Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫన్‌కీ..! సారీ, అనుదీప్… అంత పెద్దగా నవ్వించలేకపోయావ్..!!

February 13, 2026 by M S R

.

ప్రజెంట్ తెలుగు సినిమాల ట్రెండ్ ఏమిటి..? పంచ్ వన్ లైనర్స్, లాజిక్ లేని కామెడీ‌తో కథ నడిపించేయడం..! మరి కథే సరిగ్గా లేకపోతే, కేవలం ఏవో నాలుగు జోకులతో నడిపించాలనుకుంటే..? కుదరదు… కుదరలేదు… అనుదీప్, విశ్వక్‌సేన్, కాయదు లోహర్ సినిమా ఫంకీ ఇదే బాటలో ఉంది…

అనుదీప్ ఇంకా జాతిరత్నాలు హ్యాంగోవర్ నుంచి బయటపడటం లేదు… ఆ సినిమా రిలీజు సందర్భంలో, ఆ సమయంలో అది క్లిక్కయింది… ప్రతిసారీ కుదరదు… మొన్నటి సంక్రాంతి సినిమాలే తీసుకొండి… మన శివశంకర ప్రసాద్ గారు సినిమాలో అధికంగా అనిల్ రావిపూడి తన స్టయిల్ కామెడీ మీదే ఆధారపడ్డాడు… కానీ ఓ కథ ఉంది… అనగనగా ఒక రాజు సినిమాను పోలిశెట్టి నవీన్ తనదైన స్టయిల్‌లో నిలబెట్టాడు… నారీనారీనడుమ మురారి సినిమాలో కూడా శర్వానంద్ కామెడీతో మెప్పించాడు… ఆ పాత్రలు వాళ్లకు సూటయ్యాయి…

Ads

కానీ ఎందుకో గానీ విశ్వక్‌సేన్ బాగానే నటించినా సరే, అనుదీప్ మార్క్ కామెడీ ఫ్రేమ్‌లో తను సరిగ్గా ఫిట్ కాలేదేమో అనిపించింది… వివరాల్లోకి వెళ్తే… ‘ఫంకీ’ కేవలం కథ మీద ఆధారపడ్డ సినిమా కాదు… ఒక సాదాసీదా పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇది… కెరీర్ కష్టాల్లో ఉన్న ఒక సినిమా దర్శకుడు (విశ్వక్ సేన్), తన సినిమాను ఎలా పూర్తి చేశాడు? తన ప్రేయసి చిత్ర (కాయదు లోహర్) మనసును ఎలా గెలుచుకున్నాడు? అనేదే ఈ చిత్ర ప్రాథమిక ఇతివృత్తం…

విశ్వక్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఒక ‘మిక్స్‌డ్ బ్యాగ్’ అని చెప్పాలి… ఓ అమాయకపు పాత్రలో నటించినా, ఎక్కడా అది ప్రత్యేకంగా అనిపించదు… తన నటన వరకూ వోకే… కాయదు స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించింది… తన కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి… కానీ, ఆమె పాత్రను చాలా సాధారణంగా రాసుకోవడం వల్ల నటనకు పెద్దగా స్కోప్ లేదు…

విశ్వక్ సీన్

సంపత్ రాజ్ పాత్ర పరిమితంగా ఉంటే, మురళీధర్ గౌడ్ ఒక్క సీన్‌లో మెరిసి నవ్వులు పూయించాడు…  అనుదీప్, కల్యాణ్ శంకర్ ట్రాక్ లు సాగదీసినట్లు ఉండి కాస్త చిరాకు తెప్పిస్తాయి…

దర్శకుడు అనుదీప్ తన గత చిత్రం ‘జాతిరత్నాలు’ మ్యాజిక్‌ను విశ్వక్ సేన్ ద్వారా రీక్రియేట్ చేయాలని గట్టిగా ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం క్లిక్ కాలేదు… సినిమా ప్రారంభమైన 30 నిమిషాలు వన్-లైనర్స్, జోకులతో బాగానే సాగుతుంది… కానీ ఆ జోకులు సినిమాను నిలబెట్టలేకపోయాయి సరికదా కామెడీ సహజంగా కాకుండా, కావాలని బలవంతంగా నవ్వించడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది, ఓ దశలో ఇక చిరాకు మొదలవుతుంది… 

సీన్ల మధ్య సరైన ఫ్లో లేదు… అమాయకత్వం నుంచి పుట్టాల్సిన హాస్యం, ఇక్కడ ‘స్టేజ్ షో’ లాగా అనిపిస్తుంది… ‘జాతిరత్నాలు’లో ఉన్న ఆ సింపుల్ మేజిక్ ఇక్కడ పూర్తిగా మిస్ అయ్యింది… భీమ్స్ సంగీతంలో ఒక పాట మినహా మిగతావి ఆకట్టుకోవు…

సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమిటంటే..? అక్కడక్కడా పేలిన కొన్ని వన్-లైనర్స్… హీరోయిన్ గ్లామర్… మైనస్ పాయింట్స్ ఏమిటంటే..? ‘జాతిరత్నాలు’ను అనుకరించే బలహీనమైన ప్రయత్నం… హీరో క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేకపోవడం… బలవంతపు కామెడీ, బోర్ కొట్టించే సెకండాఫ్…

ప్రధాన లోపం ఎడిటింగ్… యూట్యూబ్ కామెడీ బిట్లను ఒక్కచోట కలిపి కుట్టేసినట్టుగా… అసలు ఓ ఫ్లో లేకుండా పోయింది… చివరకు వాయిస్ రికార్డింగ్ కూడా సరిగ్గా చూసుకోలేదు టెక్నికల్ టీమ్… దర్శకులు, నిర్మాతలు గెస్టులుగా కనిపించినా నో ఇంపాక్ట్… హీరో హీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ కూడా పండినట్టు అనిపించలేదు… వెరసి అనుదీప్ విశ్వక్‌సేన్‌తో కలిసి పెద్దగా మెప్పించలేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫన్‌కీ..! సారీ, అనుదీప్… అంత పెద్దగా నవ్వించలేకపోయావ్..!!
  • అతడు… టీవీ ప్రసారాల్లో తిరుగులేని రికార్డు… థియేటర్లకు మళ్లీ వస్తాడట…
  • అబ్బో… ఈ ప్రముఖ గ్రంథ ‘సాంగు’డి కథలో ఈ కోణాలూ ఉన్నాయా..?
  • D-Dad …! చిన్నారులకు డిజిటల్ చెర నుంచి విముక్తి… గుడ్ ప్రోగ్రామ్..!!
  • లైఫ్ పీర్..! మన శనిగరం ఉదయ్ నాగరాజు కొత్త హోదా కథేమిటి..?!
  • గాంధీ సరోవర్ ప్రాజెక్టు- గేట్ వే ఆఫ్ హైదరాబాద్… ఏమిటివి..? ఎక్కడ..?
  • దేవుళ్లు ఎవరి గుప్పిట్లో ఉన్నారు..? అసలు విముక్తికి ఏమిటీ మార్గం..?!
  • కౌంటర్ నెరేటివ్స్..! ఆ లడ్డూ నెయ్యికీ, ఈ పెరుగుకూ లింకేమిటి..?
  • బెడిసికొట్టిన పాము కుబుసం ప్లాన్… టీవీ సీరియళ్లు తెగ చూసేదేమో…
  • సమాజ హిత కథనమే… కానీ పెద్దగా పదును లేని కృష్ణ ఆయుధం …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions