Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

36 ఏళ్ల క్రితం… కృష్ణ తీసుకున్న డేరింగ్, రియల్ పాన్-ఇండియా రిస్క్…

April 25, 2022 by M S R

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ అంటున్నారు కదా… నిజంగా ఇవి పాన్ ఇండియా సినిమాలేనా..? అసలు పాన్ ఇండియా అంటే..? దేశవ్యాప్తంగా జనం భాషలు, ప్రాంతీయ అడ్డంకులన్నీ కూలగొట్టేసి, మూకుమ్మడిగా యాక్సెప్ట్ చేసి, అక్కున చేర్చుకునే సినిమాలు అనుకోవాలా..? అదే నిజమైతే ఇప్పుడొస్తున్నవి నిజంగా పాన్ ఇండియా సినిమాలేనా..? పెద్ద ప్రశ్న…

ఏదో ఒక భాషలో సినిమా చుట్టేసి, అంతా వాళ్ల తారాగణాన్నే నింపేసి… కేవలం మార్కెట్ కోసం, వేరే భాషల్లో డబ్బుల కోసం పలు భాషల్లోకి డబ్ చేసి, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను పట్టుకుని థియేటర్లలో రిలీజ్ చేస్తే దాన్ని పాన్ ఇండియా అనాలా..? నిజంగా దేశం మొత్తం యాక్సెప్ట్ చేస్తోందా..? అలా చేసే పక్షంలో మరక్కర్ ఎందుకు సముద్రంలో మునిగిపోయింది..? బీస్ట్ ఎందుకు నేలకూలింది..? రాధేశ్యామ్‌కు ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది…

వోకే… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప సక్సెస్‌లకు చాలాా కారణాలుండవచ్చుగాక… కానీ హిందీ ప్రేక్షకులు తప్పకుండా కొంతైనా నేటివ్ ఫ్లేవర్ కోరుకుంటారు… వాళ్ల సౌతిండియన్ వాసనలు పెద్దగా పడవు… అందుకే ఆ లోకల్ ప్లేవర్ కోసమే ఆర్ఆర్ఆర్‌లోకి ఆలియా వచ్చింది… కేజీఎఫ్‌లోకి రవీనా, సంజయ్ దత్ వచ్చి చేరారు… నిజానికి రియల్ పాన్ ఇండియా అంటే డబ్బింగ్ చేసి ప్రేక్షకుల మీదకు వదలడం కాదు… వాళ్ల తారలతోనే సినిమా తీసి మెప్పించడం…

Ads

pan india

ఓ సినిమా గురించి చెప్పాలి… అప్పుడెప్పుడో 1986లో… కృష్ణ ఓ సినిమా తీశాడు… పేరు సింహాసనం… తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా… భారీ ఖర్చు… ఒకేసారి తెలుగులో… తెలుగు షాట్ అయిపోగానే హిందీ షాట్… తెలుగులో కృష్ణ… అన్ని తెలుగు రీమేకుల్లోనూ అప్పట్లో జితేంద్రే హీరో… ఇందులోనూ తనే… ఈ సినిమా క్లిక్ కాకపోతే తాను దారుణంగా మునిగిపోతానని కృష్ణకు తెలుసు… ఐనాసరే, గట్స్ ఉన్న హీరో తను… తనదే కథ, తనదే స్క్రీన్‌ప్లే, తనే నిర్మాత, తనే దర్శకుడు, తనే హీరో… ఎడిటర్ కూడా…! 70 ఎంఎం మాత్రమే కాదు, సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్…

అసలు తొలి జేమ్స్‌బాండ్ సినిమా తనదే… స్కోప్‌లో అల్లూరి సీతారామరాజు ఓ సాహసం… హీరోయినే ఉండని ఈనాడు సినిమా ఓ ప్రయోగం… పొలిటికల్ సెటైర్లు… కౌబాయ్ సినిమాలు, గూఢచార సినిమాలు… ఇలా చాలా చాలా డేరింగ్ నిర్ణయాలు తనవి… సింహాసనం సినిమా కోసం జయప్రద, రాధ, అప్పటి సెన్సేషన్ మందాకిని… ఎటొచ్చీ ఎస్పీ బాలు ఉంటే ఇంకా బాగుండేది… మరీ హాకాసంలో ఒక తార వంటి అపశబ్దాలు వినే అగత్యం తప్పేది… ఇక డాన్సులు, ఎమోషన్స్ గట్రా కృష్ణ, జితేంద్ర సేమ్ టు సేమ్… తేరే లియే పాటలో కృష్ణ పూర్తిగా జితేంద్ర ను ఆవహించాడు… అన్నీ తన ఫ్లాగ్షిప్ ఇస్టెప్పులే… హిందీ వెర్షన్‌లో ప్రాణ్, వహీదా రెహమాన్, శక్తికపూర్, అంజాద్ ఖాన్ తదితరులున్నారు… రామ్‌తేరీ గంగా మెయిలీలో మందాకిని అందాలన్నీ జలపాతంలో తడిపి ఆరేశారు కదా… అలాగే ఇందులోనూ అలాంటిదే ఓ ఘాటు సీన్ పెట్టాలని ట్రై చేశారు కానీ నప్పలేదు…

హిందీలోనే ఒరిజినల్ డైలాగ్స్, హిందీ తారలు… హిందీ ప్రేక్షకులు తమ సినిమాగానే ఓన్ చేసుకున్నారు… ఇలా పారలల్ షూటింగ్ చేసే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఉన్నారా..? నెవ్వర్… వాయిస్ ఓవర్ చేయించి, వదిలితే చాలు కదా అనుకునే డబ్బింగ్ డబ్బా దర్శకులే అందరూ… సింహాసనం అప్పట్లోనే, అంటే 36 ఏళ్ల క్రితం… రెండు తరాల క్రితం… తొలి వారమే ఒకటిన్నర కోట్లు కలెక్ట్ చేసి తెలుగులో… ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే బాహుబలి, కేజీఎఫ్ కలెక్షన్లు దేనికీ పనికిరావు…! టికెట్ల కోసం కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లు అప్పట్లో… అదీ క్రేజ్ అంటే…

ఈ రెండు భాషల పారలల్ షూటింగ్, టైమ్ టేకింగ్ అయినా సరే… రెండు నెలల్లో కంప్లీట్ చేశాడు కృష్ణ… అదీ ప్లానింగ్… బప్పీలహరి ట్యూన్లకు భిన్నమైన సింగర్లతో గనుక పాడించి ఉంటే కథ వేరే ఉండేది… హిందీలో ఎంచక్కా సుశీల, కిషోర్ కుమార్… రెండు పాటలు కిషోర్, ఆశా భోంస్లే… ఒకటయితే బప్పీయే స్వయంగా… చరణాలు, పల్లవులు జంఝాటం దేనికిలే అనుకున్నాడేమో, కేవలం ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌తో కంపోజ్ చేయించిన స్వాగతం బిట్ డాల్బీ సౌండ్‌లో మోతెక్కి, చెవుల తుప్పు వదిలించింది… కొన్ని సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోతాయి… సింహాసనంలాగా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions