Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాట్ ఏ మ్యాచ్..! 13 ఓవర్లలోనే ఫినిష్ చేసి, వరల్డ్ కప్ ఫైనల్స్‌లోకి…

March 4, 2026 by M S R

.

అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు… అన్ని మ్యాచులూ గెలుస్తూ వస్తున్న దక్షిణాఫ్రికా ఇంత దారుణంగా ఓడిపోతుందని…. పాకిస్థాన్‌ను శ్రీలంక ఇంటికి పంపిస్తే తప్ప సెమీస్‌కు పోలేం కదా అని బిక్కుబిక్కుమంటూ చూసిన న్యూజీలాండ్ ఇంత అలవోకగా గెలుస్తుందని…

టీ20 అంటేనే… చివరి బాల్ దాకా, పోనీ, చివరి ఓవర్ దాకా ఉత్కంఠ ఉంటుంది… కానీ న్యూజీలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ ఏకంగా 300 స్ట్రయిక్ రేటుతో (33 బంతుల్లో 8 సిక్సులు, 10 ఫోర్లు) ఒంటి చేత్తో 100 పరుగులు చేసి తన జట్టును ఫైనల్స్‌కు తీసుకుపోతాడని… చాన్నాళ్లు గుర్తుండిపోయే నాక్…

Ads

నిజంగా ఏం మ్యాచ్ ఇది… 13 ఓవర్లలోనే దక్షిణాఫ్రికాను చుట్టచుట్టి పారేశారు… ఆట మొదలైనప్పటి నుంచీ అలెన్ జోరు చూసి దక్షిణాఫ్రికా టీమ్ కళ్లప్పగించి చూడటం తప్ప ఇంకేమీ చేయడానికి లేకుండా పోయింది… కళ్ల ముందే ఒకే ఒక్కడు తమ నుంచి మ్యాచ్‌ను తీసుకుపోతుంటే పాపం, ఎప్పుడు కీలకమైన మ్యాచుల్లో గెలుపు ముందట బోర్లాపడే తమ గ్రహచారం కంటిన్యూ అవుతున్నట్టుంది…

నిజానికి 77 పరుగులకే 5 వికెట్లు పడిపోయిన దక్షిణాఫ్రికాను మార్కో జాన్‌సెన్ తన 55 పరుగుల బ్యాటింగుతో గౌరవప్రదమైన స్కోర్ దాకా తీసుకుపోయాడు… 168 మరీ హీనమైన స్కోర్ ఏమీ కాదు… ఫైటింగ్ స్కోరే… కానీ అలెన్ బీభత్స బ్యాటింగు అసలు అదొక స్కోరేనా అన్నట్టుగా మారిపోయింది…

అలెన్

ఇండియా గనుక రేపటి సెమీస్‌లో గెలిస్తే ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది అలెన్‌నే… క్లియర్ కట్ టార్గెట్… మేం అభిషేక్ శర్మను టార్గెట్ చేస్తామని ఇంగ్లండ్ ప్లేయర్లు కామెంట్స్ చేస్తూ ఏవో కథలు పడుతున్నారు గానీ, నిజానికి వాళ్ల టార్గెట్ శాంసన్, ఇషాన్…

అభిషేక్ శర్మ ఫామ్‌లో లేడని వాళ్లకూ తెలుసు… కాకపోతే డైవర్షన్… సూర్య, హార్ధిక్ ఉండనే ఉన్నారు… ఎటొచ్చీ సూర్యకుమార్ కెప్టెన్సీయే అడ్డదిడ్డంగా ఉంటోంది… అదొక్కటే అసలు సమస్య… ఆ అడ్డంకులన్నీ దాటేసి, సెమీస్ గెలిస్తే.., అసలు పోరు ఇదుగో ఈరోజు అదరగొట్టిన ఈ న్యూజీలాండ్ జట్టుతోనే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాట్ ఏ మ్యాచ్..! 13 ఓవర్లలోనే ఫినిష్ చేసి, వరల్డ్ కప్ ఫైనల్స్‌లోకి…
  • బీహార్ రాజకీయాల్లో మార్పు..? ఎవరు ఈ సామ్రాట్ చౌదరి..?!
  • ఆయిల్ నిల్వలు – 25 రోజులు కాదు, మొత్తం 74 రోజులకు సరిపడా..!
  • తెలుగునాడు కాదు అవధానీ… ఆంధ్రనాడు… స్వర్ణాంధ్ర భేషైన పదం…
  • కెప్టెన్ టోపీ తీసి అభినందించినప్పుడు నవ్వాడు ఓ నవ్వు… అదీ శాంసన్…
  • లక్షల కోట్ల సంపదకు ట్రస్టీలు… గుడిలో చెత్త ఊడ్చి వెళ్తుంటారు…
  • అక్యూజ్డ్..! ఓ భిన్నమైన జానర్… ‘‘‘సేమ్ జెండర్ కపుల్’’ కథ…
  • తెలంగాణ ప్రగతికి నిజమైన సూచికలు ఏమిటో తెలుసా..? ఇదుగో..!
  • చమురు మంటలే కాదు… డిజిటల్ ప్రపంచానికీ పొంచిన ముప్పు…
  • మతిస్థిమితం తప్పిన హత్యలు- ప్రతీకారం… ఘటనాఘటన సమర్థత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions