అరె, విన్నావా..? రమ్యకృష్ణ అప్పట్లో… అంటే 20 ఏళ్ల క్రితం ఇదే మహేశ్ బాబుతో ఐటమ్ సాంగ్ చేసి, ఓ ఊపు ఊపేసిందట, ఎవరో రాశారు అన్నాడు ఓ మిత్రుడు… మళ్లీ తనే అన్నాడు… ‘ఐనా ఏముందిలే..? మొదట్లో తన మనమరాలిగా నటించిన శ్రీదేవితో ఎన్టీయార్ తరువాత కాలంలో జతకట్టలేదా..? స్టెప్పులు వేయలేదా..?’
నిజమే కదా… మన సినిమాల్లో పురుష్ వయస్సు అలాగే స్థిరంగా యవ్వనంలోనే ఉండిపోతుంది… ము- కిందికి 70 ఏళ్లు వచ్చినా, వీపుకు బద్దలు కట్టి మరీ స్టెప్పులు వేయిస్తారు కుర్ర హీరోయిన్లతో… కాలేజీలకు వెళ్తుంటాయి ఆ పాత్రలు… కానీ ఆడ లేడీస్ మాత్రం త్వరగా వయస్సుడిగి పోయి, తల్లి- అత్తల పాత్రల్లోకి వేగంగా వచ్చేస్తారు… అఫ్‌కోర్స్, మహేశ్ బాబు స్టిల్ యంగ్ ప్రిన్సే అనుకొండి ఫ్యాన్స్‌కు…
ఐనా పాత్రలదేముంది..? దర్శకరచయితలు ఎలా చెబితే అలా ఆయా వయస్సుల్లోనే తచ్చాడుతుంటయ్, వయస్సుకు తగిన డాన్సులు, రొమాన్స్ చేస్తుంటయ్… ఇంతకీ ఈ మహేశ్ బాబు, రమ్యకృష్ణ పాత ఐటమ్ సాంగ్ ఏమిటబ్బా అని వెతికితే… అప్పట్లో సూర్య దర్శకత్వంలో నాని అనే ఓ సినిమా వచ్చింది గుర్తుందా..? అదుగో, అందులో రమ్యకృష్ణ కూడా నటించింది… అఫ్‌కోర్స్ సినిమా పెద్దగా ఆడలేదు… అది వేరే విషయం…
Ads
అందులో రమ్యకృష్ణతో మహేశ్ బాబుకు ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది… మార్కేండయ అంటూ ఏదోలా ధ్వనిస్తూ పాట సాగుతుంది… తరువాత సినిమాలో ఆ పాటను తీసేశారని అంటారు మరి… యూట్యూబ్‌లో మాత్రం ఓ చిన్న చానెల్‌లో ఆ పాట ఉంది… ఇప్పుడు ఆ పాటను కాస్త ఆసక్తిగా చూస్తున్నారు గానీ, దానికి ఉన్న సబ్‌స్క్రైబర్లే 71 మంది… అంటే అర్థమైంది కదా, దాని రీచ్ ఎంతో… 78 వేల వ్యూస్ కనిపిస్తున్నాయి, కానీ అందులో సగం నిన్నివాళ వచ్చినవే ఐఉంటయ్…
సరే, ఓసారి పాట విందాం అని క్లిక్ చేస్తే, అదేదో భాషలో, అదేదో యాసలో వినిపిస్తూ… కాసేపు వాళ్లేం పాడుకుంటున్నారో కూడా అర్థం కాలేదు… కాకపోతే రమ్యకృష్ణ మార్క్ భంగిమలు, ఆమె పక్కన మహేశ్ బాబు రొమాంటిక్ ప్రయాస, స్టెప్పులు మాత్రం కనిపిస్తున్నాయి… తీరా చూస్తే ఆ పాటను ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్, నిత్యశ్రీ పాడినట్టు కనిపిస్తోంది డిస్క్రిప్షన్‌లో…
ఇప్పుడు అదే శివగామి రమ్యకృష్ణ మహేశ్ బాబు తల్లిగా కనిపిస్తోంది గుంటూరుకారం సినిమాలో… అదేదో యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తికిరీటాలు నవలను ఈ సినిమా కథగా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది కదా… అందులోని ప్రధాన పాత్ర రమ్యకృష్ణ పోషిస్తుందట… ఇంకొన్నాళ్లు పోతే మహేశ్ బాబు అప్పటికీ యంగ్ ప్రిన్సే… రమ్యకృష్ణ ఏ మామ్మ పాత్రో, బామ్మ పాత్రో చేస్తుంది…
ఐనా తెలుగు టాప్ మేల్ స్టార్లకు వయస్సేమిటండీ… వాళ్లు వయోతీతులు కదా… మన తెలుగులోనే 60, 70ల వెటరన్ హీరోలు ఈరోజుకూ కసిపాటల్ని చేయడం లేదా ఏం..?! ఐనా ఫాఫం, ఆమెను అనవసరంగా తెరపై తల్లిని చేసేశారు గానీ ఇప్పటికీ ఆమెకేం తక్కువ..?
https://www.youtube.com/watch?v=2ktY0HT-ImI&t=4s&ab_channel=telugubharatone
Share this Article