Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ జర్నలిజాన్ని మార్కెట్ తిరస్కరించింది… వాషింగ్టన్ పోస్ట్ వైఫల్యం అదే…

February 11, 2026 by M S R

.

వాషింగ్టన్ పోస్ట్ (WaPo) లో జరిగిన ఉద్యోగాల తొలగింపుల్లో నిజంగా ఇబ్బందికరమైన విషయం జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారన్నది కానేకాదు. వాళ్లు ఇప్పటికీ “మేము చాలా ముఖ్యమైనవాళ్లం, విలువైనవాళ్లం” అని నమ్ముతూ ఉండటమే అసలు విచిత్రం…

నిజానికి ఇది నిధుల సమస్య కాదు… జెఫ్ బెజోస్‌కు డబ్బు కొరత లేదు… కావాలంటే దీన్ని ఎన్ని సంవత్సరాలైనా నడిపించగలడు… కానీ ఉద్యోగాల తొలగింపుకు అసలు కారణం ఒక్కటే — మార్కెట్ వీళ్లకు విలువ లేదని తేల్చేసింది…

Ads

ఇందులో వివాదం లేదు… సిద్ధాంతం లేదు… ఇది కేవలం ఆర్థిక శాస్త్రం.,.

సింపుల్‌గా చెప్పాలంటే ‘ఉత్పత్తి’ ఫెయిల్ అయింది… అందుకే పాఠకులకు ఆసక్తి పోయింది… సబ్‌స్క్రిప్షన్లు జీతాల భారాన్ని కూడా మోయలేకపోయాయి… ఒక సంస్థ ఫీల్డ్ రియాలిటీకి మించి అతిగా పెరిగీ పెరిగీ, వ్యక్తిగత భావజాలంలో గట్టిగా ఇరుక్కుపోతే, వాస్తవానికి దూరమైతే — ఇక ఆ అదనపు భారాన్ని తొలగించడం ఒక్కటే యాజమాన్యానికి హితమైన నిర్ణయం… జరిగింది అదే… కాకపోతే ఈసారి అది మూడో వంతు…

ఈ నిజాన్ని మాత్రయం వాళ్ల వీడ్కోలు పోస్టులు మాట్లాడవు… అంగీకరించవు…

ఏళ్లుగా భారతదేశంలో ఉన్న పాశ్చాత్య మీడియా ప్రతినిధులు జర్నలిజాన్ని కాదు, నైతిక ఉపన్యాసాలు దంచడమే తమ పని అనుకున్నారు… వాస్తవ భారతదేశాన్ని రిపోర్ట్ చేయాలని వాళ్లు అనుకోలేదు — పాత వలస భావజాలం, నేల విడిచిన పైన నిల్చుని మాట్లాడే ఓరకం అహంకారంతో నీతులు బోధించాలనుకున్నారు… వాళ్లు పాఠకుల కోసం పని చేయలేదు… తమ స్వీయ నైతిక సంతృప్తికే పని చేశారు…

ప్రపంచ మార్కెట్ దీనిని గుర్తించింది… ఇలాంటివాళ్లతో కూడిన విదేశీ బ్యూరోలు అసలు “వెకేషన్ పోస్టింగ్‌లు”… ఎలైట్ క్లబ్‌లలో కూర్చొని, కొద్దిమంది దౌత్యవేత్తలు, థింక్‌ట్యాంక్‌లతో మాట్లాడి, అవే మాటలను మళ్లీ మళ్లీ రాయడం… కావాలంటే అందమైన కథలు కూడా “తయారు” చేయొచ్చు — రుక్మిణి కాలిమాచి ఓ ఉదాహరణ…

నరేంద్ర మోదీ వీళ్లకు ఎప్పుడూ ఓ ‘సమస్య’… తనేమీ నియంత కాదు… తను ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్న ప్రజాప్రతినిధి… అది మాత్రం పట్టదు వీళ్లకు… నచ్చదు… అందుకే భారత ఓటర్లు ఈ ఎలైట్‌లకు నచ్చని తీర్పు గనుక ఇస్తే ప్రతిసారి “ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది” అంటారు… వీళ్ల దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే — పాశ్చాత్య న్యూస్‌రూమ్‌లకు నచ్చిన ప్రభుత్వాలు వచ్చినప్పుడే…

కోవిడ్ కవరేజ్‌తో వీళ్ల ప్రాసంగికతరాహిత్యం పూర్తిగా బయటపడింది… భారత రెండో వేవ్ భయంకరమే… కానీ సందర్భం, పరిమాణం, వివరాలు, నిజాల స్థానంలో — గరిష్టంగా షాక్ ట్రీట్‌మెంట్ అన్నట్టుగా హిందూ చితుల ఫోటోలు మాత్రమే చూపించారు… ఇది రిపోర్టింగ్ కాదు… ఇది భయాన్ని అమ్మడం… నాగరికత వినాశనాన్ని వార్తల ముసుగులో చూపిస్తే పాఠకులు డబ్బు పెట్టరు… వాళ్లు చూడడం, చదవడం మానేస్తారు…

కాశ్మీర్ కవరేజ్ మరింత అలసత్వంతో నిండింది… కర్కశ ఉగ్రవాదాన్ని మృదువుగా చూపారు… పాకిస్తాన్ వికృత పాత్రను పక్కకు నెట్టారు… భారత సార్వభౌమత్వాన్ని ఓ వ్యాధిలా చూపించారు… ఢిల్లీ అల్లర్లను కూడా వన్ సైడ్ నైతిక కథలుగా మార్చారు… రైతు ఉద్యమాలను ఆకర్షణీయంగా చూపించారు…

ఆర్థిక అజ్ఞానం, రాజకీయ వ్యూహాల్ని, కుట్రల్ని మాత్రం పట్టించుకోలేదు. CAA–NRCని ఓ జెనోసైడ్ ఫ్యాన్ ఫిక్షన్‌లా ప్రచారం చేశారు… ప్రతి అంశం ఒకే ఫిల్టర్‌లోంచి వచ్చింది… భారత్ అంటే చెడు, రాజ్యం అంటే దౌష్ట్యం, ఈ సమాజం అంటే ప్రమాదకరం అనే కళ్లద్దాల నుంచే చూడబడింది, రాయబడింది…

వాళ్లు ఒప్పుకోని అసౌకర్యకరమైన నిజం ఏంటంటే — ఈ ఫ్రేమింగ్ ఇక అమ్ముడుపోదు… భారత్‌లోనే కాదు… ప్రపంచంలో కూడా… పాఠకులు మూర్ఖులు కాదు… భావజాల ఫ్యాక్టరీ వాసన వాళ్లకు తెలుస్తుంది… ప్రతి కథ ఒకేలా ఉంటే, విసుగు వస్తుంది…

ఇదే అసలు జరిగింది… ఇది వార్తల సెన్సార్ కాదు… ఫాసిజం అసలే కాదు. నోరు మూయించడం అంతకన్నా కాదు… మార్కెట్ కరెక్షన్…

వాళ్ల ద్వంద్వ వైఖరి నవ్వు తెప్పిస్తుంది… భారతదేశానికి నీతులు బోధించే ఈ జర్నలిస్టులకు — పశ్చిమ దేశాల్లో దుర్గంధం వ్యాపిస్తున్న ఎప్స్టీన్ ఫైళ్ల బండారం మాత్రం ఇన్నేళ్లూ కనిపించనేలేదు… ఎలైట్ సెక్షన్ రక్షణ, మీడియా భాగస్వామ్యం ఇప్పుడు బయటపడుతున్నాయి… బోధించడానికి ముందు ఆత్మపరిశీలన అవసరం కాదా..?

భారత అభివృద్ధి కథలు వీళ్లకు వ్యక్తిగతంగా ఇబ్బంది… ఎందుకంటే, అది వాళ్లకు అలవాటైన ఓ మూస భావజలాన్ని చెదరగొడుతుంది… ఎప్పటికీ విఫలమైన ఒక దేశంగా మాత్రమే వీళ్లతో చూపబడిన దేశం — ఎదుగుతోంది, ఓటేస్తోంది, కొత్తగా నిర్మితమవుతోంది.., పాశ్చాత్యుల అభిప్రాయాలు, అనుమతులు అవసరం లేకుండా ముందుకు పోతోంది… అలా జరిగితే వీళ్ల పాత్రే అప్రయోజనంగా మారుతుంది కదా… అందుకే ఆ కోపమే ఇది…

స్వంత భావజాలాన్నే లోతైన అవగాహనగా, అహంకారాన్నే రిపోర్టింగుగా భావించే జర్నలిజానికి — ఏ బిలియనీర్ అయినా సరే — మేపుతూ పోలేడు… అందుకే…

మార్కెట్ మాట్లాడింది…
ఉత్పత్తి విఫలమైంది…
పీఠం కూలిపోయింది…

( — “X”లో శివమ్ వాహియా పోస్టుకు తెలుగు అనువాదం ఇది... సమాజాన్ని తాము తయరు చేసుకున్న కళ్లద్దాల నుంచి మాత్రమే చూసే జర్నలిజం ఇప్పుడు చెలామణీ కాదు... సమాజం తిరస్కరిస్తుంది... అదే జరిగింది... నీతి ఏమిటంటే..? జర్నలిజం వేరు యాక్టివిజం వేరు... ఆ గీతను గౌరవించాలి...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్ట్రాటో ఫోర్ట్రెస్..! అమెరికా గగన వజ్రాయుధం యుద్ధరంగంలోకి..!!
  • మానవతా సంస్కారం..! పల్లెలో ఇంకా ‘మంచి మనసులు’ బతికే ఉన్నయ్…!
  • చోకర్స్ కాదు..! దక్షిణాఫ్రికా దురవస్థ ప్రతిభ లేక కాదు..! అదృష్టం లేక…!!
  • అమిత్ షా ఎదుటే ‘నక్సల్ ముక్త భారత్’ ఫైనల్ షో..!
  • కన్నతల్లి జడ్జిమెంటే అంతిమం… అదే అసలు సిసలు డీఎన్ఏ తీర్పు…
  • అడకత్తెరలో పాకిస్థాన్… యుద్ధ శిఖండి పాత్రపై ఇరాన్ రుసరుస…
  • అగ్రి సోలరైజేషన్… తెలంగాణ రైతు రియల్ ‘పవర్ స్టార్’…
  • నేను చెప్పిందే ఫైనల్..! రేవంత్‌రెడ్డి మాటే హైకమాండ్ మాట…!
  • ప్రపంచం కాలిపోతున్నా… మనింట్లో పాయసం మరుగుతూనే ఉంటుంది…
  • వాట్ ఏ మ్యాచ్..! 13 ఓవర్లలోనే ఫినిష్ చేసి, వరల్డ్ కప్ ఫైనల్స్‌లోకి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions