1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ…
…. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై కొన్ని వ్యాఖ్యలు చేసిన తమరు తీసుకున్న చర్యలేమిటి..? ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని చెబుతూ, గత ఎన్నికల ముందు లోపాయికారీ దోస్తీ చేసిందెవరు..? కాళేశ్వరం మీద కాంగ్రెస్ న్యాయవిచారణ చేయిస్తుంటే, సీబీఐకి ఇవ్వండి అని కోరుతున్నదెవరు..? ఒకసారి సీబీఐకి వెళ్తే జరిగిదేమిటో జనానికి తెలుసు కదా..? సో, ఈరోజుకూ కేసీయార్‌కు తెర వెనుక మద్దతుగా నిలుస్తున్నదెవరు..? 100 రోజుల్లోనే కాంగ్రెస్ ఢిల్లీకి సూట్‌కేసులు పంపించడం స్టార్టయిందా..? హేమిటో, మోడీ అప్పుడప్పుడూ ఏం మాట్లాడతాడో తనకే తెలియాలి…
2) పార్టీని పునర్నిర్మిస్తాం, పోయినవాళ్లందరూ చిల్లరతో సమానం, వెళ్తే వెళ్లనీ గాడిదతో పోతేనే గుర్రం విలువ తెలుస్తుంది… శ్రీమాన్ కేసీయార్ ఉవాచ…
Ads
…. నిజమే, కానీ ఇక్కడ గాడిద ఎవరు..? గుర్రం ఎవరు..? ఇప్పటిదాకా ఎవరు ఎవరితో ఉన్నారు, ఏం తెలిసింది..? పోయినవాళ్లంతా చిల్లర గాళ్లు అంటున్నావా దొరవారూ..? అంతేలే… మీ అయిదుగురు కుటుంబం తప్ప అందరూ మీకు చిల్లరే కదా… కానీ ఒక్కటి మాత్రం నిజం… ఉద్యమం పేరిట, తరువాత ఫక్తు రాజకీయ పార్టీ పేరిట దిక్కుమాలిన నాయకత్వాన్ని తెలంగాణ నెత్తిన రుద్దింది తమరే కదా… సిద్ధాంతాల్లేవ్, రాద్ధాంతాల్లేవ్, మళ్లీ కేసీయార్ పుంజుకుంటే ఇప్పుడు జంపిన ఈ కేరక్టర్లన్నీ మళ్లీ ఇటువైపు క్యూ కడతాయి… తెలంగాణలో భీకరమైన స్థాయిలో ఫిరాయింపుల కల్చర్‌ను తీసుకొచ్చిందే తమరు కదా… దానం మీద ఫిర్యాదులు ఏల..? ఎంతమందిని ప్రలోభాలతో లాగేసుకున్నారు..? మీ స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకున్నాడా..? అన్నీ తమరు నేర్పిన విద్యలే నీరజాక్షా..!!
3) ఎలక్టోరల్ బాండ్స్ మీద ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది… లాటరీ మాఫియా డాన్ మార్టిన్ దాదాపు ప్రతి పార్టీకి డబ్బులిచ్చాడు… ఏకంగా 1600 కోట్లు, అంతే తన సంపాదన స్థాయి ఎంతో అర్థం చేసుకోవాలి… తెలుగు రెడ్డి గారు కూడా ఎడాపెడా డీఎంకే, జేడీఎస్ పార్టీలకు కూడా డబ్బులిచ్చాడు… సెకండ్ హయ్యెస్ట్ పెయిడ్… మరి అలా చేయనిదే ఆ స్థాయికి చేరాడా..? అసలు బాండ్స్ పేరుతో కాకపోతే మరో రూపంలో తీసుకుంటారు..?
…. పార్టీలకు డబ్బు కావాలి, అవసరం వాళ్లది, అవకాశం కంపెనీలది… శుద్ధపూసల్లాగా చెప్పుకునే బీజేడీ కూడా డబ్బు తీసుకుంది, లేకపోతే పార్టీలు నడవవు… అందరూ చట్టప్రకారమే డబ్బు తీసుకున్నారు, డబ్బు ఇచ్చారు, ప్రస్తుత రచ్చతో ఒరిగేదేముంది..? బీఆర్ఎస్, టీఎంసీ, డీఎంకే తదితర ప్రాంతీయ పార్టీలూ వందల కోట్లు దండుకున్నయ్… సింపుల్, అధికారంలో ఉన్నవాడికి ఎక్కువ చందాలు వస్తయ్, బీజేపీకి కూడా అంతే… కాకపోతే ఈడీ, ఐటీ, సీబీఐ దాడులతో, సెటిల్ చేసుకో అనే ఓ పరోక్ష సంకేతం పంపించి మరీ దండుకోవడం బీజేపీ స్టయిల్… అంతే…
Share this Article