Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖైదీకి మనసిచ్చింది… మనువాడింది… లవ్ జిహాద్ కాదు… రివర్స్…

May 10, 2026 by M S R

.

నో, నో, ఇది లవ్ జిహాద్ కానే కాదు… “రివర్స్… 🔄” పైగా ఇందులో విశేషం ఏమిటంటే..? ఓ జైలర్ ఓ ఖైదీపై మనసు పారేసుకుంది… జైలులో ప్రణయం చిగురించి “పెళ్లి దాకా దారితీసింది… 💍” మరో విశేషమా..? విశ్వ హిందూ పరిషత్ స్వయంగా ఈ పెళ్లి జరిపించడం… ఓ “సినిమా కథలాగా… 🎬 ఉన్న ఈ ప్రేమ కథలోకి వెళ్దామా…

ఒక మాజీ ఖైదీ, ఒక పోలీసు అధికారిణి వివాహ బంధంతో ఒక్కటయ్యారు… ఇది స్టోరీ లైన్… సాధారణంగా నేరస్తులకు, పోలీసులకు మధ్య కేవలం విధి నిర్వహణ సంబంధమే ఉంటుంది… కానీ, మధ్యప్రదేశ్‌లోని సత్నా సెంట్రల్ జైలులో మాత్రం ఒక సరికొత్త ప్రేమ చరిత్ర పురుడు పోసుకుంది…

Ads

సత్నా జైలులో ఫిరోజా ఖాతూన్ అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తుండేది… అదే జైలులో ధర్మేంద్ర సింగ్ అనే వ్యక్తి ఒక హత్య కేసులో 2007 నుండి శిక్ష అనుభవిస్తున్నాడు… ధర్మేంద్ర తన ప్రవర్తనతో జైలు అధికారుల నమ్మకాన్ని గెలుచుకున్నాడు…. ముఖ్యంగా వారెంట్ పనులు, ఇతర పరిపాలనాపరమైన విషయాల్లో ఫిరోజాకు సహాయకుడిగా ఉండేవాడు… ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది…

ధర్మేంద్ర సింగ్ తన జీవిత ఖైదును (రెమిషన్లతో) పూర్తి చేసుకుని సుమారు నాలుగేళ్ల క్రితం జైలు నుండి విడుదలయ్యాడు… విడుదలైన తర్వాత కూడా వీరిద్దరి మధ్య అనుబంధం అలాగే కొనసాగింది… అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు… ఫిరోజా కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని నిరాకరించినప్పటికీ, ఆమె తన ప్రేమకే ఓటు వేసింది…

వీరిద్దరి మతాలు వేరైనప్పటికీ, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవంతో ఫిరోజా మే 5, 2026న ఛతర్‌పూర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మేంద్రను వివాహం చేసుకుంది… ఈ పెళ్లికి మరో విశేషం ఏమిటంటే…, స్థానిక విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకులు ఈ వివాహాన్ని పెళ్లి పెద్దలుగా ఉండి జరిపించారు… వి.హెచ్.పి జిల్లా ఉపాధ్యక్షుడు రాజబహదూర్ మిశ్రా దంపతులు ఆమెకు తండ్రి స్థానంలో ఉండి ‘కన్యాదానం’ చేశారు… love in Jail కథ సమాప్తం… శుభం… 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఖైదీకి మనసిచ్చింది… మనువాడింది… లవ్ జిహాద్ కాదు… రివర్స్…
  • మ్యాచులు పెద్దగా చూడటం లేదు… జియో ఆదాయానికి భారీ దెబ్బ…
  • వ్యూహకర్త నుంచి ‘మంత్రి’ వరకు.., విజయ్ కేబినెట్‌లో కీర్తన మెరుపులు..!
  • బాబు గారి పాలన అంటే అంతే మరి… జస్ట్, 9 సెకన్లకు ఓ ఫైల్ క్లియర్…
  • విజయ్‌లో ఓ సుగుణం… తక్కువ మాట్లాడతాడు… అవసరమైతే తప్ప…
  • ‘ఆపరేషన్ సిందూర్-2’ …. ఇదే సంభవిస్తే కథ పూర్తిగా వేరే ఉంటది..!!
  • ‘చక్రధారి’ స్టాలిన్..! పర్‌ఫెక్ట్ ‘చదరంగం’… మళ్లీ తన పెత్తనమే…!!
  • పిల్లలు మన నీతులు వినరు – మన ప్రవర్తనను అనుసరిస్తారు
  • బుడ్డోడు నిలబడకపోతే… మిగతా ప్లేయర్లు వరుసగా పడిపోవడమే..?!
  • చైనా మిలిటరీలో సంక్షోభం… మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions