.
ఈమధ్య ఎవరో మహారాష్ట్ర మాజీ సీఎం అనుకుంటా… ఆపరేషన్ సిందూర్ మరుసటిరోజే ఇండియా చేతులెత్తేసి ఓడిపోయిందన్నాడు… రాహుల్ గాంధీ అయితే కుచ్చీ కుచ్చీ మనం ఎన్ని జెట్ ఫైటర్లను కోల్పోయాం, అందులో రఫెల్ కూడా ఉందాని అడుగుతున్నాడు…
ఇండియా దుస్థితి ఇదే.,. కీలకమైన అంశాల్లో బాధ్యతతో మెలగాల్సిన పార్టీలు సైతం దేశం, జాతీయ ప్రయోజనాలు, జాతి ఖ్యాతి వంటి అంశాలన్నీ గాలికి వదిలేస్తాయి… అచ్చంగా యాంటీబీజేపీ కళ్లద్దాల నుంచే చూస్తూ… ఆధారరహిత ఆరోపణలతో ఆర్మీని, ఎన్నికల కమిషన్‌ను డిమోరల్ చేయడానికి పదే పదే ప్రయత్నిస్తుంటాయి…
Ads
ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే పుస్తకం మీద రాహుల్ రాద్ధాంతాన్ని కూడా విడిగా చూడలేం… ఒక మమత, ఒక రాహుల్… అందరూ అంతే… ఆపరేషన్ సిందూర్ విషయానికి, విజయానికి వద్దాం… అది జాతి రక్షణకు, గౌరవానికి చేపట్టిన ఆపరేషన్…
ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ జనరల్స్… చీకట్లో రాళ్లు విసిరినట్లుగా బ్రహ్మోస్ మిస్సైళ్ళు ప్రయోగించలేదు… ప్రతి మిస్సైల్‌ను ఒక నిర్దిష్ట లక్ష్యంతో ప్రయోగించారు… పాకిస్తాన్ తన అణ్వాయుధాలను దాచుకున్న బంకర్ల ఎంట్రీ & ఎగ్జిట్ మార్గాలను బ్రహ్మోస్ మిస్సైళ్లతో బద్దలు కొట్టారు… భారత్‌పై దాడికి ఉద్దేశించిన పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశారు… దాంతో పాకిస్తాన్ ప్రతిదాడి సామర్థ్యం పూర్తిగా నిర్వీర్యం ఐంది… భారత్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది…
అందుకే కదా ట్రంపు హడావుడిగా ఎంటరయ్యాడు… పాకిస్థాన్‌ను రక్షించే పనికి పూనుకున్నాడు… ఆపరేషన్ సిందూర్ అనేది ఓ మిషన్… ఒక మిలిటరీ ఆపరేషన్ మాత్రమే కాదు… అదొక యుద్ధ వ్యూహం, యుద్ధ తంత్రం & యుద్ధ చతురత… ఆ మిషన్ రానున్న కొన్ని శతాబ్దాల పాటు మిలిటరీ అకాడెమీల్లో ఒక పాఠ్యగ్రంథం కానుంది… అసలు ఆపరేషన్ సిందూర్ ను విశ్లేషించడానికే కొన్ని దశాబ్దాలు పడుతుంది…
ఈ మాట, ఈ అభిప్రాయం ఎవరిదో కాదు, ఆస్ట్రియాకు చెందిన ప్రఖ్యాత గగనతల యుద్ధ రంగ నిపుణుడు, విశ్లేషకుడు & చరిత్రకారుడు “టాం కూపర్’’ ది… టైమ్స్ నౌ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తను వెల్లడించిన విషయాలు ఆసక్తికరం… ఆ వార్త ఇలా…

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ కుప్పకూలిందని ప్రముఖ యుద్ధ చరిత్రకారుడు, అంతర్జాతీయ విమానయాన నిపుణుడు టామ్ కూపర్ విశ్లేషించాడు… టైమ్స్ నౌ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు…
1. ఇది స్పష్టమైన ‘ఇండియన్ విక్టరీ’ ఆకాశంలో జరిగిన ఈ పోరులో భారత్ క్లియర్-కట్ విజయం సాధించిందని కూపర్ స్పష్టం చేశాడు… పాకిస్థాన్ తన డ్రోన్లు, క్షిపణులు, ఫిరంగి దాడులతో ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుందని ఆయన పేర్కొన్నాడు…
2. అణు కేంద్రాల ప్రవేశ ద్వారాలే టార్గెట్! ఈ ఆపరేషన్‌లో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే… భారత వాయుసేన పాకిస్థాన్‌లోని ముషాఫ్ ఎయిర్ బేస్ (Mushaf Air Base) వద్ద ఉన్న అణు ఆయుధాల నిల్వ కేంద్రాల (Nuclear Weapon Storage Sites) ప్రవేశ ద్వారాలను ధ్వంసం చేయడం…
-
వ్యూహం…: అణు కేంద్రాలను నేరుగా పేల్చకుండా, లోపలికి వెళ్లే, బయటకు వచ్చే దారిని మూసివేయడం ద్వారా పాక్ తన సొంత అణు ఆయుధాలను వాడుకోలేని పరిస్థితిని భారత్ కల్పించింది…
-
టామ్ కూపర్ మాటల్లో…: “శత్రువు అణు కేంద్రాలనే టార్గెట్ చేస్తున్నారంటే… ఎదురుదాడి ఉండదని భారత్ ఎంతటి ఆత్మవిశ్వాసంతో ఉందో అర్థం చేసుకోవచ్చు… ఆయుధాలు అందుబాటులో లేకపోతే ఇక ఆట ముగిసినట్లే (Game Over)…”
3. పాక్ రక్షణ వ్యవస్థ వైఫల్యం పాకిస్థాన్ తన సొంత అణు కేంద్రాలను కనీసం కాపాడుకోలేకపోయిందని, వారి ఎయిర్ బేస్‌లు కూడా భారత దాడుల ముందు నిలవలేకపోయాయని కూపర్ విశ్లేషించాడు… భారత్ పంపిన సందేశం చాలా స్పష్టంగా ఉందని – “మీకు ఎక్కడ తగిలితే నొప్పి పుడుతుందో అక్కడే మేం కొట్టగలం” అనేదే ఆ సందేశం అనీ ఆయన అభిప్రాయపడ్డాడు..
4. భారత జనరల్స్ సంయమనం భారత సైనిక నాయకత్వం చాలా హుందాగా, సంయమనంతో వ్యవహరించిందని ఆయన ప్రశంసించాడు… యుద్ధాన్ని మరింత పెంచకుండా (Escalation), పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయకుండా కేవలం దారిని మూసివేయడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక పైచేయిని నిరూపించుకుందని ఆయన పేర్కొన్నాడు…
సారాంశం…: రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల దృష్టిలో భారత్ తన శత్రువును వ్యూహాత్మకంగా దెబ్బతీసిందని, పాక్ ‘అణు భయం’ అనే బూచీని భారత్ పటాపంచలు చేసిందని ఈ కథనం స్పష్టం చేస్తోంది…
అన్నట్టు కొన్ని అణ్వాయుధాల నుంచి ఆల్రెడీ రేడియేషన్ లీకైందనే వార్తలు కూడా వచ్చాయి, అమెరికా విమానాలు పరీక్షలకు వెళ్లాయనీ ఆ వార్తల సారాంశం..!!
Share this Article