Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లాయర్ మమతా బెనర్జీ… వాదనలు ఏమిటి- నిజాలు ఏమిటి…

February 4, 2026 by M S R

.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు (ఫిబ్రవరి 4, 2026) సుప్రీం కోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించింది… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా తనే స్వయంగా, నేరుగా కోర్టులో వాదించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి… ఆమె ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను వ్యతిరేకించింది…

అప్పుడెప్పుడో 1970కు ముందు ఆమె బార్ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకుంది… తరువాత ప్రాక్టీసు లేదు… ఐనా సరే, సుప్రీం కోర్టులో వాదన వినిపించడానికి కోర్టు అనుమతించింది… పెద్దగా వ్యతిరేకించడానికి కూడా అవకాశం లేదు… 5 నిమిషాలు టైమ్ అడిగితే 15 నిమిషాల టైమ్ ఇచ్చింది కోర్టు… (నల్లకోటు కాదు, నల్ల కండువా మాత్రమే ధరించినట్టు కనిపించింది)…

Ads

నిజానికి ఒక ప్రొఫెషనల్ లాయర్ వేరు… కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి వంటి లాయర్లను ఎంగేజ్ చేసుకోగలదు ఆమె పార్టీ… ప్రశాంత్ కిషోర్‌కే వందల కోట్లు ఖర్చుపెట్టింది ఆమె… కాకపోతే తను ఏ ఇమేజ్ కోసం తనే స్వయంగా కోర్టుకు వచ్చిందనే చర్చను పక్కన పెడితే… ఆమె వాదనల జోలికి వెళ్దాం ఓసారి…

(అంతకుముందు… ఆమె సరిహద్దుల్లో కంచెకు భూమి ఇవ్వదు, ఎందుకంటే ఎంతగా అక్రమ వలసలు సాగితే అంత నయం ఆమెకు, వాళ్లంతా వెంటనే ఇక్కడ వోటర్లు అయిపోయి, ఆమెకు వోటు బ్యాంకు అవుతారు… సరిహద్దు జిల్లాల్లో ఈమె దెబ్బకు డెమోగ్రఫీయే మారిపోయింది… సీబీఐని రానివ్వదు, ఇంకా చాలా ఉన్నయ్…)

లాయర్ మమతా


మమతా బెనర్జీ ప్రధాన వాదనలు… 

ఓట్ల తొలగింపుపై ఆరోపణ…: SIR పేరుతో బెంగాల్‌లో సుమారు 58 లక్షల మంది ఓటర్లను అన్యాయంగా తొలగించారు… ఈ ప్రక్రియ ఓటర్ల చేరిక కోసం కాకుండా, కేవలం తొలగింపు కోసమే జరుగుతోంది…

నిజం… ఓట్ల రివిజన్ అనేది చేరిక కోసమే జరగదు, తొలగింపులకు కూడా… చనిపోయిన వారు, ఊరు విడిచి వెళ్ళిన వారిని (DSE – Dead, Shifted, Expired) తొలగించడం అనేది ఒక నిరంతర ప్రక్రియఇది జరగకపోతే ‘బోగస్ ఓటింగ్’కు అవకాశం ఉంటుంది…


వివక్ష…: ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా కేవలం బెంగాల్‌నే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను చేపట్టారు… ఇది వివక్షతో కూడుకున్నది… “అసోంలో ఎందుకు SIR చేయడం లేదు?”

నిజం… దేశం మొత్తమ్మీద సర్ ప్రక్రియ సాగుతోంది… కేవలం బెంగాల్ కాదు… అసోం పరిస్థితి వేరు, స్పెషల్ షెడ్యూల్ జారీ చేయనున్నారు…

వాట్సాప్ కమిషన్…: ఎన్నికల సంఘం సరైన పద్ధతుల్లో కాకుండా అనధికారికంగా వాట్సాప్ ద్వారా సూచనలు ఇస్తోంది… అది ‘వాట్సాప్ కమిషన్’ …

నిజం… అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక మార్గాలనూ ఎన్నికల కమిషన్ ఉపయోగించవచ్చు…

మైక్రో అబ్జర్వర్ల నియామకం…: బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి దాదాపు 8,300 మంది అధికారులను మైక్రో అబ్జర్వర్లుగా తీసుకువచ్చి, స్థానిక అధికారులను పక్కన పెట్టారు…

నిజం… ఇలాంటి ప్రక్రియలపై స్థానిక ప్రభుత్వాల రాజకీయ ప్రభావం ఉంటుందని అనుమానించినప్పుడు ఇతర రాష్ట్రాల సిబ్బందిని ఉపయోగించడం సహజం, సాధారణం… ఎన్నికల ప్రక్రియ అబ్జర్వర్లు కూడా వేరే రాష్ట్రాల వాళ్లే ఉంటారు…

న్యాయం అందడం లేదు…: “న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోంది, మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు”… ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ప్రజల హక్కుల కోసం ఒక ‘పార్టీ-ఇన్-పర్సన్’ గా వచ్చాను…

నిజం… నిజంగా ఇష్యూ మీద నిజాయితీగా పోరాడాలి అనుకుంటే సమర్థులైన లాయర్లు, అదీ సుప్రీం కోర్టు లాయర్లు బోలెడు మంది… తనే స్వయంగా హాజరై వాదించడం అనేది ఓ షో అవుతుంది…

సుప్రీంకోర్టు సమర్థన, స్పందన:

మమతా బెనర్జీ వాదనలను, అభ్యర్థనలను విన్న ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మమతా బెనర్జీ వేసిన పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది…

ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో రాష్ట్ర అధికారులను కూడా చేర్చాలని కోర్టు భావించింది… ఇందుకోసం అందుబాటులో ఉన్న గ్రూప్-బి అధికారుల జాబితాను సోమవారంలోపు సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది…

కోర్టు ఈ కేసును లోతుగా విచారించడానికి అంగీకరించింది… తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (ఫిబ్రవరి 9) వాయిదా వేసింది…

కోర్టులో లాయర్లు వాదిస్తే అది ఒక చట్టపరమైన ప్రక్రియగా మిగిలిపోతుంది… అదే ఆమె స్వయంగా నిలబడితే, “నేను నా రాష్ట్ర ప్రజల కోసం ఒంటరిగా పోరాడుతున్నాను” అనే ఒక ‘వీరోచిత’ ఇమేజ్ ప్రజల్లోకి వెళ్తుంది… ఇది చట్టం కంటే రాజకీయాలకు ఎక్కువ ఉపయోగపడే అంశం…

ఒకవేళ వాదనలో నిజంగా పక్కా ఆధారాలు ఉంటే, ఆ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించడానికి నిపుణులైన లాయర్లు ఉండాలి… భావోద్వేగపూరితమైన మాటలు (“న్యాయం ఏడుస్తోంది”) రాజకీయ సభల్లో పేలుతాయి కానీ, సుప్రీంకోర్టులో కేవలం ఆధారాలే మాట్లాడుతాయి…

కోర్టుకు కావాల్సింది ‘భావోద్వేగాలు’ కాదు, ‘బలమైన సాక్ష్యాలు’… అందుకే సుప్రీంకోర్టు ఆమె మాటలను విన్నప్పటికీ, అంతిమంగా రిపోర్టులను సమర్పించమని ఎన్నికల సంఘాన్ని కోరింది… సర్ ప్రక్రియలో అకారణంగా తొలగించిన వోట్లు ఉంటే చెప్పాలని కమిషన్ చాన్స్ ఇచ్చినా టీఎంసీ నుంచి అలాంటి స్పందన ఏమీ లేదు… అంటే పరోక్షంగా తన దగ్గర ఆధారాలు లేవని చెప్పినట్టేనా..? ఇది మరోరకంగా కేంద్రంలోని బీజేపీ రాజకీయ దురుద్దేశం అంటూ యాగీ చేయడమేనా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లాయర్ మమతా బెనర్జీ… వాదనలు ఏమిటి- నిజాలు ఏమిటి…
  • వేర్వేరు విషాదాంత కథలు… కారణాలే అంతుచిక్కని మరణాలు…
  • పాపం టీబీజేపీ..! దిష్టి వ్యాఖ్యల్ని దిగమింగి… జనసేనానికీ జై ..!!
  • ఊబర్ లేడీ డ్రైవర్..! ఆన్‌లైన్‌లో హృదయాలను తాకిన X పోస్ట్..!!
  • సింధుజలాల ఒప్పందం..! ఏమో, ట్రంపు ఇందులోనూ వేలు పెట్టొచ్చు..!!
  • అదొక అత్యంత సంపన్న వ్యభిచార దీవి..! దాని ఓనరే జెఫ్రీ ఎపిస్టయిన్..!!
  • వాట్సాప్ ప్రైవసీ వివాదం… సుప్రీం ఫైర్… అసలేం జరుగుతోంది? 
  • టీకే రాధ..! అపారమైన మేధస్సుతో అరవైలలోనే అంతర్జాతీయ గుర్తింపు..!
  • జాతిపిత అంటే ఎవరు..? రేవంత్ పగులగొట్టే ఓ ఆర్టిఫిషియల్ షెల్..!!
  • తమిళుడు ఏమంటున్నాడు..? ఆసక్తికరమైన ఓ ఓపీనియన్ సర్వే…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions