.
Pardha Saradhi Potluri …. డోనాల్డ్ ట్రంప్ కాదు డోనాల్డ్ డంప్ ట్రక్! గార్బెజ్ ట్రక్!
భారత్ మీద టారిఫ్స్ విధిస్తే అది బ్యాక్ ఫైర్ అయిపోయి మనల్నే కాలుస్తుంది అని అమెరికన్ ఆర్ధిక నిపుణులు మొత్తుకుంటున్నా ట్రంప్ వినలేదు!
మొదట 25% శాతం టారిఫ్ విధించాడు! రష్యా నుండి చమురు కొంటున్నందుకు మరో 25% టారిఫ్ విధించాడు!
ఇప్పుడేమో మొదట విధించిన 25% టారిఫ్ ని 7% తగ్గించి 18% దగ్గర ఆపాడు! అంటే పాకిస్తాన్ మీద విధించిన టారిఫ్ కంటే 1% తక్కువ విధించాడు అన్నమాట!
రష్యా నుండి కొంటున్న ఆయిల్ ని కొనడం ఆపేస్తే 25% టారిఫ్ ని ఎత్తివేస్తాడుట!
గత మూడు నెలల నుండి భారత విదేశాంగ అధికారులు అమెరికా భారత్ మీద విధించిన టారిఫ్స్ మీద చర్చలు జరుపుతూ వస్తున్నారు తప్పితే ఫలితం కనపడలేదు!
Ads
అమెరికాలో రైతుల ఆత్మహత్యలని ఆపడానికి హెల్ప్ లైన్ ఆపరేట్ చేస్తున్నారు.
2025 లో 293 మంది రైతులు దివాళా తీసినట్లుగా ( Chapter 12 bankruptcy) తెలుస్తున్నది. రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి కానీ అవి రికార్డులలోకి ఎక్కడం లేదని తెలుస్తున్నది.
రైతులలో ( ఫార్మ్ ఆపరేటర్స్) ఎక్కువమంది సోయా పంట పండించేవారు నష్టపోతున్నట్లుగా తెలుస్తున్నది.
సోయా పంటని స్టోర్ చేసే సదుపాయం ఉన్నా ఎన్నిరోజులని దాచిపెట్టుకుంటారు?
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా చైనా అమెరికా నుండి సోయా బీన్స్ ని దిగుమతి చేసుకోవడం తగ్గించింది! బ్రిక్స్ దేశమైన బ్రెజిల్ నుండి 70% సోయా బీన్స్ ని దిగుమతి చేసుకుంటున్నది చైనా.

- బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకుంటే డాలర్స్ తో పని లేదు. బ్రెజిల్ చైనా నుండి దిగుమతి చేసుకునేవి యూనిట్స్ అనే కొత్త కరెన్సీతో చెల్లింపులు చేస్తున్నది. చైనా కూడా యూనిట్స్ లోనే బ్రెజిల్ కి ఇస్తున్నది!
యూనిట్స్ అనేది పుతిన్ సృష్టి!
2023 నుండి అమెరికా రష్యా మీద విధించిన ఆంక్షల వల్ల గత సంవత్సరం నుండి పుతిన్ యూనిట్స్ లో వ్యాపారం చేస్తున్నాడు. అయితే బయటికి దానిని డిజిటల్ రూబుల్ గా చెప్తున్నా భవిష్యత్తులో దానిని యూనిట్స్ గా వ్యవహరించే అవకాశం ఉంది!
రూబుల్, యువాన్, రూపాయిలకి బంగారం ఆధారంగా విలువ లెక్కిస్తున్నారు ఇప్పుడు. చైనా అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ని అమ్మేసి బంగారం కొంటున్నది. ఆఫ్కోర్స్! భారత్ కూడా బంగారం కొనడం మీదనే దృష్టి పెడుతున్నది!
అమెరికా, జపాన్, యూరోపు దేశాలు కఠిన ఆంక్షలు విధించినా పుతిన్ నిలదొక్కుకున్నాడు ఇన్నాళ్లు!
కానీ ముందు ముందు అంత సాఫీగా సాగేలా లేదు రష్యన్ ఆర్ధిక వ్యవస్థ! ఏ దేశమైనా బంగారం తాకట్టు పెట్టడమో లేదా అమ్మడమో చేస్తున్నది అంటే అది ఆ దేశ ఆర్ధిక వ్యవస్థకి చివరి అవకాశం!
రష్యా 50 మిలియన్ డాలర్లు విలువ చేసే బంగారాన్ని భారత్ కి అమ్మింది 10 రోజుల క్రితం! పుతిన్ భారత్ కి అమ్మేశాడా లేక తాకట్టు పెట్టి యువాన్లు కొన్నాడా అనేది తెలియదు. ఒకవేళ అమ్మేట్లయితే బంగారాన్ని చైనాకే అమ్మి బదులుగా యువాన్లు కొనవచ్చు కదా అనే సందేహం రావొచ్చు! పుతిన్ ఎట్టి పరిస్థితిలోనూ చైనాని నమ్మడు. మోడీ భారత ప్రధానిగా ఉన్నంత కాలం పుతిన్ మోడీని విశ్వసిస్తాడు! పుతిన్ తరువాత రష్యాకి కాబోయే అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ ( Dmitry Medvedev) కూడా మోడీనే విశ్వసిస్తాడు!

ఏది ఏమైనా రష్యా ఆర్ధిక స్థితి ఆశాజనకంగా లేదన్నది నిజం!
చివరి దెబ్బగా భారత్ ని రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేయిస్తే పుతిన్ యుక్రెయిన్ తో సంధికి ఒప్పుకుంటాడు అని అమెరికన్ థింక్ ట్యాంక్ ఆలోచన!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నేను ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపేస్తాను అని ఎన్నికల వాగ్దానం చేశాడు కానీ సంవత్సరం అయినా ఆ పని చేయలేకపోయాడు!
పుతిన్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు ట్రంప్?
ట్రంప్ గుట్టుమట్లు ఏమిటో పుతిన్ కంటే వేరే ఎవరికీ ఎక్కువ తెలిసే అవకాశం లేదు. అందుకే పుతిన్ ని ఏమీ అనలేక మోడీని ఒత్తిడికి లోను చేయాలని చూస్తున్నాడు!
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్!
స్వీట్జర్లాండ్ లోని దావోస్ సదస్సుకి వెళ్ళినప్పుడు ట్రంప్ కి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది!
అఫ్కోర్స్! దావోస్ విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ అయితే వేశారు కానీ స్వాగతం పలకడానికి ప్రముఖులు ఎవరూ రాలేదు!

దావోస్ సదస్సు జరుగుతున్న వేదిక దగ్గర నాటో దేశాల అధ్యక్షులున్నా ఎవరూ స్వాగతం పలకడానికి రాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు. నిర్వాహకులు ట్రంప్ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అన్నట్లుగా వ్యవహారించారు అని!
దావోస్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు విలేఖరులు పదే పదే చేతులు ఎత్తుతూ ట్రంప్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. విలేఖరులు చేతులు ఎత్తి ఎదురు ప్రశ్నలు వేయడానికి ప్రయత్నించడం అంటే ట్రంప్ మాట్లాడుతున్న దానికి చేస్తున్నదానికి అసలు పొంతన లేకపోవడం వలన ప్రసంగాన్ని అడ్డుకొని ఎదురు ప్రశ్నలు వేశారు!
దావోస్ లో జరిగేది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్! ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, పారిశ్రామిక వేత్తలు హాజరు అయ్యి ఒప్పందాలు కుదుర్చుకుంటారు!
అమెరికా టారిఫ్ లు విధించని దేశం లేదు ప్రపంచవ్యాప్తంగా! అలాంటప్పుడు అమెరికా అధ్యక్షుడు వస్తే ఒకటా? పాకిస్థాన్ అధ్యక్షుడు వస్తే ఒకటా?
దావోస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ బహిరంగంగానే ట్రంప్ ని తీవ్రంగా విమర్శించాడు గ్రీన్ లాండ్ ని కొంటాను అని ట్రంప్ అన్నందుకు! ఇతర నాటో దేశాధినేతలు ట్రంప్ తో కలవడానికి ఇష్టపడలేదు!
అంతర్జాతీయ విలేఖరులు పదే పదే ట్రంప్ ని అడ్డుకోవడంతో షెడ్యూల్ కంటే ఒక గంట ముందే దావోస్ నుండి వెళ్ళిపోయాడు ట్రంప్ అవమాన భారంతో!

వేమన చెప్పింది గుర్తుచేసుకోవాలి: “ ధనము లేని వాడిని వేశ్య కూడా విసర్జస్తుంది ”
అమెరికా పీకల్లోతు అప్పుల్లో ఉందని యూరోపియన్ దేశాలకి కూడా తెలుసు కానీ బహిరంగంగా విమర్శించవు! అమెరికా బయటికి చెప్తున్న 38.5 ట్రిలియన్ డాలర్ల అప్పునే యూరోపియన్ దేశాలు కూడా అవుననే ఒప్పుకుంటున్నాయి! కాదని అసలు నిజం చెప్తే అమెరికా దగ్గర ఉన్న యూరోపియన్ యూనియన్ బంగారం 90 బిలియన్ డాలర్లు విలువచేసే వాటిని తిరిగి ఇవ్వదేమో అనే భయం ఉంది! ఇప్పటికే తమ బంగారాన్ని తిరిగి ఇచ్చేయమని డిమాండ్ చేస్తున్నా ట్రంప్ మౌనంగా ఉన్నాడు.
అవసరం అమెరికాకే ఉంది!
ఇప్పటికే బ్రిటన్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకుంది భారత్ తో!
యూరోపియన్ యూనియన్ కూడా ఒప్పందం చేసుకుంది కానీ అవి అమలులోకి వచ్చేది 2027 లో! ప్రస్తుతం MoU మాత్రమే జరిగింది!
ట్రంప్ దెబ్బకి జపాన్ ఆటో దిగ్గజాలు టొయోట, సుబరు కెనడాలో భారీ ప్రోడక్షన్ యూనిట్స్ నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నాయి!
కోకోకోలా అమెరికా నుండి బయటికి వచ్చి కెనడాలో స్థిరపడడానికి నిర్ణయం తీసుకుంది!
2023 నుండి ఇప్పటి వరకూ అమెరికాలో అమ్ముడుపోని కార్లు 35 లక్షలు! కార్ డీలర్లకి కమర్షియల్ బ్యాంకుల నుండి సంవత్సరం వరకూ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాటిని అమ్ముకునే వెసులుబాటు కల్పించినా, అమ్ముడు పోయినా, అమ్ముడుపోకపోయినా వడ్డీతో సహా అసలు కూడా కట్టేయాలి అనే నిబంధన విధించి రోడ్డున పడేసింది డీలర్లని!

ఇలాంటి పరిణామల మధ్య ట్రంప్ చెరువు మీద అలిగాడు! వాసన స్వంత మనుషులే భరించలేని స్థితికి వచ్చేసరికి 7% టారిఫ్ తగ్గించాడు!
So! మనం సంబరపడిపోవాల్సిన అవసరం లేదు!
ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’ లో ప్రకటించినవి పూర్తిగా నిజాలు కావు! మోడీ ముక్తసరిగా చేసిన ట్వీట్ లో రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేస్తామని అనలేదు! కేవలం ధన్యవాదాలు తెలిపారు!
ట్రంప్ మాత్రం 500 బిలియన్ డాలర్ల ఒప్పందం అని పేర్కుంటూ అందులో అమెరికా నుండి సహజ వాయువు, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు అని పేర్కొన్నాడు!
మోడీ ఆ ప్రస్తావన చేయలేదు!
అసలు అధికారులు చర్చలు జరిగిన తరువాత ఫోన్ లో మాట్లాడుకున్నారు ట్రంప్, మోడీ! MoU జరగాలి, ఆపై అగ్రిమెంట్ జరిగితేనే అది అమలవుతుంది!
MoU లో ఏ అంశాల మీద వాణిజ్యం జరగాలనేది మళ్ళీ కూర్చుని చర్చిస్తారు! ఒక నిర్థిష్టమైన అవగాహనకి వచ్చిన తరువాత పన్నులు ఎంత, టారిఫ్ లు ఎంత అనేది తెలుస్తుంది! ఆ తర్వాతే అగ్రిమెంట్ జరుగుతుంది!
MoU, అగ్రిమెంట్ అనేవి ఒకటి కాదు!

మోడీ మౌనం వెనుక వ్యూహం ఉంది!
యూరోపియన్ యూనియన్ దేశాలలో రష్యా మీద ఆంక్షలు విధించడం వలన తాము ఆర్ధికంగా నష్టపోతున్నామనే భావన క్రమంగా బలపడుతున్నది!
జార్జీయా మెలోని ఉదంతం!
ఇటలీ ప్రధాని జార్జియ మెలోని మొదటగా ఒక ప్రకటన చేస్తూ యూరోపు రష్యాతో స్నేహాసంబంధాలని పునరుద్దరించుకోవడానికి సమయం ఆసన్నమైంది అని ప్రకటించింది!
వారం క్రితం మెలోని పుతిన్ తో ఫోన్లో మాట్లాడినట్లుగా యూరోపియన్ యూనియన్ ఇంటెలిజెన్స్ కనిపెట్టింది!
So! ఇటలీ మెల్లగా రష్యా వైపు మళ్ళీ వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెలోని ఎక్కువగా మోడీ విధానాలని అనుసరిస్తూ వస్తున్నారు.
1991 లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం తరువాత మొదటగా 1994 లో రష్యాతో ఒప్పందాలని చేసుకొని తరువాత 1998 లో మరో వాణిజ్య ఒప్పందం చేసుకుంది!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పుతిన్ తో సత్సంబంధాలని కోరుకోవడం వెనుక సహజ వాయువు, ఇతర ఇంధన వనరులని చవకగా పొందడమే!

సెప్టెంబర్, 2025 లో అవసరం అయితే ట్రంప్ అధ్యక్ష పదవి నుండి దిగిపోయేవరకూ మోడీ వేచి చూస్తారు. గంపగుత్తాగా మీరు వేసే టారిఫ్స్ కి గాని, మాకవసరం లేని వ్యవసాయ ఉత్పత్తులని కానీ దిగుమతి చేసుకునే ప్రసక్తి లేదని అజిత్ దోవల్ గారు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబీయోతో అన్నట్లుగా బ్లూమ్ బర్గ్ తన కథనంలో ప్రచురించింది!
ఇప్పుడేదైతే మీడియాలో చెప్తున్నారో అవి కార్యరూపం దాల్చే వరకూ చెప్పలేం!
మోడీ వేచి చూసే ధోరణిలో ఉన్నారు!
ఏమో ఎవరు చెప్పగలరు? ట్రంప్ ఎన్ని వారాలు పదవిలో ఉంటాడో!
రష్యాని కాదని ఆయిల్ దిగుమతి వెనిజులా నుండి కొనరు! ఇతర దేశాల నుండి కొనే ఆయిల్ శాతాన్ని తగ్గించి వెనిజులా నుండి కొనే అవకాశాలు ఉన్నాయి.
మరీ దరిద్రం ఏమిటంటే ట్రంప్ కక్కుర్తి!
వెనిజులా నుండి మొదటి కనసైన్మెంట్ ని అమ్మిన ఆయిల్ తాలూకు సగం వెనిజులాకి ఇచ్చి మిగతా 150 మిలియన్ డాలర్లని కరేబియన్ దీవులలోని ట్రంప్ కి చెందిన బ్యాంకు ఖాతాకి తరలించారు!
సంబరాలు చేసుకుంటున్నది ట్రంప్ అనుచర వర్గం!
మనం అనుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ స్పందించాల్సిన అవసరం లేదు!
Share this Article