Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహాజనానికి మరదలు పిల్ల..! భలే టైటిల్… తగినట్టే కథాకథనాలు..!!

February 28, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మహాజనానికి మరదలు పిల్ల … ఈ మాట వినగానే నాకు ఓ 55 ఏళ్ళ కింద ఓ ఉదంతం గుర్తుకొస్తుంది . 1970-71 లో నేను మా నరసరావుపేట S.S&N కాలేజీలో సెకండ్ ఇయర్ బి కాం చదువుతున్నాను . ఆ సంవత్సరం ఆకాశరామన్న పేరుతో కళాశాలకు వ్యతిరేకంగా కరపత్రాలు చక్కర్లు కొట్టేవి . వాటిల్లో ఒక దాంట్లో మా అధ్యాపకుల్లో ఒకరికి మా ఊళ్ళో ఉన్న ఓ పెద్ద నోరున్న స్త్రీతో లంకె పెట్టి ఆమెను మహాజనానికి మరదలు పిల్ల అని ఓ టైటిల్ ఇచ్చేసారు . ఆమె కనపడగానే మా కాలేజి కుర్రాళ్ళం ఆ మాటను గుర్తు చేసుకుని నవ్వుకునే వాళ్ళం .

అలాంటి గోలే ఈ సినిమాలో కూడా ఇంకో రకంగా చూస్తాం . హీరోయిన్ నిరోష అంటే కాలేజీలో అందరికీ క్రష్ . తన్నుద్దని భయం . చాలామందికి దేహశుద్ధి చేస్తుంది . ఇలా నిక్ నేమ్స్ పెట్టి గోడల మీద వ్రాసి వాళ్ళ కచ్చ తీర్చుకుంటూ ఉంటారు మగ కుర్రాళ్ళు .

Ads

నిరోష మేనమామ కొడుకు రాజేంద్రప్రసాద్ . అతని తల్లిదండ్రులుగా శ్రీధర్ , అనిత , నాయనమ్మగా నిర్మలమ్మ నటించారు . నిరోష తల్లిదండ్రులు సత్యనారాయణ , శుభ . రెండు కుటుంబాలు విడిపోతాయి . ముసలమ్మకు రెండు కుటుంబాలు కలవాలని , ఆ కార్యక్రమం రాజేంద్రప్రసాద్ , నిరోష పెళ్ళితోనే సాధ్యం అవుతుందని ఆశ .

ఆమె ఆశ తీర్చటానికి హీరో వైజాగుకు వచ్చి, చనిపోయిన శుభ తమ్ముడిని అని అబధ్ధం చెప్పి ఇంట్లో సెటిల్ అవుతాడు . అతనంటే ద్వేషించే నిరోష పెళ్లి చేసుకుని అతనికి బుధ్ధి చెప్పాలని పెళ్ళాడుతుంది . హీరో  మిత్రులు ఇరువురు నిరోష ఇద్దరు చెల్లెళ్ళని పెళ్లి చేసుకుంటారు .

  • గుండమ్మ కధ సినిమాలో ఏయన్నార్ లాగా మోసంతో నిరోషని వాళ్ళూరు తీసుకుని ఓ సాదాసీదా ఇంట్లో కాపురం పెడతాడు . నాయనమ్మ నిర్మలమ్మ మనుషులు మారాలి సినిమాలో శోభన్ బాబు తల్లి లాగా సతాయిస్తుంటుంది . అంతా కలిసి నిరోష గర్వాన్ని అణిచి జనజీవన స్రవంతిలో కలిసేలా చేయటం , నిరోష తల్లిదండ్రులు నిజాన్ని తెలుసుకోవటంతో గ్రూప్ ఫొటోతో శుభం కార్డు పడుతుంది .

కన్నడంలో హిట్టయిన నంజుండి కళ్యాణ అనే సినిమాకు రీమేకే మన తెలుగు సినిమా . విజయబాపినీడు ఆధ్వర్యంలో అతని అల్లుడు వల్లభనేని జనార్దన్ దర్శకత్వం వహించాడు . ఆయనే స్క్రీన్ ప్లేని కూడా తయారు చేసుకున్నాడు .

ఈ కన్నడ సినిమాకు స్ఫూర్తి కన్నడంలో పాపులర్ అయిన బహద్దూర్ గండ అనే నాటకం . ఈ పేరు కరెక్టుగానే వ్రాసాను అనుకుంటాను . ఈ నాటకానికి స్ఫూర్తి William Shakespeare వ్రాసిన Taming of the shrew . ఈ ఇంగ్లీష్ నాటకం స్ఫూర్తితో ఎన్ని సినిమాలు నిర్మించబడ్డాయో లెక్క లేదు . Shakespeare గయ్యాళి భార్య పేరు Anne Hathaway . ఆమె గయ్యాళితనం మీద గురువు గారికి బాగా గుణుపు ఉండేదట . ఆ తిక్కతో ఆ నాటకాన్ని వ్రాసి కచ్చ తీర్చుకున్నారని మాకు Shakespeare నాటకాలను బోధించిన ఇంగ్లీష్ లెక్చరర్ R N Vithal గారు చెప్పేవారు .

సినిమా అంతా బావామరదళ్ళ గోల , సవాళ్ళు ప్రతి సవాళ్ళు . ఇద్దరూ బాగా నటించారు . అదరగొట్టింది నిర్మలమ్మే . ఇతర ప్రధాన పాత్రల్లో అనిత , శ్రీలక్ష్మి , బ్రహ్మానందం , మహర్షి రాఘవ , కొత్త నటుడు దుర్గా బాబు , రజిత , పవిత్ర (నరేష్ పవిత్ర కాదు) , జయశీల  తదితరులు నటించారు .

ఉపేంద్ర కుమార్ సంగీత దర్శకుడు . కన్నడ సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడు . పాటలన్నీ భువనచంద్ర వ్రాసారు . బాలసుబ్రమణ్యం , కన్నడ గాయని మంజుల పాటల్ని శ్రావ్యంగా పాడారు .
ఒక రామ కధ ఒక సీత కధ అనే పాట చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . కోక తడిపిన కోణంగి చినుకే కన్నె పరువు తీసేలే వాన పాట హాట్ హాటుగా ఉంటుంది రాజేంద్రప్రసాద్ , నిరోషల మీద .

ఇస్పేటు పాపా , మహాజనానికి మరదలు పిల్ల అంటూ సాగే రెండు టీజింగ్ గ్రూప్ డాన్స్ పాటలు హుషారుగా ఉంటాయి . తప్ప తాగితే తప్పు తాగి వాగితే ముప్పు పాట నిరోష మీద బాగుంటుంది . మనువే మధురం విషాద పాట కూడా బాగుంటుంది .

కాశీ విశ్వనాధ్ డైలాగులు బాగుంటాయి . విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా యూట్యూబులో ఉంది . సరదాగా ఉంటుంది . It’s a feel good , hilarious entertainer . చూడతగ్గ సినిమాయే . You will enjoy .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోల్ మిథేన్..! వాడుకోగలిగితే సింగరేణికి సూపర్ ఛాన్స్… కానీ..?
  • అవును, కాబోయే ఈ టీఎంసీ ఎంపీ హైదరాబాదీ… అసలు ఎవరీమె..?
  • మహాజనానికి మరదలు పిల్ల..! భలే టైటిల్… తగినట్టే కథాకథనాలు..!!
  • … మీరింకా అవే అడవుల్లో, అవే హోదాల్లో లేరు మాజీ కామ్రేడ్స్..!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • పాడ్ టాక్సీ..! గ్లోబల్ సిటీ దిశలో మరింత ఆధునిక రవాణా వ్యవస్థ..!!
  • పరుగుల బాబా…! వెధవ దొరికిపోయాడు..! ఇప్పుడు పరారీ పరుగులు..!!
  • ‘‘నేనెందుకు ఏడ్చానో నాకే అర్థం కాలేదు… ఈ ఎమోషన్ అర్థమేమిటి..?’’
  • నాకు తెలిసిన సౌందర రాజన్… గొప్ప మనీషి, ఆధ్యాత్మిక చైతన్యశీలి…
  • విజయ్‌తో విడాకులు కోరిన భార్య- మళ్లీ తమిళ వార్తల తెరపైకి త్రిష..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions