Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!

February 28, 2026 by M S R

.

ఎంత మార్పు..? ఎప్పుడూ బాంబు పేలుళ్లతో, తుపాకుల కాల్పులతో మోతమోగిపోతూ… ఓ యుద్దభూమిని తలపించే జమ్ము కశ్మీర్‌లో ఎంత తేడా..? ఇప్పుడు ఆ రాష్ట్రం క్రికెట్ దేశీయ చరిత్రలో ఓ గొప్ప గౌరవాన్ని పొందింది తాజాగా… ఆశ్చర్యకరమే కాదు, అభినందనీయం కూడా… ఆహ్వాేనీయం కూడా..!

ఏం జరిగింది..? అటు ముఫ్తీ, ఇటు అబ్దుల్లా రాజకీయాలు… ఉగ్రమూకల దాడులకు వేదికగా ఇన్నాళ్లూ పీడింపబడిన రాష్ట్రం ఈరోజు మంచి పదునైన, మెరికల్లాటి క్రికెటర్లను తయారు చేసుకుని, పెద్ద తోపు రాష్ట్రాలను కూడా ఓడించి, మొదటిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది… ఖచ్చితంగా ఇది విశేషమే…

Ads

Nothing less than a miracle… ఒక్కప్పుడు నవాబులకి, రాజులకి, బ్రిటిష్ విధేయులకు పరిమితమైన  హైప్రొఫైల్ క్రికెట్ గేమ్ ఇప్పుడు దేశంలోని చిన్న చిన్న రాష్ట్రాలకి పట్టణాలకి, గల్లీలకు వేగంగా చేరిపోతోంది… అందుకు చిన్న ఉదాహరణ… గత పదేళ్లలో 6 చిన్న రాష్ట్రాలు (క్రికెట్ పరంగా ) రంజీ ట్రోపి విజేతలుగా గెలవడమే…

సౌరాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ విదర్భ లాంటి చిన్న చిన్న క్రికెట్ అసోసియేషన్ల రాష్ట్రాలు, పెద్ద జట్లయిన ఢిల్లీ, ముంబయి, కర్ణాటక వెస్ట్ బెంగాల్‌లని ఓడించి విజేతలుగా నిలవడం దేశంలో ముఖ్యంగా చిన్న రాష్ట్రాలలో, పట్టణాలలో మారుతున్న పరిస్థితులకు తార్కాణం…

ఇవ్వాల్టి రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కాశ్మీర్ ఎప్పుడూ మనకి “భూతల స్వర్గమే ” కానీ చాలా ఏళ్లుగా అది భూతాల స్వర్గంగా భయపెడుతోంది… కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా కాశ్మీరి లోయ ప్రాంతాలైన శ్రీనగర్, అనంతనాగ్, భారాముల్లా, పుల్వామా వేర్పాటువాదులకి అనుకూలం… అటువంటి ప్రాంతం నుంచి ఇవ్వాళ ఒక క్రికెట్ ఫాస్ట్ బౌలర్ తన రాష్ట్రాన్ని ఒంటి చేతితో విజేతగా నిలపడం గొప్ప విషయమే…

“Sport has the power to change the world. It has the power to unite people in a way that little else does…” — Nelson Mandela అన్నట్టు ఇప్పటికైనా అక్కడి వాళ్ళు మేం ఈ దేశంలో భాగమే అని భావిస్తేనే, ఈ గెలుపుకి ఆ పదకొండు మంది ఆటగాళ్ల సాహసానికి విలువ…

ఒక్కసారి ఈ క్రింద పట్టిక చూడండి, గత పదేళ్లలో రంజీ ట్రోఫీ విజేతల గురుంచి ఒక ఐడియా రావటానికి…

రంజీ

నేటి గెలుపు ఏమంత ఆషామాషీగా వచ్చింది ఏమీ కాదు, వాళ్ళు ఫైనల్ లో ఓడించిన కర్ణాటక జట్టులో ఏకంగా అయిదుగురు భారతీయ జాతీయ జట్టులో ఆడిన సభ్యులు ఉన్నారు… KL రాహుల్, మయాంక్ అగర్వాల్, ప్రసిద్ధ కృష్ణ, పడికల్, కరణ్ నాయర్… అందరూ ఇవ్వాల్టి మ్యాచులో ఆడినవాళ్లే, ఇంతటి బలమైన జట్టుని ఓడించి కప్పుని గెలిచిన తమ రాష్ట్ర జట్టు విజయ ఘడియలని చూడటానికి స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 3 వేల కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక హుబ్లీకి రావడం ఆ రాష్ట్రానికి ఈ గెలుపు ఎంత ప్రత్యేకమో తెలియ చేస్తోంది….

అబ్దుల్లా

ఈ గెలుపులో ఏ ఒక్క ఆటగాన్ని తక్కువ చెయ్యలేం కానీ ముఖ్యంగా భారత మాజీ కెప్టెన్ గంగూలీ అన్నట్టు అఖిబ్ నబి ఇక భారతీయ పాసుపోర్టుతో ఇంగ్లాండ్ వెళ్లే జట్టుకు ఎంపిక కావడం లాంఛనమే… ఇప్పటి వరకు రంజీ చరిత్రలో ఒక సీజన్లో 60 కి పైగా వికెట్లు తీసిన బౌలర్లు కేవలం ముగ్గురే… అందులో ఈ సీజన్ హీరో అఖిబ్ నబి ఒక్కడు… సెమీ ఫైనల్లో ఒంటి చేతితో జట్టుని ఫైనల్ కి చేర్పించిన బౌలింగ్ స్పెల్ రంజీ ట్రోపీ చరిత్రలో ఎప్పటికి గుర్తుంటుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దురంధర్ లో బాగా పేలిన పాత్ర… బడే సాహెబ్… ఎవరీ నటుడంటే..?
  • భయం నుంచి విముక్తి – ఆ పచ్చిపుండు వేదన – దురందర్ మరో కోణం…
  • ఒకే వ్యక్తి తల్లి ప్లస్ తండ్రి..! ఈ ప్రచారం ఏమిటి..? అసలు నిజాలు ఏమిటి..?!
  • రాత్రి 10… సీఎం హఠాత్తుగా మాయం… ఒక్కడే కారులో ఎటో వెళ్లిపోయాడు…
  • మణిరత్నం పిలుపు ఓ అవకాశం మాత్రమే కాదు… ఓ గౌరవం, ఓ గుర్తింపు..!!
  • చిరంజీవి వ్యాఖ్యలపై ఇంత వ్యతిరేకతకు కారణాలేమిటి..?!
  • కొత్త సీసాలో పాత సారా..? కాదు.., కొత్త సీసా, కొత్త సారా, కొత్త రంగు కూడా..!!
  • ఇటు గరికపాటి రచ్చ… అటు భట్టి కొత్త ఆహార ప్రకటన… భలే కంట్రాస్టు…
  • హేపీనెస్ ఇండెక్స్..! ‘హేపీగా’ పగలబడి నవ్వుకునే ఓ వరల్డ్ రేంజ్ జోక్..!
  • ఇరాన్ దెబ్బ… ఇంత బతుకూ బతికి… F35 జెట్ చావు దప్పి కన్నులొట్ట…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions