.
ఓ మిత్రుడు ఫోన్ చేశాడు… సుదీర్ఘంగా తన వాదనను ఆవేశంగా వినిపించాడు… ఓసారి యథాతథంగా విందాం…
‘‘సారీ, వీర బీజేపీ అభిమానులు… అమిత్ షా మూఢాభిమానులు… మీ మనోభావాలు గాయపడితే సారీ… అమిత్ షా కొడుకు జైషా ఐసీసీ చైర్మన్… తనకు క్రికెట్ తెలియదు, ఆఫ్ సైడ్ తెలియదు, ఆన్ సైడ్ తెలియదు… కానీ ఐసీసీకి అధిపతి…
Ads
ఖర్మ… సరే, ఒక ఫండ్ మేనేజర్‌కు ఆట తెలియాలని ఏముంది అంటారా..? వోకే… కానీ అమిత్ షా కొడుకుగా ఓ కామన్ సెన్స్, పాట్రియాటిక్ సెన్స్ ఉండాలి కదా… ఎలా అంటే..?
పహెల్గాం మగ ఉగ్ర దారుణం తరువాత… ఆపరేషన్ సిందూర్‌లో ఇండియా ప్రయోగించిన ఒక్కొక్క బంక్ బ్లస్టర్ వెపన్ ఖర్చు తెలుసా తనకు..? రఫేల్ ఫైటర్ల వినియోగం ఖర్చు తెలుసా తనకు..? సిందూర్ మొత్తం ఖర్చు తెలుసా..? అసలు దెబ్బతిన్న ఇండియన్ల ఫీలింగ్స్‌కు లెక్కకట్టగలడా తను..?
సిగ్గు లేదు… పాకిస్థాన్ క్రికెట్ ఆడదట, టీ20 మ్యాచ్ బహిష్కరిస్తుందట… సిగ్గు తప్పి, తన నాయకత్వంలోని ఐసీసీ పీసీబీతో చర్చలకు సిద్ధపడింది… ఇడియాటిక్… ఈ మాట అనడానికి కారణం ఉంది… పాకిస్తాన్‌కు టర్కీ, అజర్ బైజాన్ ఎలాగో ఇప్పుడు బంగ్లాదేశ్ అలాగే…
ధూర్తదేశానికి ఐకన్ పాకిస్థాన్ కాదు, బంగ్లాదేశ్..! మనం వందల సైనికుల్ని కోల్పోయాం, ఈ తుచ్ఛుల విముక్తి కోసం..! మమత వంటి క్షుద్ర రాజకీయ నేతల కారణంగా లక్షల మంది బంగ్లా అక్రమ వలసల్ని భరిస్తున్నాం… ఐనా సరే, వాడికి గతంలో తనను పీడించిన ఆ పాకిస్థానీయే ఆదర్శం అయ్యాడు ఇప్పుడు… మీరు మారర్రా భయ్…
ఎవడో ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ ఐపీఎల్‌కు అక్కర్లేదని అన్నాం మనం… గుడ్… అలాగైతే నేను అసలు ఇండియాలోనే ఆడను అన్నాడు బంగ్లా వాడు… నీ మొహం, ఆడితే ఆడు, లేకపోతే నీ చావు నువ్వు చావు అన్నాం మనం… అయిపోయింది… నడుమ పాకిస్థానీవాడు వచ్చాడు… ఎంటరయ్యాడు, వాడికేం పని అంటారా..? అదొక పెద్ద ప్రశ్న… బంగ్లా వాడికి నీ వకల్తా ఏమిట్రా అన్నామా మనం..? అనలేదు…!
