Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉల్టా పేలిన హరీష్ తుపాకీ..! ఇరికించే ప్లాన్ చేసి దొరికిపోయాడు..!!

March 30, 2026 by M S R

.

మహేశ్ బాబు నటించిన అతడు సినిమాలో ఓ పాతకాలం తుపాకీ ఉంటుంది… పలుసార్లు సీన్లలో కనిపిస్తుంది… కథలో గోడపై తుపాకీ ఉంటే అది ఎప్పుడో ఓసారి పేలాలి కదా మరి… పేలుతుంది… చివర్లో, క్లైమాక్స్‌లో… కానీ ఉల్టా పేలుతుంది, అదే కథలో చివరి ట్విస్టు… శుభం కార్డు…

నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు వ్యూహం మొత్తం బెడిసికొట్టిన తీరు చూస్తుంటే ‘అతడు’ తుపాకీయే గుర్తొచ్చింది… ముఖ్యమంత్రి దొరికిపోయాడు అనుకుని, మంత్రి పొంగులేటి మైనింగ్ అక్రమాలపై చర్చ మొదలైంది… ప్రసంగించాడు… హౌజ్ కమిటీ అని పట్టుబట్టాడు… తీరా చూస్తే చివరకు హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ సభ్యులే ముఖ్యమంత్రికి దొరికిపోయారు… ఇరుకునపడ్డారు… ఉల్టా పేలినట్టయింది…

Ads

నిజానికి పొంగులేటి మైనింగ్ వ్యవహారాలపై బాగా ప్రిపేరై మరీ వచ్చాడు హరీష్ రావు… అక్రమాలపై విచారణ, మంత్రి రాజీనామా కోరుతూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బ్రహ్మాండంగా ఇరుకునపెట్టొచ్చు అనుకున్నాడు… కాసేపు మంత్రుల కౌంటర్లలో పస కనిపించలేదు… ముఖ్యమంత్రి వచ్చాక మొదలైంది ఎదురుదాడి… దాంతో హరీష్ వ్యూహం బెడిసికొట్టి., చివరకు బీఆర్ఎస్ వాళ్లే ఇరుక్కునిపోయారు… హరీష్ ఏదో సాధించబోయి మమ్మల్ని బుక్ చేశాడు, తనూ బుక్కయ్యాడు అని బీఆర్ఎస్ వాళ్లే లోలోపల సణుక్కునే సిట్యుయేషన్ ఇప్పుడు…

ఎలాగంటే..? మైనింగ్ అక్రమాలపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచీ విచారణ చేద్దాం అన్న సీఎం వరుసగా బీఆర్ఎస్ మైనింగ్ అక్రమాలు, బాధ్యులు, ఆ కంపెనీల పేర్లతో సహా వరుసగా ఏకరువు పెట్టాడు… అంతేకాదు, హరీష్ రావు కుటుంబసభ్యుల ధరణి దందానూ ప్రస్తావించి, ఒప్పుకుంటావా, హౌజ్ కమిటీ వేద్దామా అని సూటిగా సవాల్ విసిరాడు… చర్చ కాస్తా తమకే ఎదురు తిరుగుతుందని గమనించి, ఇక సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ, పోడియం దగ్గరకు దూసుకుపోతూ, సస్పెన్షన్ దాకా సీన్ కంటిన్యూ చేసి, ఎంతో కొంత పొలిటికల్ మైలేజ్ కోసం విఫల ప్రయత్నం చేసింది…

  • నిజానికి కేటీయార్‌కన్నా ఈమధ్య హరీష్ రావు పార్టీ రాజకీయాల్లో హైలైట్ అవుతున్నాడు… పొంగులేటి మైనింగ్ చర్చతోనూ ఇంకా హైలైట్ కావాలనుకున్నాడు… కానీ నడుమ పాడి కౌశిక్ వ్యవహారధోరణి మొత్తం చర్చను వేరే వైపు తీసుకుపోయింది… బీఆర్ఎస్‌ను, కేసీయార్‌ను దళిత వ్యతిరేకంగా ఫోకస్ చేయడానికి కౌశిక్ వ్యవహారం సీఎంకు అవకాశం ఇచ్చింది… నిజానికి కౌశిక్ ఎప్పుడూ బీఆర్ఎస్‌కే సొంత తలనొప్పిగా మారుతున్నట్టుంది… మద్దతు పలకలేక, వ్యతిరేకించలేక బీఆర్ఎస్ టీమ్ ఎప్పుడూ ఇరుకునపడుతోంది…

కడియం శ్రీహరి వైపు తుపాకీతో కాలుస్తాం అన్నట్టు సైగలు చేశాడంటూ సీఎం ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని స్పీకర్‌ను అడిగాడు… ఇప్పుడిక ఎథిక్స్ కమిటీ, మరికొన్ని కమిటీలు వేసి, ఫస్ట్ కౌశిక్ వ్యవహారమే తీసుకుంటారు… కడియంకు బెదిరింపు, వెక్కిరింపు ధోరణితో ఇక సీఎం అందుకున్నాడు…

  • ‘‘స్పీకర్ దళితుడు కాబట్టే కేసీయార్ సభకు రాడు, మీరు పోడియం వైపు ఆందోళన చేస్తారు… గతంలోనూ అంతే, భట్టి ప్రతిపక్ష నేత గాకుండా చేశారు, భట్టి బడ్జెట్ పెడుతున్నాడు కాబట్టే మీకు నచ్చడం లేదు… మీ కేబినెట్‌లో రావులుంటారు… మా కేబినెట్‌లో భట్టి, సీతక్క తదితర దళిత, గిరిజన నేతలుంటారు… దళితుడిని సీఎం చేస్తానన్న కేసీయార్ మాట ఏమైంది..?’’ అంటూ ఎదురుదాడి సాగించాడు…

చివరకు పొంగులేటి మైనింగ్ అక్రమాల చర్చ కాస్తా ఎటో వెళ్లిపోయింది… కాకపోతే దీనివల్ల రేవంత్ రెడ్డి రెండుమూడు ప్రయోజనాలు… ఒకటి, బీఆర్ఎస్‌ మీద దళిత కోణంలో దాడి, రెండు, తన మంత్రివర్గ సహచరుడికి బాసటగా నిలిచాడని పార్టీలో అంతర్గత సానుకూలతకు చాన్స్, మూడు, పొంగులేటి స్పీడ్‌కు పరోక్షంగా బ్రేకులు, నాలుగు, బీఆర్ఎస్ నేతల మైనింగ్ అక్రమాల వెల్లడితో బీఆర్ఎస్ ముఖ్యుల యవ్వారాలను జనంలోకి తీసుకుపోయాడు, అయిదు, హరీష్ రావు కుటుంబసభ్యుల ధరణి దందా బహిర్గతం చేయడం, ఆరు, ఇక మిగిలిన బిల్లులను చకచకా ఆమోదింపచేసుకుని, బడ్జెట్ సెషన్స్‌ను ముగించడం…

చివరకు బీజేపీని ‘పదే పదే అడిగారు, కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాను, మీరేం చేశారు..? మీ దర్యాప్తు ఏమైంది..? ఏమిటీ సీక్రెట్ బాండింగ్?’ అని బీజేపీ- బీఆర్ఎస్ దోస్తీని కూడా ఎక్స్‌పోజ్ చేశాడు… ఇప్పుడిక బీఆర్ఎస్ ఏం చేయాలి..?

  • 1. కేటీయార్‌ను దాటేసి పార్టీలో తనే హైలైట్ కావాలనే హరీష్ రావు ఆతృత తగ్గడం… 2. పార్టీని ఇరుకునపెడుతున్న కౌశిక్ మీద నియంత్రణ… 3. సర్కారుపై ఏ విషయంపై దాడికి దిగాలో నిర్ణయించుకునేముందు తమ పాత బాగోతాలు ఏమేం సీఎం బయటపెడతాడో ఆలోచించుకోవడం (Home Work)… 4. ఎంతసేపూ కేటీయార్, హరీష్ రావు మాత్రమే కాదు, పార్టీలో ఇంకా సీనియర్లు ఉన్నారు, వాళ్లకూ మాట్లాడే చాన్స్ ఇవ్వడం… ఎట్సెట్రా…!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions