Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పరుగుల బాబా…! వెధవ దొరికిపోయాడు..! ఇప్పుడు పరారీ పరుగులు..!!

February 28, 2026 by M S R

.

పరుగుల బాబా బండారం బయటపడింది: ‘దేవుడి’ ముసుగులో పోకిరీ చేష్టలు.. పోక్సో కేసు నమోదు!

హైదరాబాద్/యాదగిరి…: అతనో వింత బాబా… ఎప్పుడూ పరుగులెత్తుతుంటాడు… భక్తులను కొడుతుంటాడు, తిడుతుంటాడు… అయినా సరే, అదంతా ‘దైవిక శక్తి’ అని నమ్మి మన జనం నీరాజనాలు పట్టారు… హైదరాబాద్‌లోని కొందరు సంపన్న వర్గాల వారైతే, అతన్ని ఏకంగా ఇంటికి పిలిపించుకుని, పాదపూజలు చేసి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకుని మురిసిపోయారు…

Ads

కానీ, ఇప్పుడు అదే ‘పరుగుల బాబా’ అసలు రంగు బయటపడింది… భక్తి ముసుగులో ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది…

ఎవరీ మల్లికార్జున ముత్య?

కర్ణాటకలోని యాదగిరి జిల్లా, షహాపూర్ తాలూకాలో ఉన్న మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యకు సోషల్ మీడియా పుణ్యమా అని భారీ క్రేజ్ వచ్చింది… ఎప్పుడూ పరిగెడుతూ కనిపించడం వల్ల నెటిజన్లు అతనికి ‘రన్నింగ్ బాబా’ అని పేరు పెట్టారు… తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఈయన, భక్తులపై వింతగా ప్రవర్తించేవాడు… విచిత్రం ఏమిటంటే, ఈ వింత చేష్టలనే జనం ‘మహిమలు’గా భావించి తండోపతండాలుగా తరలివెళ్లేవారు….

పాపం శమించుగాక… అసలే ప్రతి బాబా మీద లైంగిక కేసులు పెట్టిస్తూ, ప్రతి ఆశ్రమాన్ని లైంగిక అడ్డాలుగా చిత్రీకరిస్తూ…. హిందూ మతం మీద బురద రాజకీయాలు నడుస్తున్నవేళ… ఇదుగో, ఇలాంటి ‘‘వెధవలే’’ హిందూ మతానికి ప్రధాన శాపాలు… సోకాల్డ్ మూఢ భక్తులే జాగ్రత్తపడాలి… దురదృష్టం కొద్దీ అదే జరగడం లేదు…

వైరల్ వీడియోతో వెలుగులోకి… చట్టం కన్నుగప్పినా, కెమెరా కన్ను నుంచి ఈ ‘నకిలీ బాబా’ తప్పించుకోలేకపోయాడు… ఇటీవల ఒక మైనర్ బాలికతో మల్లికార్జున ముత్య అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించాయి…

  • ఆ వీడియోలో బాలిక గొంతు పట్టుకుని మంచం మీదకు తోసేయడం స్పష్టంగా కనిపిస్తోంది…

  • బాలిక ఇబ్బంది పడుతున్నా వదలకుండా ఆమె శరీరాన్ని తాకుతూ డ్యాన్స్ చేయడం, ముక్కు పిండడం వంటి దృశ్యాలు భక్తులను సైతం విస్మయానికి గురిచేశాయి…

రంగంలోకి అధికారులు.. ‘పోక్సో’ కేసు! ఈ వీడియోలు వైరల్ కావడంతో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు… జరిగిన దాష్టీకంపై విచారణ చేపట్టి, యాదగిరి జిల్లాలోని గోగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు… దీని ఆధారంగా పోలీసులు మల్లికార్జున ముత్యపై పోక్సో (POCSO) చట్టం కింద, పలు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు…

పరారీలో ‘పరుగుల దేవుడు’ కేసు ఫైల్ అయిన విషయం తెలియగానే, భక్తుల మధ్య హల్ చల్ చేసే ఈ బాబా ఇప్పుడు పోలీసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు… సాధారణంగా భక్తుల మధ్య పరుగులు తీసే ఈయన (వీడు), ఇప్పుడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తుండటం గమనార్హం… పోలీసులు ప్రత్యేక బృందాలతో ఆయన కోసం గాలిస్తున్నారు…

భక్తి ముసుగులో మోసపోకండి! హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖులు ఈయనను ఇంటికి పిలిపించి సన్మానాలు చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాయి… ఎవరో వస్తారు, ఏదో మహిమ చేస్తారు అని గుడ్డిగా నమ్మే సంస్కృతి ఇలాంటి నకిలీ బాబాలను పుట్టిస్తోంది… భక్తి ఉండాలి కానీ, అది విజ్ఞతను దాటకూడదని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాడ్ టాక్సీ..! గ్లోబల్ సిటీ దిశలో మరింత ఆధునిక రవాణా వ్యవస్థ..!!
  • పరుగుల బాబా…! వెధవ దొరికిపోయాడు..! ఇప్పుడు పరారీ పరుగులు..!!
  • ‘‘నేనెందుకు ఏడ్చానో నాకే అర్థం కాలేదు… ఈ ఎమోషన్ అర్థమేమిటి..?’’
  • నాకు తెలిసిన సౌందర రాజన్… గొప్ప మనీషి, ఆధ్యాత్మిక చైతన్యశీలి…
  • విజయ్‌తో విడాకులు కోరిన భార్య- మళ్లీ తమిళ వార్తల తెరపైకి త్రిష..!!
  • సెన్సార్..! నియమకాలే ఓ ప్రహసనం- ఆ సర్టిఫికెట్లు మరింత ప్రహసనం..!!
  • మరేమనుకున్నారు పెద్ద దొర పెంపకం అంటే..? ఫుల్ క్లీన్ చిట్…!!
  • విష్ణువిన్యాసం..! చివరిదాకా చూడగలిగిన ప్రేక్షకులు అత్యుత్తమ జాతి..!!
  • పైకి అంతా బాగానే ఉంది కానీ… లోలోపల పీడించే రోగాలెన్నో…
  • మగాడు..! తెలుగులో సింగిల్ కమెండో ఆపరేషన్ సినిమాలు తక్కువే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions