Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవును, కాబోయే ఈ టీఎంసీ ఎంపీ హైదరాబాదీ… అసలు ఎవరీమె..?

February 28, 2026 by M S R

.

ప్రస్తుత వార్తల ప్రకారం… ప్రస్తుత వార్తల ప్రకారం, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ మేనకా గురుస్వామిని  పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది… ఈ ఎంపిక ద్వారా ఆమె భారత పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించబోతున్న తొలి బహిరంగ LGBTQ+ మహిళగా రికార్డు సృష్టించనుంది…

కొన్ని విశేషాలు చెెప్పుకుందాం… ఆమె హైదరాబాదీ… పుట్టిందీ, పెరిగిందీ, స్కూల్ చదువూ ఇక్కడే… (హెచ్‌పీఎస్ స్టూడెంట్)… సుప్రీంకోర్టు లాయర్… బెంగుళూరులో లా పట్టా, తరువాత ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ మాస్టర్స్…

Ads

మేనకా గురుస్వామి

తండ్రి పేరు మోహన్ గురుస్వామి… దేశంలో ప్రసిద్ధ రాజకీయ విశ్లేషకుడు, ఆర్థిక నిపుణుడు… 1998లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా వద్ద ప్రత్యేక సలహాదారుగా (Special Advisor) పనిచేశాడు… ఆయన కూడా హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదువుకున్నాడు… ప్రస్తుతం ‘సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్స్’ (CPAS) అనే థింక్ ట్యాంక్ వ్యవస్థాపకులుగా ఉన్నాడు… (నిజాం కాలేజీ పూర్వ విద్యార్థి)…

ఆమె తాత (మోహన్ గురుస్వామి తండ్రి) కూడా పోలీసు శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేశాడు… మొత్తానికి, మేనక కుటుంబం కొన్ని తరాలుగా పాలన, విశ్లేషణ, చట్టపరమైన రంగాల్లో చురుగ్గా ఉంటూ వస్తోంది… ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం…

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే… తను ఎల్‌జీబీటీక్యూ అని స్వయంగా ప్రకటించుకుంది… 2019లో ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ (CNN)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె తన తోటి న్యాయవాది అరుంధతి కాట్జూతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించింది…

మేనకా గురుస్వామి

సెక్షన్ 377 రద్దు కేసు ఆమె కెరీర్‌లో కీలకం… (స్వలింగ సంపర్కం నేరం కాదు అనే తీర్పు బాపతు కేసు)… అందుకే అది తనకు కేవలం వృత్తిపరమైన పోరాటం మాత్రమే కాదని, అది తమకు ఒక “వ్యక్తిగత విజయం” అని కూడా చెప్పుకుంది… LGBTQ+ హక్కుల కోసం వారు చేసిన కృషికి గాను ‘టైమ్ 100’ (TIME 100) జాబితాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులుగా చోటు దక్కించుకున్నారు వాళ్లు…

లిక్కర్ స్కాం కేసు కూడా వాదించినట్టు సమాచారం… హైదరాబాద్ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ కేసు కూడా..! మరి బెంగాల్‌కు, టీఎంసీకి ఏం లింక్..? మమతా బెనర్జీ ఎందుకు అంతగా ఓన్ చేసుకుని, తన పార్టీ ఎంపీగా పంపబోతోంది..? ఇదీ ఆసక్తికరం…

బెంగాల్‌కు సంబంధించిన పలు కేసుల్ని వాదించేది ఈమే సుప్రీంకోర్టులో… అలా మమతా బెనర్జీకి దగ్గరైంది… మమతా బెనర్జీ తన పార్టీని కేవలం బెంగాల్‌కే పరిమితం చేయకుండా, జాతీయ స్థాయిలో మేధావుల మద్దతు కూడగట్టాలని భావిస్తోంది… మేనకా గురుస్వామి వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న రాజ్యాంగ నిపుణురాలిని రాజ్యసభకు పంపడం ద్వారా, పార్లమెంటులో పార్టీ వాణిని బలంగా వినిపించవచ్చని TMC భావించింది… ఇదీ ఓ హైదరాబాదీ మేనకా గురుస్వామి నేపథ్యం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోల్ మిథేన్..! వాడుకోగలిగితే సింగరేణికి సూపర్ ఛాన్స్… కానీ..?
  • అవును, కాబోయే ఈ టీఎంసీ ఎంపీ హైదరాబాదీ… అసలు ఎవరీమె..?
  • మహాజనానికి మరదలు పిల్ల..! భలే టైటిల్… తగినట్టే కథాకథనాలు..!!
  • … మీరింకా అవే అడవుల్లో, అవే హోదాల్లో లేరు మాజీ కామ్రేడ్స్..!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • పాడ్ టాక్సీ..! గ్లోబల్ సిటీ దిశలో మరింత ఆధునిక రవాణా వ్యవస్థ..!!
  • పరుగుల బాబా…! వెధవ దొరికిపోయాడు..! ఇప్పుడు పరారీ పరుగులు..!!
  • ‘‘నేనెందుకు ఏడ్చానో నాకే అర్థం కాలేదు… ఈ ఎమోషన్ అర్థమేమిటి..?’’
  • నాకు తెలిసిన సౌందర రాజన్… గొప్ప మనీషి, ఆధ్యాత్మిక చైతన్యశీలి…
  • విజయ్‌తో విడాకులు కోరిన భార్య- మళ్లీ తమిళ వార్తల తెరపైకి త్రిష..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions