Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హోరెత్తిన ఇండియా..! మురిపెంగా T20 వరల్డ్ కప్ ముద్దాడిన ఈ క్షణం..!!

March 8, 2026 by M S R

.

ఇండియా యావత్తూ హోరెత్తిపోయింది… టీ20 వరల్డ్ కప్ కూడా స్వయంగా బిత్తరపోయేంత గెలుపు… ఇది మామూలు స్కోరా..? ఇదొక బాంబింగ్..!! టీ20 వరల్డ్ కప్ మూడోసారి ముద్దాడిన వేళ ఎందుకింతగా ఇండియా మురిసిపోయింది… ఎందుకంటే..? గత ట్రోఫీలు ఒకెత్తు… ఈ ట్రోఫీ గెలిచిన తీరు మరో ఎత్తు… ఏ క్రికెట్ జట్టుకూ అందనంత ఎత్తు.,.! గతంలో ఎరగనంత భారీ తేడాతో..!!

క్రికెట్ అంటే ఇండియా భావోద్వేగం… దానికి ప్రాంతం, మతం, కులం, జాతి భేదాల్లేవు… ఒక గెలుపు ఎప్పుడూ జాతిని ఉత్తేజితం చేస్తుంది కాబట్టి… ఈ మురిపెం, ఈ సంబరం, ఇండియా దీపావళి చేసుకుంటోంది…

Ads

నిజంగానే ఈ మ్యాచుకు ముందు కాస్త పాజిటివ్‌గానే ప్రిపేరయ్యారు కోట్ల మంది ఇండియన్ ఫ్యాన్స్… ఎలా అంటే..? 1) ఎస్, అభిషేక్ శర్మ ఎప్పుడూ ఫెయిల్ కావాలనేముంది..? ఈరోజు తనదేనేమో..? 2) శాంసన్ భీకర ఫామ్‌లో ఉండనే ఉన్నాడు… 3) తనదైన రోజు ఇషాన్ కిషన్‌ను ఆపేవాడు లేడు… 4) తిలక్ వర్మ, హార్దిక్ ఉండనే ఉన్నారు… 5) పిచ్ అనుకూలిస్తే చివరకు సూర్యకుమార్ కూడా ఫామ్‌లోకి వస్తాడు… 6) సిక్సులు కొట్టే దూబే సరేసరి..

అందుకే మొదట బ్యాటింగు చేయాల్సి వచ్చినా ఫ్యాన్స్‌లో ఏమాత్రం ఆశలు తగ్గలేదు… అసలే బ్యాటింగు పిచ్, అందులోనూ న్యూజిలాండ్‌లో ఫిన్ అలెన్ వంటి భీకర బ్యాటర్లు ఉన్నారు… కాబట్టి మొన్నటి సెమీస్ 250 ప్లస్ స్కోర్ మళ్లీ చేస్తే తప్ప న్యూజిలాండ్‌‌ను డిఫెన్సులో పడేయలేం… అచ్చంగా ఆ మూడ్ అందిపుచ్చుకున్న ఇండియా అరివీర భీకరంగా విరుచుకుపడింది…

ఎస్, తెలంగాణ భాషలో చెప్పాలంటే… హడ్డీ మార్ గుడ్డి దెబ్బ… అంటే బాల్ వస్తే బాదుడే… ఔట్ అవుతామా, నిలబడతామా వేరే సంగతి… అలా ఆడారు… నీకు చేతనైతే ఈ స్కోర్ సాధించి గెలుచుకో కప్పు అని భారీ సవాల్ న్యూజిలాండ్ ఎదుట ఉంచింది ఇండియా…



కాస్త క్రోనాలజీలో చెప్పుకుందాం… మొదటి పవర్ ప్లేలోనే 15 రన్‌రేటు… తరువాత అభిషేకుడు ఓ అమెరికన్ ఎఫ్-15 అమెరికన్ బాంబర్‌లా తన వంతు బాంబింగ్ పాత్ర పోషించి, నిష్క్రమించాక (వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ) ఇషాన్ మరీ బ్లూ స్పారోలాగా చెలరేగిపోయాడు, తోడుగా రఫెల్ జెట్‌లాగా శాంసన్ స్టడీగా బాంబులు వేస్తూనే ఉన్నాడు… 12 ఓవర్లలోనే 167… అసలిది క్రికెటేనా..? అన్నట్టుగా..! 15 ఓవర్లలోనే 200 దాటేశారు… దాదాపు 200 రన్ రేటుతో శాంసన్ 89 ఔటాఫ్ 46 బాల్స్… తృటిలో తప్పిన సెంచరీ…

15 ఓవర్లలోపే వరుసగా ముగ్గురు హాఫ్ సెంచరీలు… అదీ భీకరమైన రన్ రేటుతో… మరీ ఇషాన్ అయితే ఇలా వచ్చి అలా హాఫ్ సెంచరీ కొట్టేశాడు అలవోకగా… ఒకే ఒక ఝలక్… మన ఇండియనుడే రచిన్ రవీంద్ర వేసిన 16 వ ఓవర్… ఏకంగా మూడు వికెట్లు…

  • సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాల్‌కే అవుట్… సూర్య కుమార్ యాదవ్ కెరీర్ లో లాస్ట్ మ్యాచ్ ఆడేసాడు… శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ టీంలో ప్లేస్ కోసం వెయిటింగ్. ఏజ్ కూడా మైనస్ 34 ఇయర్స్…

సరే, ఈ ఆటకొద్దాం… 4 వికెట్లు పడ్డాయా..? పర్లేదు, శివమ్ దూబే ఉన్నాడు… తిలక్ వర్మ ఉన్నాడు… ఏమాటకామాట… ఫీల్డింగులో న్యూజిలాండ్ సూపర్… తరువాత ఏం జరిగింది..? ఒక దశలో 270, 280 దాటుతుంది అనుకున్నారు స్కోర్… ఎంతోకొంత కట్టడి చేయాలనుకున్నారు న్యూజిలాండర్లు… కానీ చివరి ఓవర్‌లో దూబె 24 రన్స్ చేశాడు… దీంతో 255 రన్స్ టార్గెట్… వావ్… అందుకే ఇండియా హోరెత్తిపోయింది అని వ్యాఖ్యానించింది మొదట్లోనే… ఈ వరల్డ్ కప్‌లోనే ఇండియా 250 దాటిన మ్యాచుల్లో ఇది మూడోది…

  • అమిత్ షా వచ్చాడు మ్యాచ్ చూడటానికి… లక్ష మంది ప్రేక్షకులు… ఓ సముద్రపు హోరు… ధోనీ, రోహిత్ శర్మ పట్టుకొచ్చారు ట్రోఫీని జైషాతో పాటు… మోడీ స్టేడియం కిటకిట…

ఈ భారీ స్కోర్ ఒకెత్తు… ఏమో, వరుణ్ చక్రవర్తి ఫామ్‌లోకిి రావద్దనేముంది..? బుమ్రా ఉండనే ఉన్నాడు… సమయానికి ఆదుకునే అర్షదీప్, హార్డిక్ ఉండనే ఉన్నారు… న్యూజిలాండ్ ఆటకట్టించడం ఎంతసేపు అనుకున్నారు ఫ్యాన్స్… గెలుపు తప్పదు, కానీ ఎంత తేడాతో…? అది కదా అసలు కథ…

పదే పదే వెక్కిరింపులకు దిగే ధూర్త పొరుగు పాకీ ప్లేయర్ల మొహాలు పగిలిపోయేలా ఇండియా ఏ రేంజ్ జవాబు చెబుతుందనేది కదా ప్రశ్న…



అసలే ఈ వరల్డ్ కప్ గ్రేట్ ఓపెనర్లు… అలెన్, సీఫర్డ్ ధాటిగానే ప్రారంభించారు… ఫస్ట్ వికెట్ అలెన్… స్టేడియం హోరెత్తిపోయింది… డేంజరస్ వికెట్… గాన్… తరువాత బుమ్రా బౌలింగ్… మరో డేంజరస్ వికెట్ రచిన్ రవీంద్ర ఔట్… ఇషాన్ గ్రేట్ క్యాచ్… ఇండియా గెలుపు ఖాయం అయిపోయింది… పవర్ ప్లేలోనే కీలక వికెట్లు పడితే, ఇక ఈ భారీ స్కోర్ ఛేదించడం కష్టం… ఇండియా విన్ ప్రాబబులిటీ 96 శాతం…



అయిదో ఓవర్… అక్సర్ పటేల్… ఫిలిప్స్ బోల్డ్… అయిపోయింది, ఇండియా గెలుపు డబుల్ గ్యారంటీ… పవర్ ప్లేలో ఇండియా 90 చేస్తే న్యూజిలాండ్ 52 మాత్రమే… బుమ్రా తొలి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు…

వరుణ్ చక్రవర్తి వచ్చాడు… ధారాళంగా రన్స్ ఇస్తూ బదనాం అవుతున్న టాప్ వన్ బౌలర్… అభిషేక్ శర్మలాగే ఫామ్‌లోకి వస్తాడా..? చూద్దాం… సీఫర్ట్ మాత్రమే ఇండియా గెలుపుకి ఓ చిన్న అడ్డంకి… దానికి తగ్గట్టు ఔదార్యపు వరుణ్ చక్రవర్తి… రన్స్ వస్తున్నాయి న్యూజిలాండ్‌కు…

ఈసారి పాండ్యా వంతు… నాలుగో వికెట్… 3 పరుగులకే చాప్‌మాన్ ఔట్… బోల్డ్… 70 పరుగులకే 4 వికెట్లు… తరువాత..? ప్రమాదకరమైన వికెట్ వరుణ్ చక్రవర్తికి దక్కింది… సూపర్ క్యాచ్ బై ఇషాన్ కిషన్, ఇది రెండో సూపర్ క్యాచ్ తనకు… వెరసి 72 పరుగులకు అయిదు వికెట్లు… ఇండియా విన్ ప్రాబబులిటీ 99.84 శాతం…

పాకీస్ ఆర్ వాచింగ్ విత్ టియర్స్… నిజమే కదా, ఎన్ని ఏడుపులు ఏడిచారు ఇండియా జట్టు మీద కొన్నాళ్లుగా… వాచ్, వాచ్, వాచ్…

టీ20(వాట్ ఏ ఫ్రేమ్…. ఇండియాకు వరల్డ్ కప్స్ అందించిన ముగ్గురు కెప్టెన్లు)…



అర్షదీప్ బౌలింగులో రెండు సిక్సర్లు, వెంటనే వరుణ్ బౌలింగులో మరో రెండు సిక్సర్లు… న్యూజిలాండ్ చివరి బాల్‌ వరకూ పోరాడే తత్వం… వదిలేయదు… కానీ ఒక్కో బాల్‌కు మూడు పరుగులు చేయాల్సిన స్థితి వచ్చేసింది, ఎంత బలమైన జట్టయినా ఛేదించడం అసాధ్యం…

ఇషాన్ కిషన్‌కు మూడో క్యాచ్… వెరసి దూకుడు మిషెల్ కూడా గాన్… 124 పరుగులకు ఆరు వికెట్లు… అక్సర్ పటేల్‌కు మూడు వికెట్లు, విశేషమే… థాంక్ గాడ్, ఈ మ్యాచులో పెద్దగా సూర్యకుమార్ కెప్టెన్సీ లోపాలు కనిపించలేదు… కాసేపు న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్‌నర్ పోరాడే ప్రయత్నం చేశాడు కానీ ప్చ్, ఫలితం లేదు, ఆల్రెడీ ఔట్ ఆఫ్ హోప్స్…

ఈ గెలుపు తరువాత ఇంజమామ్ వంటి కుళ్లుబోతు మాజీ పాక్ క్రికెటర్లు సహా ఏమంటారో ఊహించండి… ‘‘అమిత్ షా న్యూజిలాండ్ బ్యాటర్లను బెదిరించాడు, ఐపీఎల్‌కు రావాలని లేదా అని..’’

బుమ్రా స్ట్రయిక్స్ అగెయిన్… అలా వస్తాడు, ఇలా వికెట్ తీసేస్తాడు… గ్రేట్ బౌలర్… అసలు ఈ మ్యాచులో అందరూ రాణించారు, ఆల్ రౌండర్లుగా రాణించారు… బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్… బుమ్రాకు మరో వరుస వికెట్… వావ్, వావ్… మరో రెండు వికెట్ల దూరంలో గెలుపు… మూడు ఓవర్లు, మూడు వికెట్లు కేవలం 13 పరుగులు ఇచ్చిన బుమ్రా…



ఎప్పుడూ మొహం గంటు పెట్టుకుని గంభీరంగా ఉండే గౌతమ్ గంభీర్ కూడా ఆనందపు ఉద్వేగంతో కదిలిపోయాడు… వార్ వన్ సైడ్ కాదు, అసలు ఇది వార్‌లాగే లేదు… ఆపరేషన్ సిందూర్ తరహా దాడి…

బుమ్రా… బుమ్రా… మరో వికెట్… కెప్టెన్ బౌల్డ్… అయిపోయింది… పటాకులు కాల్చండి… 152 ఫర్ 9… బుమ్రా 15 పరుగులకు 4 వికెట్లు… తిరుగులేని బౌలర్… 19వ ఓవర్ అభిషేకుడు… లాస్ట్ వికెట్… దాదాపు 100 పరుగుల భారీ తేడాతో గెలుపు… మూడోసారి వరల్డ్ కప్ ఇండియా సొంతం… శుభం… ఎంజాయ్ ది విక్టరీ…!!

చివరగా…. వుమెన్ వరల్డ్ కప్, ఆసియా కప్, అండర్ 19 కప్, టీ20 వరల్డ్ కప్… కప్ ఏదయినా కథ ఒకటే… అదే ఇండియా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…
  • Annamalai Breaks Free of His Shackles… Trouble Ahead for Palaniswami
  • నందూస్ వరల్డ్..! ఈ యూ-ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!
  • బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…
  • రాత్రికిరాత్రి వైరల్ స్టార్… ఒక్క రాత్రికి నీ రేటెంత అనడిగేదాకా…
  • yudhvir ahlavath … హఠాత్తుగా సోషల్ మీడియాలో వైరల్… ఎందుకంటే…
  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions