Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సమాజం, సభ్యత, బాధ్యత – బూతులు, సంస్కారం..!

February 8, 2026 by M S R

.

( Ramu Suravajjula ) …. “నన్ను బాసు ఇవ్వాళ బాగా వేసుకున్నాడు…,” అని ఒక అందమైన కలీగ్ యజమాని క్యాబిన్ నుంచి బయటికొస్తూ అమాయకంగా నాతో అన్నది. నేను కంగారు పడ్డా. బాసు వేసుకోవడం అంటే ఆ పిచ్చితల్లి భాషలో చివాట్లు పెట్టినట్లని ఆమె చెప్పినదాన్ని బట్టి అర్థమయ్యింది.

“నన్ను బాసు ఎక్కి దిగాడు. రోజూ దొబ్బి దొబ్బి పెడుతున్నాడు,” అని ఇంకో రోజు చెప్పింది. దీనర్థం కూడా… తిట్టాడనే. వేసుకోవడం… అంటే మామూలుగా తిట్టడం. దొబ్బి దొబ్బి పెట్టడం… అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ చీవాట్లు.

Ads

మా ఊళ్ళో పరమ బూతు, అభ్యంతరకరం… అనిపించే అనేక పదాలు ఈ సిటీలో చిన్న చిన్న పిల్లలు అలవోకగా వాడేస్తున్నారు. ఎందుకంటే… సినిమా వాళ్ళు, టీవీల వాళ్లు చాలా పదాలను (మాటల రూపంలో కొన్ని, సైగల ద్వారా కొన్ని) నాజూగ్గా నార్మలైజ్ చేశారు.

  • దాదాపు అన్ని పచ్చి బూతులూ కడుపు నిండా నేర్చుకుని, నోటినిండా వాడేసి ఒక సంస్కారవంతురాలి సహచర్యంలో సంస్కరణకు గురైన నేను ఇంత ఘోరమైన పదాలను అన్నాళ్ళూ ఎట్లా వాడానా? అని సిగ్గేస్తుంది. మావి చంద్రహాస్ టైప్ బూతులే!

కోపం, నిస్పృహ, బూతులు చాలా సాధారణ విషయాలు. అందరం మన మన స్థాయిల్లో బూతు పదాలు వాడుతూనే ఉంటాం. బూతులు లేకపోతే దాడులు, రక్తపాతం ఇంకా ఎక్కువ అవుతాయి. బూతు పదాలు స్ట్రెస్ బస్టర్స్. వాటిని వాడకపోవడం ఉత్తమం… ఒకవేళ బలహీన క్షణాల్లో వాడాల్సి వచ్చినా… అవి ఎక్కడ, ఎప్పుడు వాడాలనే ఇంగితం ఉండాలి. సరే, అలాంటి స్పృహలేని శుంఠలు కామెంట్స్ రూపంలో వాడే భాష చూస్తే బూతు పునరుద్ధరణ మహత్కార్యంలో టెక్నాలజీ పాత్ర ఏమిటో అర్థమవుతుంది.

భార్యని బండ బూతులు తిట్టే భర్తలు, కింది ఉద్యోగులను పాలిష్డ్ లాంగ్వేజ్ లో స్కోల్డ్ చేసే బాసులు పెద్ద సంఖ్యలో ఉంటారు. అట్లాగని భర్తలను బూతులు దోకని సాహస భార్యలు, బాసుని తిట్ల పురాణంతో దంచే తెగించిన ఉద్యోగులు ఉండరని కాదు. శారీరక, మేధో, ఆర్థిక, బలహీనులను బలవంతులు బూతులతో తిట్టి తీట తీర్చుకోవడం సమాజ సహజ నియతి. ఈ సామాజిక మాధ్యమాల్లో ఉన్నంత మంది బూతు రాయుళ్ళు ఎక్కడా ఉండరని ఈ ప్లాట్ ఫామ్ ను సీరియస్ గా తీసుకునే అందరికీ తెలుసు.

అయితే, బూతు ఎక్కడ, ఎలా వాడాలన్నది ముఖ్యమైన విషయం. ఏదో విషయంలో కోపం కట్టలు తెంచుకుని… “నాన్నా… గుంజి గుంజి గుంజి… నీ – – పగలగొడతా…” అని చంద్రహాస్ వాళ్ళ నాన్న ప్రభాకర్ ను కోపంగా ఇంట్లో అన్నా తప్పే. కానీ కన్న పిల్లవాడు కదా! అని పోనివ్వవచ్చు. వీధిలో ఒక పది మంది ముందు ఇదే మాట అన్నా ఒక రకంగా పోనివ్వవచ్చు. కానీ ఇదే మాటను ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీ లో ప్రకటన గా ఇస్తానన్నా, ఒక మైక్ లో అంటానన్నా బాగుండదు. ఈ చిన్న తేడా తెలియక అల్లరి అల్లరి అయ్యారు… కొడుకు, అయ్యా.

చేసిందే తప్పు. ఇది తప్పురా నాయనా… అని జనం అనగానే నాలిక కరుచుకుంటే బాగుండేది. విమర్శల మీద తండ్రీ కొడుకులు రెచ్చిపోవడం రెండో పెద్ద తప్పు. ఆ పిల్లవాడు… మరీ పొగరుగా, ఇల్లాజికల్ గా ప్రవర్తించాడు. దానికి తగినట్లు నువ్వు సూపర్ కన్నా… రెచ్చిపో….అన్నట్లు తండ్రి ప్రకటన ఏడ్చింది మొదట్లో.

ఆ బరాబర్ ప్రేమిస్తా అన్న సినిమా చివర్లో ఏడవని వాడు… మానవత్వం లేనివాడని ఆ తండ్రి మైకుల ముందు అన్నప్పుడు నాకు అర్థమయ్యింది… ఇదేదో తేడా బ్యాచ్ అని. ఎస్కలెట్ చేస్తా… అని చంద్రహాస్ అన్న వీడియో, కొన్ని టీవీ షోలలో లైవ్ లో తన ప్రవర్తన పిల్ల చేష్టలు. సినిమాకు దెబ్బపడిందని తర్వాత ఏడ్చి ఏమి లాభం? (అన్నట్లు… అబ్బ నీ తీయనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరో అబ్బా… అన్నా మా ఊళ్ళో బూతే సుమండీ!)

పెద్ద హీరోలు బూతులు మాట్లాడలేదా? పాపం… పసివాడిపై ఇంత కోపమేల? అనవచ్చు. కడుపు చేస్తాననడం, కొట్టడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం… ఈ మహానుభావులు చేసిందే. ధన మదం, ప్రజాదరణ వల్ల అట్లా పొగరు నెత్తికి ఎక్కుతుంది. జనాలు అదే గొప్పగా భావించి తరిస్తారు. అది మన కర్మ!

పిల్లవాడు రెచ్చిపోయి పుచ్చిపోయాడు. ఇప్పుడైనా తత్వం బోధపడి మైక్ ముందు మూసుకుని ఉంటాడని ఆశించవచ్చు. లేకపోతే… జనాలే గుంజి గుంజి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొంపముంచిన అక్రమ సంబంధం… కటకటాలపాలైన దొంగ జ్యోతిష్కుడు…
  • సమాజం, సభ్యత, బాధ్యత – బూతులు, సంస్కారం..!
  • అదుగో పొగ… ఇదుగో బురద… ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్థమా..? దహనమా..?
  • AI వ్యూహంలో చిక్కుకున్న భారత్… మిషన్లకు అందని సూర్య మ్యాజిక్..!
  • నిజమే… ఐటీ ప్రపంచంలో ఆంథ్రోపిక్ ఎఐ ప్రకంపనలు షురూ…
  • ప్రశ్న కూడా ఇక్కడ ఓ ప్రార్థనలాంటిదే… భూటాన్‌లో కొన్ని ప్రశ్నలు అడగరు…
  • అసలైన హీరో… రోజర్ మూర్ మనసున్న ‘బాండ్’…
  • ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న కార్పొరేషన్ పగ్గాలు… ఎవరీమె..?
  • నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…
  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions