం దేనికి..?
  • ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!
  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!
  • కొబ్బరి బొండాం..! అప్పట్లో కామెడీ హీరో అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్..!
  • అర్చకుల విదేశీ ప్రయాణాలు నిషిద్ధమా..? శృంగేరీ చెప్పిందే ఆగమమా..?!
  • అసెంబ్లీ నక్సలైట్..! ముందస్తు జాగ్రత్తగా ఉపా కేసు వర్తిస్తుందా యువరానర్..!!
  • అన్నదాత చెమట చుక్కకు తెలుసు మెతుకు విలువ… అవమానించకండి…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ మార్మిక భావన…
  • జంట నెలవంకలుండే నింగి ఉంటుందేమో…. ‘అలాంటి పిల్ల’ దొరకదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions