Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇరాన్ యుద్ధనీతిని అస్సలు అంచనా వేయలేని ట్రంప్ వైఫల్యం…

April 8, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. అమెరికా, ఇజ్రాయేల్ Vs ఇరాన్, రష్యా, చైనా! Part 2 …
అమెరికా, ఇజ్రాయేల్ ఇరాన్ మీద దాడి చేయకముందు….
హార్మోజ్ జలసంధి నుండి అన్ని దేశాలకి ప్రవేశం ఉంది!
అమెరికా, ఇజ్రాయేల్ లు ఇరాన్ మీద దాడి తరువాత…
హార్మోజ్ జలసంధి మోసివేయబడ్డది! టోల్ గేట్ పెట్టి పన్నులు వసూలు చేస్తున్నది ఇరాన్!
దాడికి ముందు ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం మీద ఆంక్షలు ఉండేవి. దాడి తరువాత ఆంక్షలు ఎత్తివేసింది అమెరికా!

దాడికి ముందు బ్రెంట్ క్రూడ్ ధర 65 డాలర్ల దగ్గర స్థిరంగా ఉండేది! దాడి తరువాత 115 డాలర్లకి చేరుకొని తరువాత తగ్గి ఇప్పుడు 90 డాలర్ల దగ్గర కొట్టుమిట్టాడుతున్నది!
హార్మోజ్ జలసంధి దాటడానికి ఇరాన్ కి టోల్ టాక్స్ కట్టాలి.
టోల్ టాక్స్ ఎలా వసూలు చేస్తున్నది ఇరాన్?
హార్మోజ్ ని దాటాలి అంటే ఇరాన్ కి టోల్ టాక్స్ కట్టాలి వాటిని నాలుగు రకాలుగా విభజించి అమలు చేస్తున్నది ఇరాన్ ఇలా..

Ads

వెసల్ లేదా షిప్ కి సంబంధించి చూసేవి…
1.జెండా ( Flag )
2.యజమాని ఎవరు ( ownership )
3.కార్గో ఎక్కడికి వెళుతున్నది ( destination )
4.కోర్గో ఏ దేశానికి చెందినది ( origin of corgo )

****************
జెండా (flag )
షిప్స్ కనుక ఇరాన్, రష్యా, చైనాలలో రిజిస్టర్ అయిఉంటే అనుమతి అక్కరలేదు.
భారత్, థాయిలాండ్, ఇరాక్, ఒమన్, ఇండోనేషియా, పాకిస్థాన్, మలేషియా దేశాల జెండాలు ఉంటే అనుమతి తీసుకోవాలి కానీ ¥ 2.5 మిలియన్ CNY ( చైనా కరెన్సీ ) లు టోల్ టాక్స్ కడితే అనుమతి ఇస్తారు!
2.5 మిలియన్ CNY = 3,63,232 డాలర్లు.
2.5 మిలియన్ CNY = 3,38,58,400 రూపాయలు.
మిగతా దేశాలకి అనుమతి లేదు
మార్షల్ ఐలాండ్స్, లైబీరియా, పనామా దేశాల జెండాలు ఉంటే కార్గో ఏమిటి, ఎక్కడికి వెళుతున్నది? యజమాని ఎవరు అన్న వాటిని పరిశీలించి అనుమతి ఉంటుంది, అది కూడా టోల్ టాక్స్ కట్టిన తరువాతే!

***************
కార్గో ఆరిజిన్ – Cargo Origin
క్రూడ్ ఆయిల్, LNG లని తీసుకెళ్లే ఇరాక్, ఇరాన్, ఒమన్ దేశాలవి అయితే అనుమతి ఉంటుంది.
క్రూడ్ ఆయిల్, LNG లని తీసుకెళ్లే షిప్స్ కనుక సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, UAE లవి అయితే అనుమతి ఇవ్వరు.
కొన్ని మినహాయింపులు ఇచ్చింది ఇరాన్….
ఆర్డర్స్ కనుక 28-02-2026 కి ముందు ఇచ్చి ఉంటే ఆ షిప్పులు సముద్రంలో నిలబడిపోయి ఉంటే టోల్ టాక్స్ కట్టి వెళ్లిపోవచ్చు… అయితే పైన పేర్కొన్న విభాగాలలతో పోల్చి చూసుకొని అనుమతి ఇస్తారు.
GCC దేశాల నుండి చైనాకి వెళ్లే కార్గో షిప్స్ కనుక ఫిబ్రవరి 28 కి ముందు ఆర్డర్ చేసి ఉంటే టోల్ టాక్స్ కట్టి వెళ్ళవచ్చు.

ఉదాహరణకు…
ఇరాక్ నుండి క్రూడ్ ఆయిల్ లోడ్ చేసుకొని భారత్ కి వెళ్తున్న షిప్ ఏదన్నా యూరోపియన్ దేశంలో రిజిస్టర్ అయిఉండి, యూరోపియన్ దేశపు జెండా ఉంటే అనుమతి ఇవ్వరు. జపాన్ కి చెందిన షిప్ అయినా సరే భారత్ కి వెళ్తుంటే అనుమతి ఇవ్వరు.
ఇక్కడ అనుమతి ఇవ్వరు అంటే టోల్ టాక్స్ కడతామన్నా అనుమతి ఇవ్వరు.
అదే సౌదీ నుండి చైనాకి క్రూడ్ ఆయిల్ తీసుకెళ్లే షిప్ చైనాదే అయినా టోల్ టాక్స్ కట్టి వెళ్ళాలి.
ఖతార్ నుండి చైనాకి LNG తీసుకెళ్లే షిప్ టోల్ టాక్స్ కట్టి వెళ్ళాలి.
షిప్ చైనాది అయి క్రూడ్, LNG లని చైనాకి కాకుండా ఇతర దేశాలకి వెళ్తుంటే అనుమతి ఇవ్వరు.

****************
ఈ డాటా మార్చి 1 నుండి మార్చి 25 2026 వరకూ వర్తిస్తుంది.
భారత్ కి చెందిన షిప్స్ మార్చి 25 వరకు హార్మోజ్ దాటి వచ్చినవి 27 మాత్రమే! అనుమతి కోసం వేచి చూస్తున్నవి 189 దాకా ఉండవచ్చు. అనుమతులు ఇవ్వకపోవడానికి కారణం సదరు షిప్పులు మన దేశానివి కాకుండా యూరోపు లేదా ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలవి అయిండవచ్చు!
మొత్తంగా చూస్తే అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేస్తే ఏం చేయాలో ఇరాన్ ముందే ప్లాన్ సిద్ధం చేసుకొని హార్మోజ్ ని మూసివేయడం ద్వారా అమలు చేసింది!

ఇరాన్ హార్మోజ్ ని మూసివేస్తే ఏం చేయాలో అమెరికా, ఇజ్రాయేల్ దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు.
సమస్య ఇరాన్, ఇజ్రాయల్ దేశాల మధ్య ఉంది!
దానికోసం ప్రపంచం మొత్తం బాధపడాలా?
ఇరాన్ అణు బాంబు తయారు చేసేది ఇజ్రాయేల్ మీద ప్రయోగించడానికే అన్నది నిజం!
అణు బాంబు తయారు చేయడానికి హెవీ వాటర్ ( భారజలం ) అవసరం!
ఇరాన్ లోని హెవీ వాటర్ ప్లాంట్ ఉన్న ఇస్ఫహాన్ మీద దాడి చేసి దానిని ధ్వంసం చేసింది అమెరికా, ఇక్కడితో సమస్య తీరిపోయింది!

హెవీ వాటర్ ప్లాంట్ కట్టడానికి మరో నాలుగేళ్లు పడుతుంది! ఈ లోగా చర్చలు జరిపి ఒక పరిష్కారానికి రావొచ్చు.
ఇరాన్ లో అమెరికా తన కీలుబొమ్మ అయిన రెజా పెహ్లావి ని కూర్చోపెట్టడానికి జరుగుతున్న యుద్ధంలో ఇతర దేశాలు ఎందుకు నష్టపోవాలి?
మన దేశ ప్రజలలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదో ఒక దేశం మీద ప్రేమ కురిపిస్తున్నారు కానీ ఇదంత మంచిది కాదు!

2026 జనవరి నుండి మన ప్రధాని మోడీ BRICS చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు!
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి స్థాపించిందే బ్రిక్స్!
డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకొని కోల్డ్ వార్ సమయంలో (1947- 1989) 70 కోవర్ట్ ఆపరేషన్స్ చేసింది CIA.
మొత్తం 100 దేశాలలో ప్రభుత్వాలని పడగొట్టడం… తన కీలుబొమ్మ అధ్యక్షులని, ప్రధాన మంత్రులని, సైనిక నియంతలని కూర్చోపెట్టడం చేసింది!

Everything is fair in Love and War!
ఇది పాశ్చ్చాత్యుల స్లోగన్! చాణుక్యుడు చెప్పింది కాదు!

ఆపరేషన్ అజాక్స్ – Operation Ajax!
ఆపరేషన్ అజాక్స్ పేరుతో CIA కుట్ర చేసి 1953 లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ మోసదేగ్ ( Mohammad Mosaddegh ) ని పదవి నుండి తొలగించి షా మొహమ్మద్ రెజా పహ్లావి ని ఇరాన్ రాజుగా నియమించింది అమెరికా!
మొహమ్మద్ మోసదేగ్ ఎన్నికలలో గెలిచి ప్రధాన మంత్రి అయ్యాడు. మొహమ్మద్ మోసదేగ్ చేసిన పాపం ఏమిటంటే ఇరాన్ లోని ఆయిల్ పరిశ్రమని జాతీయం చేయడమే!

మొహమ్మద్ మోసదేగ్ ఆయిల్ పరిశ్రమని జాతీయం చేయడానికి బలమైన కారణం ఉంది. ఇరాన్ లో క్రూడ్ ఆయిల్ పరిశ్రమ నుండి వచ్చే ప్రతీ 100 డాలర్లలో 70 డాలర్లు బ్రిటీష్ పెట్రోలియంకి వెళ్లిపోయేది! ఎందుకంటే ఆయిల్ ని తోడి శుద్ధి చేయడం బ్రిటీష్ పెట్రోలియం చేసేది. మొహమ్మద్ మెసెదెగ్ ఆయిల్ పరిశ్రమని జాతీయం చేసి ఆదాయం లో 70% బ్రిటన్ కి వెళ్లకుండా చేసాడు. జాతీయం చేయడం వలన బ్రిటన్ కి 70% కి బదులుగా 30% ఆదాయం మాత్రమే దక్కుతుంది!

ఎప్పుడైతే ఇరాన్ ఆయిల్ పరిశ్రమ మీద బ్రిటన్ కంట్రోల్ పోయిందో వెంటనే కుట్రకి పధక రచన జరిగింది!
చరిత్రని లోతుగా అవగాహన చేసుకున్న వాళ్ళకి బ్రిటన్ అమెరికాలు రెండు వేరు వేరు దేశాలుగా కనపడవు! అమెరికా అనేది యూరోపియన్ కాలనీ. డోనాల్డ్ ట్రంప్ తాత ఫ్రెడ్రిచ్ ట్రంప్, నాయనమ్మ ఎలిజిబెత్ క్రైస్ట్ ట్రంప్ జెర్మనీ లో పుట్టారు. 1885 లో జెర్మనీ నుండి అమెరికాకి వలస వచ్చారు. డోనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ 1905 bronx, న్యూయర్క్ సిటీ లో పుట్టాడు. డోనాల్డ్ ట్రంప్ తల్లి మేరీ అన్నే మెక్ లియోడ్ స్కోట్లాండ్ లో పుట్టి అమెరికాకి వలసవచ్చింది.

1947 లో బ్రిటన్ తన ప్రపంచ ఆధిపత్యాన్ని అమెరికాకి అప్పచెప్పి పక్కకి తప్పుకుంది!
1953 లో ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ మెసేదెగ్ ని పదవి నుండి దించడానికి CIA 5 మిలియన్ డాలర్లని ఖర్చుపెట్టి ప్రతిపక్ష నాయకులని, పత్రికా యజమానులని, చివరికి సైనిక జనరళ్ళని కొనేసింది.
1953 ఆగస్ట్ లో మొహమ్మద్ మెసేదేగ్ కి వ్యతిరేకంగా ఇరాన్ లో ఉద్యమం మొదలై సైన్యం బెదిరింపులతో మొహమ్మద్ మోసేదేగ్ రాజీనామా చేయాల్సివచ్చింది!

1953 లో షా మొహమ్మద్ రెజా పహ్లావి ని ఇరాన్ రాజుని చేసింది! ప్రజాస్వామ్యంకి హాని కలుగుతున్నది అని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని కూల్చే అమెరికా ఇరాన్ లో ప్రజాస్వామ్యంని హత్య చేసి రాజరిక పాలనని ప్రవేశపెట్టింది!
1953 నుండి 1979 వరకూ అమెరికన్, బ్రిటీష్ దోపిడీ కొనసాగింది షా మొహమ్మద్ రెజా పహ్లావి రాచరిక పాలనలో!

ఇస్లామిక్ రేవల్యూషన్!
1978 లో ఇరాన్ లో అమెరికా, బ్రిటన్ అతి జోక్యం మీద ప్రతిపక్షాలు, లెఫ్టిస్ట్స్ కలిసి షా మొహమ్మద్ రెజా పహ్లావికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. వీళ్ళతో షియా మత గురువులు కలిశారు.
1979 లో షా దేశం వదిలి పారిపోగా ఆయుతోల్లా రౌహోల్లా ఖోమెనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాడు!

ఇరాన్ ప్రజల మీద దమన కాండ!
షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలనలో ఇరాన్ ప్రజల మీద సవాక్ ( SAVAK ) పేరుతో సీక్రెట్ పోలీసు వ్యవస్థ హింసకి పాల్పడేది!
ఖోమెనీ పాలనలో IRGC హింసకి పాల్పడుతున్నది!
అమెరికా చిచ్చు పెట్టకపోతే ఇరాన్ బాగానే ఉండేది!
పర్షియన్ గల్ఫ్ లో ఆశాంతికి కారణం అమెరికా, బ్రిటన్, ఇజ్రాయేల్ దేశాలు! పర్షియన్ గల్ఫ్ లో ఉన్న అన్ని దేశాలలో రాచరిక వ్యవస్థ ఉంది ఒక్క ఇరాన్ లో తప్ప! రాచరిక వ్యవస్థ ఉంటే అది అమెరికాకి మేలు చేస్తుంది!
Contd…part 3

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా ర్యాంకులకూ, జర్నలిస్టు అజ్ఙాన ప్రవర్తనకూ లింకేమిటబ్బా..!!
  • అదే నాగబాబు… అదే హైపర్ ఆది… అవే పాత టీమ్స్… మళ్లీ జనసేన షో…?
  • ఏ సీఎంకన్నా యోగి 17 వేల రెట్లు బెటర్… ఎవడు ఒప్పుకోకపోయినా సరే…
  • Chicken Neck …! ఇక 4 దేశాల సరిహద్దుల్లో ఇండియా రక్షణ దుర్గం..!!
  • Vaibhav ..! ఐపీఎల్ ఫార్మాట్‌కు తన ఒరిజినల్ ఆటతీరే సూటబుల్..!
  • కొత్త క్రికెట్ టీమ్స్… ప్రధానంగా బ్యాటర్లతో కూర్పు…
  • తండ్రి హంతకుడికి తమిళ సీఎం నివాళిని రాహుల్ ఎలా స్వీకరించాలి..?!
  • Damayanthi Sen … సాహసి… నిజం పట్ల నిబద్ధత… మళ్లీ ఓ కీలక పోస్టు..!!
  • ఈ కేసు భారత న్యాయ చరిత్రలో అరుదైన రాజ్యాంగ సంక్షోభమా?
  • ‘అమ్మా’… నీకు వందనం… మా పిల్లల, మా తల్లుల ప్రాణదీపం నువ్వు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions