Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ ముఖచిత్రం ఎలా ఉందంటే..? ఫుల్ పిక్చర్..!!

March 19, 2026 by M S R

.

అమిత్ షా దగ్గరకు త్రిష రాయబారం..! ఇది ఎవరు క్రియేట్ చేసిన వార్తో గానీ బాగా చక్కర్లు కొడుతోంది… కానీ ఎందుకు ఈ రాయబారం..? విజయ్ పార్టీ టీవీకేను ఎన్డీఏ కూటమిలో చేర్చడానికి అట… విజయ్ మీద ఈడీ, సీబీఐ కేసుల ఉధృతి తగ్గించడానికి అట… ఏమో, బహుశా జననాయకన్ సినిమా రిలీజు గురించీ అయి ఉంటుందట…

అసలు అమిత్ షా ఆమెకు టైమ్ ఇస్తాడా..? టీవీకే పార్టీలో ఆమె ఏమిటి..? బీజేపీ వంటి పార్టీ పొత్తులు, సయోధ్య, అవగాహన వంటి ఇష్యూస్ మాట్లాడటానికి వేరే చానెళ్లుంటాయి… విజయ్ ‘అత్య్ంత స్నేహితురాలు’ ఆ చానెల్ కాదు… కాబోదు… ఆమెకు ఆ పార్టీలో సభ్యత్వం కూడా లేదు, ఏ హోదా లేదు, విజయ్ భార్య కూడా కాదు…

Ads

పైగా టీవీకే జనరల్ సెక్రెటరీ (ఎన్నికల నిర్వహణ) ఆధవ్ అర్జున చేసే వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి… తనే పార్టీ సొంతంగా మొత్తం 234 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని అంటున్నాడు… ఢిల్లీ పార్టీ (బీజేపీ) తమకు 50 శాతం సీట్లు, రెండున్నరేళ్లు సీఎం పదవి ఆఫర్ ఇచ్చిందనీ, కానీ ఢిల్లీకి తలవంచేది లేదని మరోసారి చెప్పాడు… విజయ్ పార్టీకి అంత సీన్ ఉందా..?

నో, నో, 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని మరికొన్ని వార్తలు… విజయ్‌ను ఎన్‌డీఏలోకి తీసుకురావడానికి చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్న మాట నిజమే కానీ… అది బీజేపీ సొంతంగా తీసుకునే నిర్ణయం కాదు, ప్రధాన భాగస్వామి ఎఐఏడీఎంకే సమ్మతి అవసరం… పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ కూడా ఉన్నాయి… (త్రిష పళనిస్వామి కొడుకుతోనూ మంతనాలు చేసిందని మరో వార్త)…

డీఎంకేకు ఓ ఉపగ్రహంగా ఉండటంకన్నా ఆ కూటమి నుంచి విడిపోయి, విజయ్‌తో జతకట్టాలని కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేసింది… దాన్నీ విజయ్ కొట్టిపారేశాడు… కానీ ప్రస్తుత పిక్చర్ ఏమిటంటే డీఎంకే బలంగా కనిపిస్తోంది… లెఫ్ట్, కాంగ్రెస్, డీఎంకే, కమలహాసన్ పార్టీ, డీఎండీకే, వీసీకే, ఎండీఎంకే, ముస్లిం లీగ్ మాత్రమే గాకుండా కొన్ని చిన్న పార్టీలు కూడా…

విజయ్ కోణంలో చూద్దాం… విజయ్ పార్టీ దళిత, గిరిజన, మైనారిటీ, కొత్త వోటర్లను నమ్ముకుంది… కానీ డీఎంకే భాగస్వామి వీసీకే పార్టీ తిరుమావళవన్ (మొదట్లో ‘దళిత పాంథర్స్ ఆఫ్ ఇండియా’..) దళిత, గిరిజన వర్గాలకు బలమైన వాయిస్… డీఎంకే స్వయంగా నాస్తిక, మైనారిటీ వోట్ బ్యాంక్… మరోవైపు iuml ముస్లిం వోట్లకు భరోసా… కమలహాసన్ పార్టీ (ఎమ్ఎన్ఎమ్మ), డీఎండీకే సినిమావాళ్ల పార్టీలు… సో, ఆల్ మిక్స్, పర్‌ఫెక్ట్ మిక్స్… సీట్ల ఒప్పందాలు కూడా స్టాలిన్ సజావుగా పూర్తి చేస్తున్నాడు… సో, ఈ కూటమి బలంగా కనిపిస్తోంది…

కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, హిందూ సంఘటిత వోటు మీద ఎన్డీయే ఆశలు పెట్టుకుంది… కానీ ఎఐడీఎంకే పార్టీకి బలమైన లీడర్ లేడు… జయలలిత చనిపోయాక బాగా బలహీనపడింది… లోకసభ ఎన్నికల్లో స్టాలిన్ క్లీన్ స్వీప్ చేశాడు తెలుసు కదా… IANS – మాట్రిజ్ రీసెంట్ సర్వేలో డీఎంకే, బీజేపీ కూటములు బలంగా పోటీపడుతున్నట్టు తేలింది… విజయ్ మరీ 8- 9 శాతం వోట్లకు పరిమితమై 6- 10 సీట్లు గెలుచుకుంటాడట…

ఆ వోట్ల శాతానికి వచ్చే సీట్లు ఆ స్థాయిలోనే ఉంటాయి… (గత ఎన్నికల్లో సొంతంగా అన్ని సీట్లకూ పోటీచేసిన తమిళ జాతీయవాద పార్టీ (ఎన్‌టీకే- సీమన్) నామ్ తమిళర్ కచ్చికి 6.6 శాతం వోట్లు వచ్చాయి, కానీ సున్నా సీట్లు…) వోట్లు కన్సాలిడేట్ కాకపోతే సీట్లు రావు… మరి విజయ్ ఒక దశలో సగం సీట్లు కొట్టేస్తాడనే ప్రచారం జరిగింది, మరి ఇప్పుడేమైంది..? ఏ ధీమాతో బీజేపీ ఆఫర్లను, కాంగ్రెస్ ఆఫర్లను తిరస్కరించాడు..? పెద్ద ప్రశ్న…

అతి విశ్వాసమా..? కూటమితో కలవడం వల్ల ప్రయోజనాలపై, వోట్ కన్సాలిడేషన్ మీద అవగాహన లేకపోవడమా..? దీనికి తోడు వరుసగా దెబ్బలు… 1) కరూర్ తొక్కిసలాట, సీబీఐ కేసు, ఆల్రెడీ అప్పటికే ఈడీ కేసు(?) 2) భార్య విడాకుల పిటిషన్, త్రిషతో సంబంధాలు 3) జననాయకన్ సినిమాకు అడ్డంకులు 4) పార్టీ బాధ్యుల నుంచి సంయమనం, సమన్వయం లేని వ్యాఖ్యలు… చాలా అంశాలు విజయ్ మీద నెగెటివిటీని ఎంతో కొంత పెంచాయి…

రజినీకాంత్ భయపడి  రాజకీయాల్లోకి రాలేదు, ఎవరో బెదిరిస్తే భయపడ్డాడనే పార్టీ జనరల్ సెక్రెటరీ వ్యాఖ్య కూడా అనాలోచితం… అసందర్భం కూడా… ఈరోజుకూ రజినీకాంత్‌కు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది తమిళనాడులో… వాళ్లంతా విజయ్‌కు యాంటీ అయిపోయారు హఠాత్తుగా… అందుకే కాలం జవాబు చెబుతుంది అని సింపుల్ వ్యాఖ్యతో కౌంటర్ ఇచ్చాడు రజినీకాంత్…

మరో చేదు నిజం ఏమిటంటే..? సినిమావాళ్ల ప్రభావం తమిళ రాజకీయాలపై అపారం అనేది నిజమే… ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఎట్సెట్రా… కానీ ఇప్పుడు కాదు… స్టార్లకు దశ బాగా లేదు, కర్నాటకలో ఎవరూ క్లిక్ కాలేదు, ఏపీలో చిరంజీవి తన పార్టీనే కాంగ్రెస్‌లో నిమజ్జనం చేయాల్సి వచ్చింది… టీడీపీతో పొత్తు కూడి క్లిక్కయ్యాడు గానీ పవన్ కల్యాణ్ అంతకుముందు తనే ఓడిపోయి, ఒక సీటుకు పరిమితం అయ్యాడు…

అంతెందుకు… అదే తమిళనాడులో కమలహాసన్ పరిస్థితి ఏమిటి..? స్టాలిన్‌కు తాకట్టు పెట్టేశాడు కదా కేవలం 2- 2.5 శాతం వోట్లతో కుదేలైపోయి..! ఇక చూడాలి… తమిళనాడు రాజకీయం అందుకే రక్తికడుతోంది… ఏమో… ఒకవేళ హంగ్ గనుక వస్తే ఇదే విజయ్ ఆ కాసిన్ని సీట్లతోనే కింగ్ మేకర్ అవుతాడేమో..!!

చివరగా… విజయ్ సొంతంగా పోటీచేసినా సరే, కాస్త వోట్ల శాతం పెరిగితే, డీఎంకే వోటు చీలిపోయి తనకు లాభం అని బీజేపీ కూటమి ఆశపడుతోంది…!! నో, నో, త్రిష ఎఫర్ట్స్ (?) ఫలించి విజయ్ బీజేపీ కూటమిలో చేరతాడు అంటారా..? ఏమో, అదీ చూద్దాం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 వేల కొలువు – కొడుకును అమెరికాలో చదివించడం ఏమంత కష్టం?
  • ఇక్కడ ఒక్క బొద్దింక కూడా మాట్లాడదు ! ఎందుకో మీకు తెలుసా !?
  • గంజి వంపేద్దాం ! ఇప్పుడు WHO చెప్పిందే మన బామ్మలూ చెప్పారు !!
  • తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!
  • మళ్లీ హృతిక్ – కంగనా పంచాయితీ – వీళ్ల పాత కథ తెలుసా మీకు !
  • హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!
  • ఎవరి తప్పో, ఎవరి పొరపాటో – నవ్వులపాలైంది మాత్రం పత్రికే !!
  • ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!
  • ఇండియన్ సినిమా మునుపెన్నడూ ఎరుగని అత్యంత భారీ పందెం !!
  • GenZ – ఇది జంతర్‌మంతర్ బ్యాచ్ కాదు – దేశం తలెత్తుకునే టార్చ్ బేరర్స్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions