Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“పట్టు పురుగుకు పూరీ ప్రాణభిక్ష… పట్టు అవసరమే లేని తిరుమల!”

March 10, 2026 by M S R

.

నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ… ఆ కట్టు బడికి తరించేను పట్టు పురుగు జన్మ……. అంటాడు ఏదో పాటలో వేటూరి… పట్టుచీరలో మెరిసిపోయే అందానికి ఓ మాంచి కవితాత్మక ప్రశంస … కట్టుబడికి అనేది అపూర్వమైన ప్రయోగం… అంటే అలా కట్టుకోబడిన ఆ పట్టు దారానికి తల్లి వంటి పట్టు పురుగు తన జన్మ సార్థకం అయ్యిందని ఆనందపడుతుందట…

అది భావన… అదెప్పుడూ బాగానే ఉంటుంది… కానీ నిజం చాలా చేదుగా ఉంటుంది… అమానవీయంగానూ ఉంటుంది… ఒక పట్టు చీర నేయడానికి అవసరమైన దారం కావాలంటే దాదాపు 10- 20 వేల పట్టు పురుగులు మరణించాల్సి ఉంటుంది… నిజం… పట్టు గూళ్లను (కకూన్స్) ఉడికించి, పురుగుల్ని చంపేసి, దారం తీస్తారు… పట్టు చీరలు కట్టుకున్నవాళ్లందరికీ ఈ నిజం తెలియకపోవచ్చు కూడా…

Ads

ఓ వార్త బాగా  నచ్చింది… ఒడిశా ప్రభుత్వం పట్టు పురుగులను చంపకుండానే ఆ దారాన్ని తీసే టెక్నిక్‌ను పట్టు రైతులందరికీ అలవాటు చేస్తోంది… దాని పేరేమిటో తెలుసా … కరుణ సిల్క్… బాగుంది, కరుణ చూపే పట్టు కదా… ఈ పద్ధతిలో పట్టు పురుగులు గూళ్లను (ప్యూపా దశ) చీల్చుకుని, బయటికి వచ్చే దాకా వెయిట్ చేస్తారు… తరువాతే దారం తీస్తారు…

పట్టు

బయటికి వచ్చాక కూడా పట్టు పురుగులు చాలాకాలం బతకవు… అవి పెట్టే గుడ్లు, వాటి నుంచి గొంగళిపురుగుల్లాంటి లార్వా దశ… తరువాత ప్యూపా గూళ్లు… ఇదీ దాని జీవితచక్రం… నేత తీరు, దారం నాణ్యత, డిజైన్లను బట్టి రకరకాల పట్టు చీరెలు, వాటి ధరలు…

ఒడిశాలో పూరీ జగన్నాథుడి ఆలయంలో స్వామివారికి అర్పించే సంప్రదాయ పట్టు ఖండువా వస్త్రాలను ఇప్పుడు ఈ కరుణ సిల్క్‌తోనే తయారు చేస్తున్నారు… నిజానికి హింస ద్వారా వచ్చే పట్టు స్వామి వారికి అర్పించడం బాగుండదనే భావనతోనే, అక్కడ పూజారుల సూచనలతోనే ఈ కరుణ సిల్క్ పద్ధతిని రాష్ట్ర చేేనేత, జౌళి శాఖ అభివృద్ధి చేసి, దాదాపు 14 జిల్లాలకు విస్తరింపజేసిందని అంటుంటారు… గుడ్… దీన్నే అహింస సిల్క్ అనీ అంటున్నారు…

సిల్క్

పర్యావరణ హితం…: ఈ పట్టు తయారీలో రసాయన రంగులకు బదులుగా సహజసిద్ధమైన రంగులను వాడుతున్నారు, దీనివల్ల ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది… సీన్ కట్ చేయండి ఇక్కడ…

టీటీడీ దగ్గరకు వెళ్దాం… నానా అపచారాలకు నెలవుగా చేశారు కదా తిరుమలను… లడ్డూ నెయ్యి వివాదం తెలిసిందే కదా… పట్టు కాని ఫేక్ పట్టు శాలువాల కథలు కూడా బయటికొచ్చాయి… ప్చ్, అందరూ అపార్థం చేసుకున్నారు గానీ, టీటీడీ పెద్ద తలకాయలు అసలు పట్టుపురుగుల జోలికే పోకుండా, అసలు పట్టు అవసరం లేని పట్టు శాలువాలు తయారు చేయించారు… ఎంతో గ్రేట్ కదా…

పైగా ఆ నకిలీ మెరుపుల శాలువాలను ధనిక, సెలబ్రిటీ భక్తులకు కప్పేవాళ్లు… ఇది అత్యంత కరుణ సిల్క్… మరి ఏం దారం వాడేవాళ్లు..? పరీక్షల్లో తేలింది ఏమిటంటే, ఆ శాలువాల్లో ప్రధానంగా ఇవి వాడారు…

  1. పాలిస్టర్ దారం (Polyester yarn)

  2. ఆర్ట్ సిల్క్ / ఆర్టిఫిషియల్ సిల్క్ (Artificial Silk)

  3. విస్కోస్ ఫైబర్ (Viscose rayon)

  4. కొన్ని చోట్ల నైలాన్ మిశ్రమ దారం

ఇవి బయటకు చూడటానికి పట్టు లాగే మెరుస్తాయి కాబట్టి చాలామంది పట్టు శాలువా అని అనుకుంటారు... కానీ అసలు సిల్క్‌వార్మ్ నుంచి వచ్చే సహజ పట్టు కాదు…

  • కొన్ని శాలువాలను టెక్స్‌టైల్ ల్యాబ్‌లలో పరీక్షించారు…

  • అందులో సిల్క్ ప్రోటీన్ (Fibroin) లక్షణాలు లేకపోవడం తేలింది..

  • అంటే అవి పూర్తి పట్టు కాకుండా సింథటిక్ ఫైబర్ అని నిర్ధారణ అయింది… ఇదంటీ ఒక పూరీ జగన్నాథుడి కరుణ సిల్క్ ఖండువాలకు, తిరుమల వెంకన్న ఫేక్ పట్టు శాలువాలకూ నడుమ తేడా..!! అక్కడ కరుణతో పట్టు తయారు చేస్తారు…
    ఇక్కడ పట్టు లేకుండానే పట్టు తయారు చేస్తారు..!! అదీ దేవుడి ఖజానాపై పెద్దల ‘పట్టు’…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా, ఇజ్రాయిల్‌లతో యుద్ధం చేస్తున్నది చైనా- రష్యాలే…!!
  • “పట్టు పురుగుకు పూరీ ప్రాణభిక్ష… పట్టు అవసరమే లేని తిరుమల!”
  • …. చివరకు తన రక్తపు వేలిముద్రతో సాక్షి సంతకం చేస్తుంది…
  • ‘‘చూడు కమల్.., నీ చేతినీ, నా చేతినీ పోల్చి చూడు… ఎంత తేడా ఉందో…’’
  • శివాజీ ఆ గరుడ పురాణ ప్రవచనాలు మళ్లీ మొదలెట్టాడురా బాబోయ్..!!
  • నక్సల్స్ ఘాతుకం..! నిజాన్ని, తప్పును ఆలస్యంగా అంగీకరించిన వైనం..!!
  • వైఎస్ నిజవారసత్వ పంథాలో రేవంత్… మచ్చుకు కొన్ని మెచ్చు తునకలు ఇవీ…
  • టీ20 వరల్డ్ కప్ హీరో కేరళ సంజూ శాంసన్ కథ తెలుసా మీకు..?
  • ముత్యం పూర్తిగా కడగబడలేదు… ఇంకా శుభం కార్డు పడలేదు…
  • ఓ చిన్న తెలుగు పత్రిక క్లిప్పింగ్ నిన్నంతా వైరల్… ఎందుకు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions