Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం సాక్షి..! పాత ఎడిటర్ వ్యాసాలకూ ఇంత నాసిరకం ప్రజెంటేషనా..?

March 30, 2026 by M S R

.

ఫేస్‌బుక్‌లో మిత్రులు Padmakar Daggumati పోస్ట్ ఏమిటో ముందుగా ఓసారి చదవండి… ‘‘సాక్షి వరస్ట్ లే అవుట్! ఇదేమీ మొదటిసారి కాదు. లెక్కలేనన్ని సార్లు ఇలా చూడడం! పేజీనిండా ఇలా చీమలు తిరుగుతున్నట్టు 3/4 పేజీనిండా అంతంత మేటర్ రాస్తే, అటెన్షన్ ఒక నిముషానికి పడిపోయిన ఇప్పటి రీల్స్ కాలంలో ఎవరు చదువుతారు కంటికి రిలీఫ్ లేకపోతే? కనీసం ఒక్క సబ్ హెడింగ్ కూడా లేదు! కనీసం కామన్ సెన్స్ వాడండయ్యా!’’

అక్షర సత్యం… కంటెంటు గురించి వదిలేద్దాం, పాత ఎడిటర్ వర్ధెల్లి మురళి వ్యాసాల్లో 95 శాతం ‘జై జగన్, చంద్రబాబూ ముర్దాబాద్’ టైపే… సరే, వాళ్ల పత్రిక, వాళ్లిష్టం… ఎడిట్ పేజీలో వ్యాసాల మీద కూడా బోలెడు విమర్శలున్నాయి… అదీ కాసేపు వదిలేద్దాం… కానీ పేజీనేషన్ తీరు..?

Ads

అసలు హెడ్డింగులకు, పేజీ లేఅవుట్లకు వర్ధెల్లి మురళి చాలా పాపులర్… ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పటి నుంచి కూడా… అలాంటిది పాపం, తన ఎడిట్ పేజీ ప్రధాన వ్యాసానికే ఈ నాసిరకం పేజీనేషన్ ఓ పే-ద్ద పారడాక్స్… సరే, తన ఇప్పటి పొజిషన్‌లో లేఅవుట్లు, డిజైన్లు, ప్రత్యేకించి ఎడిట్ పేజీ నాణ్యత గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడని అనుకోలేం గానీ…

ఆ పేజీ చూసేవాళ్లు ఎవరో గానీ… జగన్ చాలా జన్మలపాటు వాళ్లకు ఏదో బాకీ ఉండి ఉంటాడు… అందుకే కంటిన్యూ అవుతూ ఉన్నట్టున్నారు… ఈ పేజీ చూడండి…

సాక్షి

వర్తమాన పాత్రికేయంలో పరిహరించాల్సింది సుదీర్ఘ వ్యాసాలు… అవెవరూ చదవడం లేదు… స్ట్రెయిట్‌గా, సింపుల్‌గా, బ్రీఫ్‌గా ప్రజెంట్ చేయాల్సింది… ఇది సోషల్ మీడియా యుగం… అసలు పత్రికనే పైపైన ఓ లుక్కేస్తున్న కాలమిది… హెడ్డింగులు చూస్తూ చకచకా తిరగేసి పత్రిక మడతపెట్టేసే కాలమిది… పైగా ఇన్వెస్టిగేషన్, హ్యూమన్ ఇంట్రస్టింగు, ఎక్స్‌క్లూజివ్స్ ఎట్సెట్రా ఎప్పుడో కనుమరుగైన కాలమిది… అలాంటిది ఎడిట్ పేజీ మెయిన్ కాలమ్ ఇలా పేలవమైన పేజీనేషన్‌తో ఉంటే ఎవరు చదవాలి..?

ఈనాడు ఎడిట్ పేజీలో చాలా మార్పులు చేసింది, వ్యాసాల లెంత్ తగ్గింది, సంఖ్య పెరిగింది… మామూలుగా ఎడిట్ పేజీ రీడర్స్ రెండుమూడు శాతం కూడా ఉండరు కాబట్టి… ఎడిట్ పేజీ తప్పదు కాబట్టి, ఆ స్పేస్‌ను ఎలాగోలా నింపేస్తోంది… ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు అని ఓనరే రాసుకునే వ్యాసాలు కూడా సుదీర్ఘంగా ఉన్నా సరే, అందులో ఎంతోకొంత మసాలా దట్టిస్తుంటాడు కాబట్టి దానికి కాస్త రీడర్స్ ఎక్కువే…

ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ వ్యాసాల్లో వైవిధ్యం ఎక్కువ… పత్రిక పొలిటికల్ లైన్‌కు, ఐడియాలజీకి భిన్నంగా ఉన్న వ్యాసాల్నీ పబ్లిష్ చేస్తుంటారు… నిజానికి రాధాకృష్ణ కొత్త పలుకు వ్యాసాల్ని… ఏం రాశాడని అస్మదీయ టీడీపీయులకన్నా, తస్మదీయ జగనీయులే ఎక్కువగా చదువుతారు… అక్కడక్కడా కొన్ని పేరాల్ని హైలైట్ చేయడం, మంచి గ్రాఫిక్ ఇమేజ్ గట్రా కొత్త పలుకు లుక్ పర్వాలేదనిపిస్తాయి… కానీ సాక్షి..? చూశారుగా… పైన పేజీ…

ఒక్క టంటే ఒక్క సబ్‌హెడింగ్ లేదు… సరైన పేరాల విభజన కూడా లేదు… జస్ట్, కాపీ ఒరిజినల్ టెక్స్ట్ అండ్ పేస్ట్… అంతే… లెంత్ ఎక్కువ ప్లస్ ఆకట్టుకునేలా, చదివించేలా పేజీ మేకప్ లేకపోవడం సాక్షి బాధ్యుల దృష్టికి రాలేదా..? లేక అందరూ వదిలేశారా..? చిన్నాచితకా వెబ్ పేపర్లు కూడా మంచి పేజీనేషన్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాయి… ఏక్‌సేఏక్… మరి అంత సాధనసంపత్తి ఉన్న సాక్షిని అందరూ అలా అనాథగా వదిలేస్తున్నారు ఎందుకో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓటి కుండకు మోత ఎక్కువ- గిల్ట్ నగలకు మెరుపు ఎక్కువ…
  • పాపం సాక్షి..! పాత ఎడిటర్ వ్యాసాలకూ ఇంత నాసిరకం ప్రజెంటేషనా..?
  • పక్షపాతం- పక్షవాతం…! తటస్థ మీడియా ఎక్కడుంది చంద్రబాబూ…?
  • ఉల్టా పేలిన హరీష్ తుపాకీ..! ఇరికించే ప్లాన్ చేసి దొరికిపోయాడు..!!
  • ప్రతివారం రెండురోజులు లాక్‌డౌన్… పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం…
  • మా ఇడ్లీపై పడ్డారేంట్రా బాబూ… మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా…
  • లేడీ గెటప్పులో ఈ నరేష్… తల్లి విజయనిర్మలకన్నా అందంగా…
  • ఏదో ఒకరోజు… తప్పకుండా వస్తుంది… అప్పుడు ‘గుర్తింపు’ తథ్యం…
  • జాతి రథసారథులు… టాప్-100 వ్యక్తుల జాబితా, పరిచయాలు…
  • నో కేసీయార్… నో జగన్… టాప్-25 జాబితాలో రేవంత్ రెడ్డి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions