Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మగాడు..! తెలుగులో సింగిల్ కమెండో ఆపరేషన్ సినిమాలు తక్కువే..!!

February 27, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మనకు తెలుగులో కమేండో ఆపరేషన్లు కధాంశంగా ఎక్కువ సినిమాలు లేవు . ఉన్న కొన్నింటిలో ఎక్కువగా రాజశేఖరే నటించారు . 1990 డిసెంబర్లో వచ్చిన ఈ మగాడు సినిమా కమేండో ఆపరేషన్ కధాంశంగా వచ్చిందే . జీవిత సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాగుంటుంది .

మళయాళంలో బాగా హిట్టయిన Moonnam Mura అనే సినిమాకు రీమేకే మన తెలుగు సినిమా . మళయాళంలో మోహన్ లాల్ , సురేష్ గోపి , రేవతి ప్రభృతులు నటించారు . మళయాళ సినిమాకు దర్శకత్వం వహించిన కె మధుయే తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించారు .

Ads

కధ ఏంటంటే : ఆంధ్రాకే చెందిన ఓ కేంద్ర మంత్రి గారు విశాఖపట్టణానికి వస్తారు . రాష్ట్ర ప్రభుత్వం లిజీని గైడుగా పంపుతుంది . మాదక ద్రవ్యాల క్రిమినల్స్ కేంద్ర మంత్రి గారి బృందాన్ని అంతా కిడ్నాప్ చేస్తారు . వంద కోట్లు , వగైరా కావాలని DIG కి తెలియపరుస్తారు .

వారందరినీ కిడ్నాప్ నుండి రక్షించడానికి రాజశేఖర్ని ఆశ్రయిస్తారు . పూర్వాశ్రమంలో అతను పోలీసు అధికారే . క్రిమినల్స్ అతని భార్య , కుమార్తెని కారు బాంబు ద్వారా చంపుతారు . ఆ ఘటనలో అతనంటే అసూయపడే మరో యస్పీ శరత్ కుమార్ ఒక క్రిమినల్ని చంపేస్తాడు . ఇద్దరూ ఘర్షణ పడతారు . ఘర్షణ క్రమంలో పోలీసు శాఖ నుండి రాజీనామా చేసి బయటకు వెళతాడు .

DIG మురళీమోహన్ అభ్యర్ధన మీద బంధితులని రెస్క్యూ ఆపరేషన్లో విజయవంతంగా రక్షించి మగాడు అని పిలిపించుకుని నిష్క్రమిస్తాడు . సినిమా శుభాంతం అవుతుంది . సినిమా మొదటి నుండి చివర దాకా బిర్రుగా సాగుతుంది . ఎక్కడా బోరించదు .

రాజశేఖర్ భార్యగా జీవిత , కుమార్తెగా బేబీ షాలిని , గైడుగా లిజీ , కిడ్నాప్ టీం నాయకుడిగా త్యాగరాజన్ , DIG గా మురళీమోహన్ , IG గా దేవదాస్ కనకాల , ఇతర విలన్లుగా బాబ్ ఏంథొనీ , రాజేష్ , ప్రభృతులు నటించారు . ఇతర పాత్రల్లో పి ఆర్ వరలక్ష్మి , వంకాయల , రమణారెడ్డి , హరిబాబు , బాబూమోహన్ , బ్రహ్మాజీ , పి జె శర్మ  తదితరులు నటించారు .

రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో సిరివెన్నెల , వేటూరి పాటలను బాలసుబ్రమణ్యం , జానకమ్మ , రాధిక పాడారు . రెండే పాటలు .రెండూ బాగుంటాయి . బయట పెద్దగా హిట్ కాలేదు .

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు తెలుగులో ఇది రెండవ సినిమా . కె యల్ ప్రసాద్ డైలాగులను చక్కగా వ్రాసారు . ఈ సినిమాలో నటనకు రాజశేఖరుకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది . బాగా నటించాడు .

నేను పరిచయం చేస్తున్న 1249 వ సినిమా  #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ ……. మగాడు పేరుతో గతంలో ఎన్టీఆర్ హీరోగా కూడా ఓ సినిమా వచ్చింది… మరో తమిళ డబ్బింగ్ సినిమా (సత్యరాజ్) కూడా ఇదే టైటిల్‌తో వచ్చింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్… మన ఆకాశ్‌కు గిరాకీ…
  • తాళి చుట్టే మణిరత్నం సినిమా కథలన్నీ…
  • స్వామియే శరణం అయ్యప్పా… ఎర్రన్నలకు తత్వం బోధపడింది….
  • సీట్ల పెంపు- స్థూలంగా గుడ్… కానీ నాణేనికి మరోవైపు మాటేమిటి..?
  • సంతాన బాధిత ముసలి తల్లిదండ్రులకు పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి..!!
  • అయ్యా… హిందూ సమాజంపై కాస్త దయజూపు మిత్రమా…
  • కోర్టులో ఒక ఎఐ జడ్జి ఉంటే..? రాబోయే రోజుల్లో ఈ సిట్యుయేషన్ తప్పదా..!
  • ‘‘నీకూ మోసం చేయడం తెలిస్తే… చేసి నువ్వూ సంపాదించుకో…’’
  • అమ్మ రాజీనామా చేస్తే… ఇల్లు కల్లోలమే…! మంచి కాన్సెప్టు మూవీ…!
  • ఇది లొట్టపీసు కేసు కాదు… రేవంత్ వర్సెస్ కేటీఆర్ – తిరగబడ్డ కాలచక్రం!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions