.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందా..? ఇదీ కొందరి ప్రశ్న..! ఖచ్చితంగా అభివృద్ధి దిశలోనే ఉంది… దీనికి పక్కా నిదర్శనం రాష్ట్రంలో సగటు తలసరి విద్యుత్తు వినియోగం పెరగడం..! ఎకానమీ బేసిక్స్ తెలిసినవాళ్లు ఎవరైనా సరే చెప్పే ఓ ప్రాథమిక సూత్రం ఇది… తలసరి విద్యుత్తు వినియోగంలో పెరుగుదల అభివృద్ధికి సంకేతం…
రోజూ టన్నుల బురద జల్లే బీఆర్ఎస్ క్యాంపు రాతలు, కూతలు, చేతల మాయలో పడిపోకుండా… స్థిమితంగా, శాస్త్రీయంగా ఆలోచిస్తే తేలే నిజం… తెలంగాణ పక్కాగా మోర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది… అప్పట్లో సమైక్య వాదులు పెట్టిన శాపనార్థాల్లో ఒక్కటంటే ఒక్క శాతం కూడా ఫలించలేదు, పైగా వాళ్లు కుళ్లుకునేలా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది…
Ads
ఈ క్లిప్పింగ్ ఓసారి చదవండి…

మార్చి మొదటి వారంలోనే తెలంగాణ పవర్ డిమాండ్ కొత్త రికార్డుకు చేరుకుంది… అఫ్‌కోర్స్, నడి వేసవికి ఇంకా పెరగొచ్చు.., కానీ ఈ డిమాండ్ వేసవి మొదలైన కారణంగా పెరిగింది కాదు, స్థిరంగా అవసరాలు పెరుగుతున్నాయి, ఆమేరకు డిమాండ్ పెరుగుతోంది… సగటు తలసరి విద్యుత్తు వినియోగం కూడా అందుకే పెరుగుతోంది… 2028 నాటికి ఈజీగా 20 వేల మెగావాట్లు దాటిన డిమాండ్‌కు చేరుకోబోతున్నాం…
ఐటీ విస్తరణ, ఫార్మా, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ గ్రోత్ వంటి రకరకాల అంశాలు ప్రభావితం చేస్తున్నాయి… సొంత ఉత్పత్తి సామర్థ్యం ప్లస్ పవర్ గ్రిడ్ నుంచి కొనుగోళ్లతో తెలంగాణ అలవోకగా ఈ డిమాండ్‌కు తగినట్టు సరఫరా చేస్తోంది… పెద్ద పెద్ద రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ విద్యుత్తు డిమాండ్ పెరగడం ఆర్థికవేత్తలనూ ఆకర్షిస్తోంది… హైదరాబాద్ మాత్రమే తెలంగాణ ఇతర జిల్లాల్లోనూ డెవలప్‌మెంట్ యాక్టివిటీ పెరగడం ఓ కారణం…
సరే, మరో కారణం, నిదర్శనం కూడా చూడాలి ఓసారి… మేం లేకపోతే మీ బతుకు లేదు, మీకు ఆ తెలివి లేదు అని సమైక్యాంధ్రవాదులు తూలనాడారు కదా… ఈనాడులోనే వచ్చిన ఈ క్లిప్ చదవండి…
ది గ్రేట్ విజనరీలు పాలించిన, పాలిస్తున్న ఏపీలో కేవలం 5 శాతం జీఎస్టీ పెరుగుదల (గత ఏడాది ఫిబ్రవరిలో, ఈ ఫిబ్రవరిలో వసూళ్లలో పెరుగుదల పోలిక) నమోదైతే… తెలంగాణలో ఏకంగా 14 శాతం… జాతీయ సగటు 8 శాతంతో పోలిస్తే కూడా చాలా ఎక్కువ… 2025-26 ఆర్థిక సంవత్సరంలోని 11 నెలల జీఎస్టీ వసూళ్లలోనూ ఏపీ 3 శాతం మాత్రమే, తెలంగాణ 5 శాతం పెరుగుదల… మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ వసూళ్లు ఉంటున్నాయి… ఇవీ తెలంగాణ అభివృద్ధి సూచికలు- గణాంకాలు…
చివరగా… ఈ గణాంకాలు చూసి ఇదంతా మా కేసీయార్ వేసిన పునాదుల ఫలితమే అని బీఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వ సాయం వల్లే ఈ ప్రగతి అని బీజేపీ సన్నాయినొక్కులకు దిగొచ్చు… రాజకీయాల్లో సహజం… సమైక్యాంధ్ర నేతలు కూడా మా ఆంధ్రులు చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి అని కూడా అనొచ్చు ఉడుకుమోతుతనంతో… ఈ సణుగుళ్లు, ఈ రణగొణల నడుమ తెలంగాణ అన్ని వనరులతో తనదైన అభివృద్ధి దిశలో నిశ్శబ్దంగా, వేగంగా సాగిపోతూనే ఉంది..!! అదీ నిజం..!! అడ్డగోలు అతి ప్రచారాల కాళేశ్వరం పనిచేయక పడావు పడినా తెలంగాణ రైతు వరి ఉత్పత్తిలో అనితర సాధ్యమైన రికార్డులు సాధించినట్టుగానే..!!
Share this Article