Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!

March 1, 2026 by M S R

.

ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అదో ఎమోషన్… రెండు దేశాల్లోనూ కోట్ల మంది టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతారు… నెట్ మోత మోగిపోతూ ఉంటుంది… సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది… కానీ రాత్రి శ్రీలంక- పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను కూడా సేమ్ అదే స్థాయిలో చూసి ఉంటారు ఇండియన్ ఫ్యాన్స్… చాన్నాళ్లు గుర్తుంటుంది, ఎందుకంటే..?

శ్రీలంక గెలుపు కాదు ముఖ్యం ఇక్కడ… పాకిస్థాన్ ఈ దశలోనే ఇంటికి వెళ్లిపోవాలి… అదొక ధూర్తదేశం, పైగా టీ20 ప్రారంభదశలోనే బంగ్లాదేశ్‌కు మద్దతు పేరిట నానా తిక్కవేషాలూ వేసింది… ఇక జాతివైరం ఉండనే ఉంది… అందుకే శ్రీలంక గెలవకపోయినా సరే, పాకిస్థాన్ ఇంటిమొహం పట్టాలని సగటు ఇండియన్ ఫ్యాన్ కోరిక… అందుకే పాకిస్థాన్- ఇండియా మ్యాచును ఎలా చూశారో, ఇదీ అలాగే చూశారు…

Ads

నెట్ రన్ రేట్… అది పెంచుకుంటే పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్తుంది… లేదంటే శ్రీలంక మీద గెలిచినా సరే ఫాయిదా లేదు… ఏవో లెక్కలు… ఇప్పుడు ఆ లెక్కలు, ఆ సమీకరణాల్ని కాసేపు వదిలేస్తే… మొదటి నుంచీ అసలు ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారా అని అందరూ అనుమానించేలా ఆడాయి రెండు జట్లూ…

పాకిస్థాన్ వాడు భారీగా పరుగులు చేస్తేనే బరిలో నిలుస్తాడు, అందుకని మొదటి నుంచే భారీ షాట్లతో శ్రీలంక బౌలర్లతో కబడ్డీ ఆడుకున్నారు… ఓపెనర్లలో ఫరాన్ సెంచరీ చేస్తే, జమాన్ 84… 176 రన్స్ దాకా అసలు వికెటే పడలేదు… ఎలాగూ సెమీస్‌లోకి వెళ్లడం లేదు కదా, పాకిస్థాన్‌కు చాన్స్ ఇద్దాం అనుకుని శ్రీలంక ఇంత ఘోరంగా ఆడుతోందా అనే సందేహాలే అందరిలోనూ… సరే, లాస్ట్ 4 ఓవర్లలోనే 8 వికెట్లు టపటపా పడిపోయాయి… సీన్ కట్ చేస్తే…

శ్రీలంక బ్యాటింగ్ తీరు చూసినా మళ్లీ అవే సందేహాలు… టపాటపా తమంతట తామే వికెట్లు కూల్చుకున్నట్టుగా ఆడారు… 11 ఓవర్లలో 101 రన్స్‌కే అయిదు వికెట్లు… ఈ దెబ్బతో పాకిస్థాన్ ఇక సెమీస్‌కు పోయినట్టే అనుకుని సగటు ఇండియన్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు… మరోవైపు ఇదే మ్యాచ్‌ను ఆశగా చూస్తున్న న్యూజిలాండ్ ఫ్యాన్స్‌కు కూడా సేమ్… పాకిస్థాన్ ఇంటికి పోతేనే తను సెమీస్‌కు వెళ్తుంది కాబట్టి…

సో, నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ చూసిన ఈ మ్యాచులో చివరకు చెప్పుకోవాల్సింది శ్రీలంక కెప్టెన్ షనక ఆడిన తీరు… ఏ దశలోనూ వదిలేయలేదు… పాకిస్థాన్‌ను ఇంటికి పంపించేయడానికి కావల్సిన స్కోర్ దాటించేశాడు… అంతేకాదు, ఒక దశలో కేవలం 2 శాతం విన్ ప్రాబబులిటీ ఉన్న శ్రీలంకు 50 శాతం ప్రాబబులిటీకి తీసుకొచ్చాడు… గెలిపించేస్తాడా అనే దశకు తీసుకుపోయాడు… పాకిస్థాన్ సెన్సేషన్ తారిఖ్‌ను కూడా ఉతికేశాడు…

చివరి ఓవర్‌కు 28 పరుగులు చేయాల్సిన దశలో… 4, 6, 6, 6 పరుగులు… ఇక రెండు బాల్స్‌లో ఆరు పరుగులు చేస్తే శ్రీలంకకు ఓ చిరస్మరణీయ విజయం దక్కేది… షహీన్ ఆఫ్రిది బౌలర్… ఐదో బాల్ చాలా వైడ్‌గా వేశాడు, దాన్ని స్టంప్స్ వెనక్కి ఆడటానికి ట్రై చేశాడు షనక… మిస్, నిజానికి అది వైడ్, కానీ అంపైర్ ఇవ్వలేదు… ఇక చివరి బంతికి సిక్స్ కొడితే ఫినిష్… బౌలర్ వైడ్, నోబాల్ గనుక వేస్తే శ్రీలంకకు ఇంకా బెటర్…

నిజంగానే బౌలర్ వైడ్ వేశాడు… స్పష్టంగా టీవీ రీప్లేలలో కనిపించింది… శ్రీలంక డీఆర్ఎస్ అడగలేదు, అంపైర్ వైడ్ ఇవ్వలేదు… కెప్టెన్ షనక తనే స్వయంగా క్రీజులో ఉండి ఎందుకు రివ్యూ అడగలేదో ఎవరికీ అర్థం కాలేదు… చూస్తున్న శ్రీలంక టీమ్ ముఖ్యులు కూడా హాశ్చర్యపోయారు… తరువాత మలింగ తదితరులు షనకకు క్లాస్ పీకారు సరే, కానీ ముగిశాక ఇక చేసేదేముంది..?

ఆ వైడ్ గనుక ఇచ్చి ఉంటే, తరువాత బంతికి షనక ఫోర్ కొట్టినా టై అయ్యేది, సూపర్ ఓవర్ దాకా పోయేది… కానీ అక్కడ షనక వదిలేశాడు… ఓ సూపర్ మ్యాచ్ అలా ముగిసింది… ఇదుగో ఈ సీన్ చాన్నాళ్లు గుర్తుంటుంది శ్రీలంక, పాకిస్థాన్, ఇండియా, న్యూజిలాండ్ ఫ్యాన్స్‌కు..!!

నో, నో, వైడ్ బాల్ కు డీఆర్ఎస్ అవకాశం లేదు, అందుకే షనక సైలెంటుగా ఉండిపోయాడు అని మరో వాదన… ఇదీ డిబేటబులే..!! అలాంటప్పుడు అక్కడే అంపైర్‌ను అడిగితే బాగుండేది, అంపైర్ తప్పు నిర్ణయం అనే మెసేజ్ కనీసం ప్రేక్షకుల్లోకి వెళ్లేది…

క్రికెట్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”
  • తండ్రి గ్యాస్ సిలిండర్లు మోసే ఓ కూలీ…! మరి ఇప్పుడు రింకూ సింగ్..?!
  • క్లీన్ కవిత..! అసలే మూలిగే బీఆర్ఎస్ మీద పే-ద్ధ తాటిపండు పడ్డట్టు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions