.
రాహుల్ గాంధీ… విదేశాలకు వెళ్లి ఇండియా పరువు తీసే వ్యాఖ్యలు చేయడమే కాదు, కొన్నాళ్లుగా ఇండియాలోని రాజ్యాంగ సంస్థలను డిమోరల్ చేసి, రాజకీయ రంగులు పులమడానికి ప్రయత్నిస్తున్నాడు… భారతీయ వ్యవస్థకు ఇది ప్రమాదం… మొన్న స్పీకర్ మీద, ఇప్పుడు సీఈసీ మీద… తనకుతోడు ఓ తిక్కల రాజకీయవేత్త మమత కూడా తనకు ఇండికూటమిలో తోడు కలిసింది… యాంటీ బీజేపీ వేరు- యాంటీ సిస్టం వేరు… బీజీపీయే సిస్టం అనుకునే భ్రమల్లో పడిన ఫలితమిది…
జమిలి ఎన్నికలు దేశద్రోహమంటాడు స్టాలిన్… స్వయంగా లాయర్ డ్రెస్ వేసుకుని, సుప్రీం తలుపు తట్టి, భంగపడి, నిరసన దీక్షలు చేస్తూ… సర్ ప్రక్రియ ద్వారా తన వోటు బ్యాంకుగా ఉన్న అక్రమ వలసదారుల వోట్లు ఎక్కడ గల్లంతవుతాయోననే, వణుకుతో… అక్రమ వలసదారులే ప్రాణంగా బతికే మమత ఏదేదో చేస్తుంది … ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రెజర్ చేస్తే, తనకు సొంత వివేచన ఎలాగూ లేదు కదా… ఏకంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసనకు సిద్ధమైంది…
Ads
విచిత్రమేమిటంటే..? ఇండి కూటమి ఏది చేస్తున్నా లెఫ్ట్ మద్దతునిస్తుంది… బెంగాల్‌లో మళ్లీ లేవకుండా మమత చావుదెబ్బలు కొట్టినా సరే..! అఫ్‌కోర్స్, లెఫ్ట్- దేశభక్తి అనేవి డిబేటబుల్ పదాలు… 130 మంది లోకసభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు సీఈసీ అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన మీద సంతకాలు చేశారట… ఉభయసభల్లోనూ ప్రవేశపెడతారుట… సీఈసీపై అవిశ్వాసం దేశచరిత్రలోనే మొదటిసారి బహుశా…
మరణించినవాళ్లు, అక్రమ వలసదారులు, అసలు ఇండియా పౌరసత్వమే లేనివాళ్ల వోట్లు, ఫేక్ వోట్లు, దొంగ వోట్లు,, అనేకచోట్ల వోట్లు అన్నీ వోటర్ల జాబితాలో ఉండాల్సిందేననే ప్రతిపక్షాలు ఈ దేశపు దౌర్భాగ్యం… చివరకు సుప్రీం కోర్టు సైతం సర్ ప్రక్రియ నడవాల్సిందేనని చెప్పినా… క్షుద్ర రాజకీయం ఊరుకోదు కదా…

అసలు సీఈసీని ఎలా తొలగిస్తారు..? ఆ అభిశంసన ప్రక్రియ ప్రొసీజర్ ఏమిటి..? రాజ్యాంగంలోని Article 324(5) ప్రకారం ఎన్నికల కమిషన్ సభ్యులకు ప్రత్యేక రక్షణ ఉంది… ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం చాలా కఠినమైన ప్రక్రియ…
. ముందు నోటీసు ఇవ్వాలి అభిశంసనకు… లోకసభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది…
. స్పీకర్, ఉపరాష్ట్రపతి (రాజ్యసభ చైర్మన్) వాటి అర్హతను పరిశీలిస్తారు… తరువాత ఓ విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారు…
. అభిశంసన వోకే అనిపించుకుంటే ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీ ఏర్పావుతుంది… అందులో సుప్రీం జడ్జి ఒకరు, హైకోర్టు జడ్జి ఒకరు, ఓ న్యాయనిపుణుడు ఉంటారు… కమిషనర్ మీద ఆరోపణల్ని పరిశీలిస్తుంది ఈ కమిటీ…
. కమిటీ గనుక ఆరోపణలు నిజమే అని చెబితే అప్పుడు పార్లమెంటులో అభిశంసన కమ్ తొలగింపు తీర్మానం పెడతారు… అది ఆమోదం పొందాలంటే మెజారిటీ కాదు, మూడింట రెండొంతుల మంది వోటేయాలి… ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం… (ఆమోదం పొందితే రాష్ట్రపతి సదరు సీఈసీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు)…
. అసాధ్యమని తెలిసీ ప్రతిపక్షాలు ఎందుకు చేస్తున్నట్టు..? ప్రజల్లో చర్చ కోసం, బీజేపీని ఇరుకున పెట్టడం కోసం.,.. స్పీకర్ విషయంలో ఏం జరిగింది..? సీఈసీ విషయంలోనూ అదే జరుగుతుంది… స్పీకర్ మీద చర్చ మీద సీరియస్‌నెస్ లేకుండా కనీసం వోటింగు కూడా అడక్కుండా చేతులెత్తేసింది ప్రతిపక్షం… ఇండి కూటమి క్రమేపీ సిస్టమ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసే బాటలో నడుస్తోంది…!! వాటి కోణంలో ఇదొక నిరసన ప్రకటన…
Share this Article