.
ఖచ్చితంగా దక్షిణాఫ్రికా జట్టుకు నిన్నటి మ్యాచులో విజయానికి అర్హత ఉంది… పర్‌ఫెక్ట్ వ్యూహంతో బాగా ఆడింది… పైకి అరివీర భీకరంగా కనిపిస్తున్న ఇండియా ఎందుకు అంత చెత్తగా ఆడి ఓడింది…? మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు, ఇండియా బ్యాటింగ్ మొదటి ఓవర్ నుంచే రాబోయే ఫలితం కళ్లకు కనిపిస్తూనే ఉంది…!!
ఆట అన్నాక గెలుపూ ఓటమీ రెండూ ఉంటాయి… పైగా ఓడింది ఏదో అనామక జట్టు మీద కూడా కాదు, కానీ ఓడిపోయిన తీరే సగటు ఇండియన్ ఫ్యాన్‌ను ఆగ్రహానికి గురిచేస్తోంది… సోషల్ మీడియా, మీడియాలో అందుకే పదునైన విమర్శలు కనిపిస్తున్నాయి…
Ads
నిజానికి ఆట ఆరంభంలోనే ఇండియాకు కొంత సానుకూలత దక్కింది… దక్షిణాఫ్రికా బ్యాటింగు సమయంలో మూడు వికెట్లు చకచకా పడిపోయాయి… 20 పరుగులకే… కానీ మిడిలార్డర్‌లో బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్ మంచి భాగస్వామ్యాల్ని నిర్మించి, సింగిల్స్ తీస్తూ, చాన్స్ దొరికినప్పుడు షాట్లు కొడుతూ స్కోరును 187 దాకా తీసుకుపోయారు… అది తక్కువ స్కోరేమీ కాదు…
ఇండియా బౌలర్లు మరీ ధారాళంగా, అత్యంత ఉదారంగా పరుగులు ఇచ్చేశారు.,. దూబె తన ఓవర్‌లో 16 రన్స్ ఇస్తే, హార్డిక్ పాండ్యా అయితే చివరి ఓవర్‌లో ఏకంగా 20 రన్స్ ఇచ్చాడు… 4 ఓవర్లు వేసి, 45 రన్స్ ఇచ్చినా ఒక్క వికెటూ తీయలేకపోయాడు… వరుణ్ చక్రవర్తి కూడాా అంతే… కాకపోతే ఒక వికెట్ వచ్చింది…
అసలు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఎందుకు తీసుకొచ్చారో ఎవరికీ తెలియదు… తను బౌలింగు, బ్యాటింగులోనూ ఫ్లాప్… సమ్ వాట్ అర్షదీప్ బెటర్… బుమ్రా చాలా బెటర్ 3.75 ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు… తీరా బ్యాటింగుకు వచ్చాక…
నిజంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ ప్రతి బంతికీ ఓ వ్యూహం, ప్రతి బ్యాటర్‌కూ వ్యూహం పన్నాడు… ఒక్క దశలోనూ ఇండియా బ్యాటర్లను క్రీజులో కుదురుగా నిలబడనివ్వలేదు, షాట్లు కొట్టేలా ప్రేరేపించడం, సరైన ఫీల్డింగ్‌తో ఔట్ చేయడం… వాళ్ల బౌలర్లు కూడా పకడ్బందీగా బౌల్ చేశారు… పర్టిక్యులర్‌గా మార్కో జాన్‌సెన్ 4 ఓవర్లు వస్తే 12 డాట్ బాల్స్… 4 వికెట్లు..,
ఎప్పుడైతే ఇషాన్ కిషన్ ఔటయ్యాడో అప్పుడే ఇదేదో తేడా కొడుతోందని సగటు ఇండియన్ ప్రేక్షకుడికి అర్థమైపోయింది… వరుసగా ఫ్లాపవుతున్న అభిషేక్ అంతే… పోనీ, ఏ ఇద్దరైనా ఓ మంచి భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ప్రయత్నించారా అంటే అదీ లేదు… వచ్చారు, పోయారు… మొదటి నుంచే షాట్లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు…
బాధ్యతారాహిత్యం అనండి, నిర్లక్ష్యం అనండి, ఇంకే పేరైనా పెట్టండి… ఏ దశలోనూ ఇండియా నుంచి సరైన ఆటతీరు కనిపించలేదు బౌలింగులో, బ్యాటింగులో..! కనీసం సూర్యకుమార్, హార్డిక్ నుంచి ప్రేక్షకులు ఎంతో ఆశించారు… వాళ్లూ కేర్‌లెస్‌గానే ఆడారు… చివరకు ఓ భారీ ఓటమి ఇండియా ఖాతాలో పడింది…
ఈ దెబ్బకు ఎంత ఇరకాటంలో పడిందీ అంటే… ప్రస్తుతం ఇండియా నెట్ రన్ రేట్ మైనస్ 3.8 కు పడిపోయింది… తరువాత జింబాబ్వే, వెస్టిండీస్‌లతో ఆడాలి… అవీ ఈ వరల్డ్ కప్ పోటీల్లో మంచి పర్‌ఫామెన్స్ చూపిస్తున్నాయి, వాటిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు… అవి గెలవడంతోపాటు నెట్ రన్ రేట్ బాగా మెరుగుపడాలి… అదీ ఇప్పుడు ఆందోళనకరం…
నిజానికి ఈ వరల్డ్ కప్ పోటీలను కో-హోస్ట్ చేస్తున్న శ్రీలంక గతీ ఇలాగే ఉంది… ఇంగ్లండ్ మీద అదీ ఇలాగే చిత్తుగా ఓడిపోయింది… మరీ 146 పరుగులకే ఇంగ్లండ్‌ను కట్టడి చేసి శ్రీలంక పైచేయి సాధించింది కానీ ఇంగ్లండ్ దాన్ని కూడా డిఫెండ్ చేసుకుని, శ్రీలంకను మరీ 95 పరుగులకు పరిమితం చేసేసింది… దీంతో శ్రీలంక జట్టు నెట్ రన్ రేట్ ఇప్పుడు మైనస్ 2.55… అదీ తరువాత పాకిస్థాన్, న్యూజిలాండ్‌లతో ఆడాలి, అవీ టఫ్ ఫైట్ ఇవ్వగలవు… వెరసి ఇద్దరు హోస్టులూ ఇరకాటంలో పడిపోయారు..!!
Share this Article