Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హే బలవంత్..! ఒక ఈటీవీ జబర్దస్త్ తరహా పే-ద్ద సినిమా స్కిట్…!!

February 20, 2026 by M S R

.

66 ఏళ్ల వయస్సులో… కొంతకాలంగా సీనియర్ నరేష్ ఎంచుకుంటున్న పాత్రలు, వాటిని రక్తికట్టిస్తున్న తీరు నిజంగా మెచ్చదగిందే… చాలా భిన్నమైన పాత్రలు… అందులో కొన్ని కొందరు కేరక్టర్ ఆర్టిస్టులు కూడా ఎంచుకోవడానికి వెనుకాడే రసిక పాత్రలు… వాటిని సైతం తన అనుభవంతో మెప్పిస్తున్నాడు నరేష్…

కామెడీ, ఎమోషన్, ఎనర్జీ, టైమింగ్… చాలామంది కొత్త నటులు నరేష్‌ను చూసి నేర్చుకోవాలి… తన వ్యక్తిగత జీవితం తరహాలో కనిపించే ఓ పాత్ర ఈమధ్య నారీ నారీ నడుమ మురారిలో చేశాడు… ఎక్కడా వెగటు ఛాయలు లేకుండా సరదాగా, ఉల్లాసభరితం చేశాడు… ఇలాంటి పాత్రల్ని ఒప్పుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు…

Ads

అఫ్‌కోర్స్, నారీ నారీ నడుమ మురారి సినిమా పాత్రలాగే స్టిల్ పటుత్వ రసికుడు కదా… ఇప్పుడు కొత్తగా రిలీజైన  హే బలవంత్ (హే భగవాన్ టైటిల్‌ను ఇలా మార్చారు, సమస్యలు ఎందుకులే అనుకుని) సినిమాలో ఏకంగా ఓ వ్యభిచార వ్యాపారం నడిపే పాత్ర వేశాడు…

నిజానికి సినిమాలో పేరుకు సుహాస్ హీరో అయినా… మొత్తం డామినేషన్ నరేష్‌దే… కామెడీతోపాటు ఎమోషనల్ సీన్లలో కూడా నరేష్ మెప్పించాడు… సరే, సుహాస్ ఎప్పటిలాగే వోకే… ఐతే వ్యభిచారం మెయిన్ సెంటర్ ప్లాటుగా తీసుకున్నా సరే, దర్శకుడు పెద్దగా అశ్లీలం, అసభ్యం ఛాయల్లేకుండా ప్రయత్నించాడు…

ఐనా సరే అనేకచోట్ల డార్క్ కామెడీ… మీ మొహం ఇదేం రోత టేస్టురా అనుకుంటూనే… చూస్తాం… కానీ వరుసగా డైలాగ్స్, కామెడీ సీన్స్ మనమీద దాడి చేస్తూనే ఉంటాయి… పర్లేదు, ఫ్రెండ్సుతో వెళ్లండి, ఫ్యామిలీతో కాదు… మరి రేప్పొద్దున ఏ తలకుమాసిన ఓటీటీ వాడో స్ట్రీమ్ చేస్తాడు కదా అంటారా..?

అది మోడీ వైఫల్యం… మన ఖర్మ..! ఒక నా అన్వేషణ అనే పరమ నీచ్, నికృష్ట్, కమీనే దరిద్రుడినే ఏమీ చేయలేకపోయింది, ఈరోజుకూ ఓటీటీ, యూట్యూబ్ అశ్లీల, దేశవ్యతిరేక కంటెంటు మీద నియంత్రణే చేతకాలేదు… ఆఫ్టరాల్ ఈ ఈటీవీ జబర్దస్త్, హైపర్ ఆది మార్క్ బూతుకు అదేం కంట్రోల్ చేయగలదు…

సరే, ఈ సినిమాకు వస్తే… ఇదొక దరిద్రపు ప్లాట్… కానీ జనరంజకంగా మార్చడానికి నానా కష్టాలూ పడ్డాడు దర్శకుడు ఎవరో గానీ… నరేష్ అనే పాత్ర పర్‌ఫామెన్స్ మినహాయిస్తే మిగతా అందరూ సోసో… పాత్రల కేరక్టరైజేషన్ సరిగ్గా లేక శివానీ నగరం సోసో… స్రవంతి చొక్కారపు సోసో కన్నా తక్కువ, మరీ ఆమె డైలాగ్ డిక్షన్ మరీ దరిద్రం…

బట్, ఈ బురద పాత్రల్లోనూ సుదర్శన్, వెన్నెల కిషోర్, హర్షవర్దన్, బాబూ మోహన్ ఎట్సెట్రా నటులు తమ పాత్రలకు అనుగుణమైన పర్‌ఫామెన్స్ ఇచ్చారు… వాళ్ల తప్పు లేదు… చివరగా… జబర్దస్త్ తరహా వెగటు ట్రెండులో ఈ సినిమా పెద్ద వెగటు కాదు… మరీ చంద్రహాస్ తరహా చెత్తా రోత బూతు ట్రెండుతో పోలిస్తే పెద్ద అభ్యంతరకరమూ కాదు….

స్థూలంగా... ఇది సీనియర్ నరేష్ సినిమా... అంతే... మరీ హే భగవాన్ అనేట్టు లేదు, హే బలవంత్ అనేట్టు, బలవంతంగా చూడాల్సిన అవసరమూ లేదు... అడల్ట్స్  చూడొచ్చు, అదీ ఫ్యామిలీ రహితంగా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హే బలవంత్..! ఒక ఈటీవీ జబర్దస్త్ తరహా పే-ద్ద సినిమా స్కిట్…!!
  • వెగటు స్టార్..! యాటిట్యూడ్‌ను ప్రేక్షకులు గుంజీ గుంజీ — పగులగొట్టారు…
  • డాక్టర్ శ్రీలీల..! కాలేజీకి ఎప్పుడు పోయింది..? ఎప్పుడు చదివింది..?
  • వేదాంత దేశికులు… చిన జియ్యరుడికి అసలు తెలుసో లేదో…
  • కుదరదు..! ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఇప్పుడైతే అసాధ్యం..!!
  • నమ్మకాలు – అమ్మకాలు… అసలు ఎవరు ఈ జగ్గీ వాసుదేవుడు…
  • గుడ్ గోయింగ్… హైకమాండ్ సర్టిఫికెట్… రేవంత్ రెడ్డికి ఓ బూస్టప్…
  • హేమిటో… ఆ వయస్సులో వైవిజయతో స్టెప్పులు- రమ్యకృష్ణతో రొమాన్స్…
  • తెలంగాణ పోలీసులు భేష్… కానీ ఈ దరిద్ర అన్వేషుడి కథ ముగియలేదు…
  • చెత్తా ప్రచారాల్ని నమ్మకండి… ఏ బియ్యం బెటరో అర్థం చేసుకొండి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions