Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుడ్ గోయింగ్… హైకమాండ్ సర్టిఫికెట్… రేవంత్ రెడ్డికి ఓ బూస్టప్…

February 20, 2026 by M S R

.

ఎప్పటికప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థుల మీద విజయాలు సాధిస్తూ, పాతుకుపోతున్నాడు పార్టీలో, ప్రభుత్వంలో..! ఇది నిజంగానే రాజకీయ ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీలోని అసంతృప్తవాదులకు కూడా జీర్ణం కావడం లేదు… నిన్న ఢిల్లీలో సీఎంకు హైకమాండ్ ముఖ్యులందరి ప్రశంసలూ రేవంత్ రెడ్డికి పార్టీ ఇచ్చిన విశేష సర్టిఫికెట్…

బాగా పనిచేస్తున్నారు… పార్టీపరంగా, ప్రభుత్వపరంగా మీ కృషి బాగుంది, కీపిటప్, కొనసాగించండి… ఇదే రీతిలో బీఆర్ఎస్, బీజేపీలను నిలువరించండి… ఈ వ్యాఖ్యలు తమ పార్టీ ముఖ్యమంత్రికైనా సరే, కాంగ్రెస్ పార్టీలో చాలా అరుదు… అందుకే ఓసారి చెప్పుకోవాలి ఈ షో ద్వారా రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల మీద మరో గోల్ సాధించాడు…

Ads

కొంచెం వివరంగా చెప్పుకోవాలి… మామూలుగా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా… అంటే నిత్యం అసమ్మతి, అసంతృప్తి తంపులాటలు ఎక్కువ… నిత్య వివాదాలు… హైకమాండ్‌కు ఫిర్యాదులూ ఎక్కువే… దీనికితోడు ప్రత్యర్థి పార్టీలు కూడా ఎగదోస్తుంటాయి వీటిని కావాలని… వీటిని ఎక్కడికక్కడ బ్రేక్ చేస్తూ, సైలెంటుగా సీఎం తన పునాదుల్ని పటిష్టపరుచుకుంటున్న తీరు విశేషమే…

మామూలుగా రేవంత్ రెడ్డి మీద మొదటి నుంచీ కావాలని చేసే ప్రచారాలు ఏమిటి..? 1) లాటరీ సీఎం 2) చాన్నళ్లు ఉండనివ్వరు 3) పార్టీ సీనియర్లు తనను కొనసాగనివ్వరు 4) హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉంది 5) పరిపాలనపై పట్టు లేదు 6) అనుభవం లేదు 7) రేపోమాపో కొత్త సీఎం గ్యారంటీ 8) ప్రజల్లో వ్యతిరేకత స్టార్టయింది… ఇవే కదా…

మొత్తం కేబినెట్‌నే హైకమాండ్ దగ్గరకు తీసుకెళ్లి, శెభాష్ అనిపించుకోవడంతో… సగం ప్రచారాలకు తెరపడింది… రాహుల్, ఖర్గే సహా ముఖ్యులందరూ సర్టిఫికెట్ ఇచ్చేయడంతో చాలా నోళ్లు మూతపడ్డట్టే… వరుసగా కంటోన్మెంట్, జుబ్లీ హిల్స్, పంచాయతీ, మున్సిపల్ ఫలితాలతో ప్రజావ్యతిరేకత అనేదీ కరెక్టు కాదని తేలిపోయింది…

మొత్తం కేబినెట్ హైకమాండ్ ముఖ్యులతో దిగిన ఫోటో రేవంత్ రెడ్డి పార్టీపరంగా పాతుకుపోయాడని చెప్పడానికి ఓ పెద్ద సంకేతం… అది జనంలోకి కూడా చాలా సందేశాల్ని పంపిస్తుంది… ఈ ప్రభుత్వం అస్థిరం కాదు, ఈయనేమీ అస్థిర ముఖ్యమంత్రి కాదు అనే సందేశాల్నే కాకుండా… పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించగల లీడర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుని, జనానికీ అదే చూపించాడు…

ఎఐసిసి

సుస్థిర ప్రభుత్వం అనేది రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులు, ప్రాజెక్టులు, ఇతర పథకాలకు ఓ భరోసా… ఆ పాజిటివ్ వాతావరణం నెలకొల్పడానికి రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులు, మాది సుస్థిర ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నాలు రాష్ట్రానికి మంచిది…

ఎస్, ఏ ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రికైనా చాలా సవాళ్లుంటాయి, ఒడిదొడుకులూ ఉంటాయి… వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ… తనకు ఓ సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవడం… రేప్పొద్దున మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్గం ఏర్పరుస్తుంది… సో, నిన్నటి ఢిల్లీ భేటీలో పార్టీ కోణం నుంచి, ప్రభుత్వ కోణం నుంచి అధిష్టానం వేసిన డిస్టింక్షన్ మార్కులు తనకు ఓ బూస్టప్…

నేడో రేపో రేవంత్ పదవి గల్లంతు అని ఆశపడుతూ, కలగంటున్న వాళ్లకు… ప్రత్యేకించి బీఆర్ఎస్ క్యాంపుకి ఎప్పటికప్పుడు ఆశాభంగమే అవుతోంది పాపం… దాంతో ఇలా కథనాలు రాసుకుంటూ సంతృప్తిపడుతుంది… పాపం..!! హైకమాండ్ ఎదుటే మంత్రులంతా రేవంత్ రెడ్డిని ఎండగట్టారట…!! ఎవరికి ఏది తోస్తే అది రాసేసుకోవడమే..!!

నమస్తే

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేదాంత దేశికులు… చిన జియ్యరుడికి అసలు తెలుసో లేదో…
  • కుదరదు..! ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఇప్పుడైతే అసాధ్యం..!!
  • నమ్మకాలు – అమ్మకాలు… అసలు ఎవరు ఈ జగ్గీ వాసుదేవుడు…
  • గుడ్ గోయింగ్… హైకమాండ్ సర్టిఫికెట్… రేవంత్ రెడ్డికి ఓ బూస్టప్…
  • హేమిటో… ఆ వయస్సులో వైవిజయతో స్టెప్పులు- రమ్యకృష్ణతో రొమాన్స్…
  • తెలంగాణ పోలీసులు భేష్… కానీ ఈ దరిద్ర అన్వేషుడి కథ ముగియలేదు…
  • చెత్తా ప్రచారాల్ని నమ్మకండి… ఏ బియ్యం బెటరో అర్థం చేసుకొండి…
  • పదేళ్లు వెనక్కి పోతారట… నమ్మితే పదేళ్లు ముందుకు వెళ్లిపోతారు…
  • అయ్యో భగవంతుడా… ఆ ముగ్గురినీ పెంచి పోషించేదెలా మాస్టారూ…
  • సర్వపిండి..! చివరకు దీన్ని కూడా భ్రష్టుపట్టించేస్తున్నారు… నిజం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions