Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వైఎస్ నిజవారసత్వ పంథాలో రేవంత్… మచ్చుకు కొన్ని మెచ్చు తునకలు ఇవీ…

March 10, 2026 by M S R

.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నాడు… సగటు పేద కుటుంబానికి ఆసరాగా నిలిచే పథకాల దగ్గర నుంచి తనను నమ్ముకున్న, తను నమ్మిన నాయకుల్ని ప్రోత్సహించే రాజకీయ పోకడల దాకా… అనేక ఉదాహరణలు, అనేక పోలికలు…

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే చర్చ సాగుతోంది… పదే పదే యాంటీ రేవంత్ రెడ్డి గాలి విమర్శల బ్యాచ్ తనను చంద్రబాబుతో బంధాన్ని పోల్చుతూ ఉంటారు గానీ… నిజానికి రేవంత్ రెడ్డి పంథా వైఎస్ పంథా అనే అభిప్రాయాలు వినవస్తున్నాయి… నిజంగానే ఇదొక ఆసక్తికరమైన చర్చ… అఫ్‌కోర్స్, రేవంత్, వైఎస్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ విధేయ నాయకులే…

Ads

నిజానికి వైఎస్ వాస్తవ వారసత్వం అంటే ఏమిటి..? ఆయన వారసత్వాన్ని అనేకానేక పథకాలకు ఆయన పేర్లు పెట్టడంలో కాదు… వైఎస్ పాలన స్పూర్తిని అందిపుచ్చుకోవడం… ఉదాహరణకు… ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సామాజిక పింఛన్ల పెంపు, పక్కా ఇళ్లు, 104, 108 వంటి సంక్షేమం ఒకవైపు… అంటే సగటు పేదకుటుంబానికి వైద్యం, విద్య, తిండి, గూడు అంశాల్లో భరోసాగా నిలబడటం… ఇవే కదా ఆయన్ని లక్షల కుటుంబాలకు దేవుడిని చేసినవి…. ఈరోజుకూ మొక్కేలా చేసినవి…

మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్‌కు గోదావరి తాగునీరు, మెట్రో రైలు, హెచ్ఎండీఏ, జలయజ్ఞం వంటి శాశ్వత ఉపయుక్త, మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలు… ఎస్, వోకే, కానీ వైఎస్‌కూ రేవంత్‌కూ పోలిక ఏమిటి అంటారా..? కొన్ని మచ్చుకు చూద్దాం…



వైఎస్ఆర్

1) మౌలిక వసతులు… నాడు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం… సేమ్, వరంగల్ (మామునూరు) అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ద్వారా తెలంగాణకు గ్లోబల్ కనెక్టివిటీ నేడు…



2) హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు సంకల్పం, భూసమీకరణ, నిర్మాణం, 2006లో శంకుస్థాపన, వేగంగా కళ్ల ముందుకు నిర్మాణం… మరి నేడు..? రీజనల్ రింగ్ రోడ్… అలైన్‌మెంట్ ఆమోదాలు, భూసమీకరణ… ఇద్దరూ మౌలిక శాశ్వత వసతులపై దృష్టి పెట్టడం…



3)  వైఎస్ పీరియడ్‌లో ఫేమస్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఉచిత వైద్య భీమా, 108 వంటి అంబులెన్స్ సర్వీసులు… సేమ్ రేవంత్ రెడ్డి… ఉద్యోగులకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్, ప్రమాద బీమా, చేయూత పథకం ద్వారా కోట్ల కుటుంబాలకు భారీ ఆరోగ్య భద్రత… సేమ్ లైన్స్, సేమ్ అడుగు జాడలు…



4) రైతే రాజు అనే భావన… రైతులకు ఉచిత విద్యుత్తు అనేది వైఎస్ కీర్తికిరీటంలో ఓ ధగధగ వజ్రం… భారీ రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీలు తనను రైతుబాంధవుడిని చేశాయి… ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్ ధర… రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే పోకడ…



5) హైదరాబాద్ బిజినెస్ విస్తరణ కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి… సేమ్, అదే తరహాలో ఇప్పుడు రేవంత్ ఫ్యూచర్ సిటీ సంకల్పం, ప్రతిపాదన, అమలు దిశలో కార్యాచరణ… తోడుగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ, కాలుష్య రహిత గ్లోబల్ సిటీ…



6) రాజకీయంగా తను నమ్మిన, తనను నమ్మిన వాళ్లను ఎలివేట్ చేయడం… మిత్రధర్మం… వైఎస్ పీరియడ్‌లో 2008లో ఆయన ఆత్మగా భావించబడిన కేవీపీని రాజ్యసభకు పంపించడం… ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్నిహిత మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించడం… నమ్మకానికి రాజకీయ చేయూత…



7) 2006లో గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జనం భారీ మద్దతు… సేమ్, 2025లో తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం పంచాయతీలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా కాంగ్రెస్ కైవసం…



8) 2005లో నగర, పట్టణ స్థానిక ఎన్నికల్లో వైఎస్‌కు అపూర్వ విజయం… సేమ్, 2025లో తెలంగాణ పట్టణ, నగర ఎన్నికల్లో రేవంత్ నాయకత్వానికి తిరుగులేని, అనుకూల, ఏకపక్ష ప్రజాతీర్పు …



9) 2008 ఉపఎన్నికల్లో వైఎస్ నాయకత్వానికి జై… సేమ్, 2025 జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో వోటర్ల అనూహ్య, అఖండ మద్దతు…



10) ఓ గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను డెవలప్ చేసే దిశలో పాలనపరంగా హెచ్ఎండీఏ ఏర్పాటు, శివారు ప్రాంతాల విలీనం… నగర పాలనపై ప్రత్యేక దృష్టి… ఇప్పుడు మూడు కార్పొరేషన్ల ఏర్పాటు… GHMCను GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విభజించే నిర్ణయం… హెచ్ఎండీఏ మరింత విస్తరణ… గ్లోబల్ సిటీలో కాలుష్యం తగ్గింపు దిశలో ప్యూర్ కసరత్తు… ఔటర్ తరువాతే పరిశ్రమలు, ఉత్పత్తి ప్రాధాన్యం… ఆర్ఆర్ఆర్ తరువాత వ్యవసాయం, తదితర రంగాలకు ప్రాధాన్యం… ఆలోచనల్లో క్లారిటీ…



11) 2003లో వేల కిలోమీటర్ల పాదయాత్ర, అంటే జనంలో ఉండటం, జనం చెప్పింది వినడం, తన ప్రాధాన్యాలకు రూపకల్పన చేసుకోవడం… రేవంత్ రెడ్డి ఏ సందర్భం వచ్చినా జనంలోకి వెళ్లడం… జనంలో ఉండటం నిజమైన నాయకుడి లక్షణం… ఎక్కడో పడుకుని, అజ్ఙాతంలో ఉండిపోవడం కాదు, జనం మీద అలగడం కాదు… అది నిజనాయకుడి లక్షణం కాదు…



12) కాంగ్రెస్ అంటేనే ఓ అపరిమిత స్వేచ్ఛ… అసంతృప్తులు, కుట్రలు, ఫిర్యాదులు గట్రా బోలెడు… వైఎస్ తనదైన ధోరణితో అందరినీ కలుపుకుని వెళ్లి, అసమ్మతి లేకుండా చూసుకున్నాడు… రేవంత్ రెడ్డి బాట కూడా ఇదే… ప్రస్తుతానికి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు కనిపించడం లేదు…

13) పావలా వడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు సహాయం వంటి మహిళ సాధికారత పథకాలు వైఎస్ హయాంలో… రేవంత్ రెడ్డి పాలనలో మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు రాజకీయ అవకాశాలు… సేమ్ అవే అడుగులు… ఆర్థిక స్వావలంబన…



15) యువతకు రాజీవ్ యువకిరణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉన్నత విద్యకు తోడ్పాటు… రేవంత్ రెడ్డీ సేమ్… రాజీవ్ యువ వికాసం – స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం…



రేవంత్ అడుగులకు వైఎస్ పాలన, రాజకీయ ధోరణులే మార్గదర్శి... ఇవీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వైఎస్ నిజవారసత్వ పంథాలో రేవంత్… మచ్చుకు కొన్ని మెచ్చు తునకలు ఇవీ…
  • టీ20 వరల్డ్ కప్ హీరో కేరళ సంజూ శాంసన్ కథ తెలుసా మీకు..?
  • ముత్యం పూర్తిగా కడగబడలేదు… ఇంకా శుభం కార్డు పడలేదు…
  • ఓ చిన్న తెలుగు పత్రిక క్లిప్పింగ్ నిన్నంతా వైరల్… ఎందుకు..?
  • ఏది పనికిరాని ముచ్చట..? మన పెళ్లా..? నేనా..? త్రిషతో బంధమా..?
  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…
  • కేటీఆర్ ఇలా ట్వీటాడో లేదో… కవిత నుంచి కౌంటర్ పడింది…
  • త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions