.
మన రాజకీయాల్లో… ప్రత్యేకించి సినిమా నటుల రాజకీయాల్లో ఎప్పుడూ వాళ్ల వివాహాలు, విడాకులు ఎప్పుడూ చర్చనీయాంశాలే… నిజానికి ఒక నటుడి రాజకీయ ధోరణులకు, తన వ్యక్తిగత జీవితానికీ నడుమ ప్రత్యక్ష సంబంధం ఏమీ ఉండదు కానీ జనం ఆసక్తిగా గమనిస్తుంటారు…
తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టిన విజయ్ గురించీ అంతే… రాబోయే ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభావం బాగా ఉంటుందనే భావనతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ తనతో కలిసి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నాయి… ఈలోపు కొన్నాళ్ల క్రితం విజయ్ ర్యాలీలో తొక్కిసలాట, రాజకీయ ఛాయలున్న తన చివరి సినిమా విడుదల ఆగిపోవడం వంటి చర్చల్లో ఉన్నాయి…
Ads
తరువాత నటి త్రిష ఇంటి నుంచి బయటికిరా, ప్రజాసమస్యలు తెలుస్తాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన విమర్శలు సంచలనం క్రియేట్ చేశాయి… కానీ అవి మరీ థర్డ్ రేట్ విమర్శలు అనే అభిప్రాయాలు కూడా వినవచ్చాయి… దాంతో అన్నా మలై, వనతి శ్రీనివాసన్ కల్పించుకుని నచ్చజెప్పడంతో నైనార్ సారీ చెప్పాడు… త్రిష సీరియస్‌గా రియాక్టయింది కూడా… తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ విమర్శల్లోకి లాగడం నీచమైన, అసభ్యకరమైన ధోరణిగా మండిపడింది…

ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే..? విజయ్ భార్య సంగీత తనతో విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది… త్వరలోనే ఇది విచారణకు వచ్చే అవకాశముంది… గతేడాది నుంచి వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటారని రూమర్స్ వచ్చాయి…. త్రిషతో అక్రమ సంబంధాలే ఈ పొరపొచ్చాలకు కారణమనే వార్తలు తమిళ మీడియాలో చాలాసార్లు కనిపించాయి…
రెండేళ్లుగా విజయ్, సంగీత విడిగానే ఉంటున్నారట కూడా..! ఇప్పుడిక అధికారికంగానే ఆమె విడాకులు కోరుకుంటోంది… ఈ విడాకులు, అక్రమ సంబంధం వ్యవహారాలు విజయ్ పట్ల జనంలోని క్రేజును పెద్దగా తగ్గించకపోవచ్చు గానీ… ఎంతోకొంత మైనస్ అని భావిస్తున్నారు… 1999లో వీళ్లిద్దరి వివాహం అయ్యింది… ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు… ఇన్నేళ్ల తరువాత (26 ఏళ్లు) ఆమె ఇక ‘సర్దుకుపోలేక’ తెగదెంపులకే రెడీ అయిపోయింది…
విజయ్ వయస్సు ప్రస్తుతం 51… త్రిష వయస్సు 42 ఏళ్లు… ఇద్దరూ కలిసి 5 సినిమాల్లో నటించారు… 2004 నుంచి 2008 వరకు గిల్లి, తిరుపాచి, ఆతి, కురువి… తరువాత 2023లో అంటే, 15 ఏళ్ల విరామం తరువాత లియోలో కలిసి నటించారు… లియో తరువాతే ఇద్దరి మధ్య ‘రిలేషన్’ పెరిగిందని తమిళ సోషల్ మీడియా చెబుతోంది…

విజయ్, సంగీత దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమారుడు జాసన్ సంజయ్… తను దర్శకత్వ శాఖలోకి అడుగుపెడుతున్నాడు… 25 ఏళ్లు… కుమార్తె పేరు దివ్య షాషా… 20 ఏళ్లు… ఇదీ స్థూలంగా విజయ్- సంగీత విడాకుల కథ…
అన్నట్టు… సంగీత కుటుంబానికి సినిమా నేపథ్యం ఏమీ లేదు… ఆమె గృహిణి… కాకపోతే ఆమె తండ్రి శ్రీలంకకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త… ఆయన లండన్‌లో స్థిరపడి వ్యాపారాలు చేసేవాడు… Times of India కథనాల ప్రకారం, విజయ్ సినిమా షూటింగ్ చూడటానికి లండన్ నుంచి వచ్చినప్పుడే వీరిద్దరి పరిచయం ఏర్పడింది… చివరకు ఇలా, ఇన్నేళ్లకు బ్రేకయింది..!!
Share this Article