ఏపీలో చిత్తూరు, విజయవాడ, గుంటూరు ఎడిషన్లలో సాక్షి పాఠకులకు మూడు పత్రికల్ని ఇచ్చింది… అరె, కన్‌ఫ్యూజ్ కావద్దు సుమీ… మూడు సాక్షి పత్రికలు, సేమ్ కాదు, వేర్వేరు పత్రికల్ని ఇచ్చింది… మొత్తం ఎన్ని పేజీలో తెలుసా..? 42 పేజీలు… టైమ్స్ వంటి పత్రికలు కొన్ని సందర్భాల్లో అన్ని పేజీలను ఇచ్చాయి, పెద్ద విశేషం ఏముంది అంటారా..?
42 పేజీలను ఒకే బంచ్‌గా కాదు, మూడు పత్రికలుగా ఇచ్చింది… ఒకటి 16 పేజీలు, మరొకటి 14 పేజీలు, ఇంకొకటి 12 పేజీలు… ఇదేం అసాధారణం అనుకోకండి… మూడు ఫస్ట్ పేజీలు కావాలి… ఫస్ట్ పేజీ అంటే యాడ్స్ టారిఫ్ ఎక్కువ కదా… అలా వర్కవుట్ చేశారన్నమాట… అదీ జగన్ బర్త్‌డే సందర్భం… ఇంకేముంది..? కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ లీడర్స్, వైసీపీ లీడర్స్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు… ఎడాపెడా యాడ్స్ ఇచ్చి, జగన్ పట్ల తమ విధేయతను ప్రకటించాయన్నమాట…
Ads
ఈ ప్రయోగాన్ని కేసీయార్ బర్త్‌డేకు నమస్తే తెలంగాణ పత్రిక కూడా చేయలేకపోయింది… చంద్రబాబు బర్త్‌డేకు ఆంధ్రజ్యోతి కూడా చేయలేదు… అసలే జగన్ జన్మదినం… ఇంతకుమించిన సందర్భం ఏమొస్తుంది..? సాక్షి మార్కెటింగ్ విభాగం యాడ్స్ కుమ్మేసింది… ఆ యాడ్స్ అన్నీ అకామిడేట్ చేయడానికి 42 పేజీలు పబ్లిష్ చేయాల్సి వచ్చింది మరి… తప్పదు కదా…
యాడ్స్ మధ్యలో అక్కడక్కడా వార్తలు వేశారు… నిజానికి ఈ 42 పేజీల్లో 14 ఫుల్ పేజీ యాడ్సే… మిగతావి వార్తలు, యాడ్స్ సమతూకం అన్నమాట… డౌటేముంది..? ఈనాడులో ఒక్క యాడ్ కూడా కనిపించలేదు… జగన్ స్వయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి నా ప్రత్యర్థులు అని ప్రకటించాక, తన బర్త్‌డేకు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఈ శుభాకాంక్షల యాడ్స్ ఎలా వస్తాయి..?
చిత్తూరు ఎడిషన్ సరే, విజయవాడ, గుంటూరు ఎడిషన్లకూ సేమ్ మొత్తం యాడ్స్ దేనికి..? భలేవారే… బాస్ ఉండేది తాడేపల్లి… మరి ఆ ఎడిషన్లే కదా తన ఇంటికి వచ్చేది… ఎవరు యాడ్స్ ఇచ్చారో, ఎవరు విధేయత ప్రకటించారో తెలుసుకోకపోతే ఎలా..? ఆయన కళ్లలో ఆ యాడ్స్ పడేది ఎలా..? అందుకే ఆ ఎడిషన్లలో మూడు పత్రికలు… హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లలో వాటి వాసనే కనిపించదు… ఇక్కడ ఎవడు చూస్తేనేం..? చూడకపోతేనేం..? సారీ, వాటి టారిఫ్ నన్నడగొద్దు… మొహమాటం యాడ్స్, తగ్గింపు ఉండే చాన్సే లేదని నా అంచనా… సందర్భం వచ్చింది, సాక్షి కుమ్మేసింది… అంతే…!!
Share this Article