నేనూ ఇండియాతో ఆడనుపో అన్నాడు వాడు కూడా… ఎందుకురా అంటే..? మా బంగ్లాదేశ్, మా మతం, మా సుహృద్భావం, మా మద్దతు, మేం మేం భాయ్ భాయ్ అంటాడు… మరి నాడు బంగ్లాదేశ్ వాసుల్ని మీరే ఉక్కుపాదంతో అణిచివేశారు కదరా, పీడించారు కదరా, అప్పుడు మీ మతం గుర్తుకు రాలేదా..? ఇదెవ్వడూ అడగొద్దు…
మరోవైపు ఆ దేశంలో హిందువుల్ని మతం కారణంగా వరుసగా రోజుకొకడిని హతమారుస్తున్నారు… ఈ జై షా అనేవాడికి సిగ్గూశరం లేదని ముందే చెప్పుకున్నాం కదా…
పాకిస్థాన్ వాడి కోసమే… వాడితో మ్యాచ్‌ను తటస్థ శ్రీలంకలో పెట్టారు…( ఇదే శ్రీలంక క్రికెటర్ల వాహనంపై గతంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది)… నేను ఇండియాతో ఆడను అంటాడు ఇప్పుడు… అదేమిటంటే, మా బంగ్లాదేశ్, మా వేవ్ లెంత్ అంటాడు…
మరి ఐసీసీ నీ ఖర్మరా భయ్ అని వదిలేయాలి కదా… వదల్లేదు… బంగ్లాదేశ్‌కు పరిహారం ఇవ్వాలట, ఏ పెనాల్టీ విధించకూడదట… రాబోయే అండర్ 19 వరల్డ్ కప్ హోస్టింగ్ ఇవ్వాలట… బంగ్లాదేశ్‌లో భారత్ సీరీస్ నిర్వహించాలట…
ఇంకా నయం, మూడు దేశాల టోర్నీ పెట్టాలి… బంగ్లా, పాక్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ తీసేయాలి,.. రెండు దేశాల్లో హిందువుల్ని తక్షణం ఇండియాకు తరలించాలి అనే డిమాండ్లు పెట్టలేదు ఆ పాకిస్థానోడు… తుచ్ఛ, క్షుద్ర కేరక్టర్ జై షా నుంచి సరైన స్పందన లేదు… టెంపర్ మెంట్ లేదు… అమిత్ షా కొడుకేనా తను..?
చివరకు బంగ్లాదేశ్ వాడే ‘‘పాపం పోనీలే, మీరు ఇండియాతో ఆడండి’ అని పాకిస్థాన్‌కు ఉదారంగా చెబుతున్నాడు… కరుణ చూపిస్తున్నాడు… స్ట్రిక్ట్‌లీ… జైషా అనేవాడికి డబ్బు తప్ప వేరే ఎమోషన్ ఉందా… అందుకే ఈ కథనం మొదట్లోనే అడిగింది… ఒక పాకిస్థానీ ఉగ్రవాద బంకర్‌ను చీల్చిన బంక్ బ్లస్టర్ ఖరీదు ఎంత..? నీ మొహం, పాకిస్తాన్- బంగ్లాదేశ్ ఆడకపోతే వచ్చే నష్టం విలువ ఎంత..?
రీసెంట్ మ్యాచుల్లో పాకిస్థానీ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా వెనుకాడిన మన ప్లేయర్లకున్న టెంపర్‌మెంట్‌లో పైసా మందం కూడా జైషా అనే వాడిలో కనిపించడం లేదు... నీలాంటోడి కోసమా, మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ప్రాణాలకు తెగించేది..!!
ధూర్తుడా..!! నీ మొహం, నీలో రాజనీతి లేదు, జాతి మనోభావాలకు అనుగుణంగా ఆడే ఆటతీరు అసలే లేదు...!! ఆసియా కప్ గెలిచాక షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పీసీబీ వాడు ఈరోజుకూ కప్ మనకు ఇవ్వలేదు గుర్తుందా నీకు..?!
చివరగా… పహల్గాంలో ప్యాంటు విప్పి చూసి, భార్య కళ్ల ముందే భర్త గుండెల్లోకి దూసుకుపోయిన బుల్లెట్ ధూర్తత్వం అర్థమైతే… ఆ సోయి నీకుంటే… పీసీబీతో ఈ క్షుద్ర చర్చలకు దిగేవాడివి కాదు…
Share this Article