Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!

July 1, 2025 by M S R

.

వినేవాళ్లు వెర్రివెంగళప్పలు… మేం సత్యహరిశ్చంద్రులం… ఈ ధోరణి పొలిటికల్, సినిమా, మీడియా సెలబ్రిటీల మాటల్లో, ప్రకటనల్లో ప్రధానంగా కనిపిస్తుంది… అవి అర్ద (హాఫ్) బుర్రలు, అర్థ (మనీ) బుర్రలే గానీ అర్థ (మీనింగ్‌ఫుల్) బుర్రలు కావని పదే పదే నిరూపించుకుంటూ ఉంటారు…

మరి నేషనల్ క్రష్‌గా మారి… ఇండియన్ సినిమా సర్కిళ్లలోని పెద్దలు, పెద్ద తారలు సైతం కుళ్లుకుంటున్న సక్సెస్ సొంతం చేసుకున్న రష్మిక మంధానా కూడా నేను కూడా ఈ అర్ధ బుర్రల జాబితాలో ఎందుకు చేరకూడదు అనుకున్నట్టుంది…

Ads

ఉదారంగా ఓ ప్రకటన జారీ చేసింది… ‘‘నేను సిగరెట్ తాగను… (పొగ తాగను)… ఎంకరేజ్ చేయను, నాకు అసహ్యం… ఒకవేళ పొగ తాగడాన్ని ప్రమోట్ చేసే సీన్ చేయాల్సి వస్తే, పొగతాగే సీన్ ఉంటే అవసరమైతే ఆ సినిమాను వదులుకుంటాను తప్ప, ఆ సీన్ చేయను’’ అని చెప్పుకొచ్చింది…

నిజమే, నిజంగానే తను ఆ ధోరణికి కట్టుబడి ఉంటే గొప్పే… కానీ తను గతంలో అలాంటి సీన్లలో, ఫోటోల్లో కనిపించలేదా..? నెటిజనం ఆ ఫోటోల్ని వెతికి పట్టుకొచ్చి మరీ ట్రోల్ చేస్తున్నారు రష్మికను… మరి ఇదేమిటమ్మా, చెప్పొచ్చావులే అనే కామెంట్లు, పోస్టులు…

rashmika

అంతేకాదు, ఈ పొగతాగుడు ప్రకటనలోనే మరో మాట చెప్పుకొచ్చింది… యానిమల్ బోల్డ్ సీన్లపై మాట్లాడుతూ… ‘‘సినిమాను సినిమాగా చూడాలి, ప్రతి మనిషిలో మరో కోణం ఉంటుంది, సినిమా నచ్చడం, నచ్చకపోవడం ప్రేక్షకుల వ్యక్తిగత అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది…’’ అని చెప్పింది…

ఎస్, సినిమాను సినిమాగానే చూడాలి… ఒకవేళ సినిమాలో స్మోకింగ్ సీన్‌ను కథ డిమాండ్ చేస్తే తప్పనిసరిగా చేయాలి… స్మోకింగ్ చూపినంత మాత్రాన అదేమీ ప్రమోట్ చేయడం కాదు… దాన్ని ఎలా స్వీకరించాలో ప్రేక్షకుడి వ్యక్తిగత అభిరుచి…

యానిమల్ బాపతు బోల్డ్ సీన్ల మాటేమిటి..? అసభ్యతను, అశ్లీలాన్ని ప్రమోట్ చేయడం కాదా..? మనుషుల్లో వెర్రి పోకడలను గ్లోరిఫై చేయడం కాదా..? అంతేకాదు, ఇదే రష్మిక గతంలో పంది మాంసం, వైన్ తనకు ఇష్టమేనని చెప్పింది… తమ కులం కొడవ… ప్రధానంగా సైనిక సంస్కృతి ఉన్న విశిష్ట సామాజికవర్గం అది.., పందిమాంసం వాళ్ల ఆహార సంస్కృతిలో భాగమే…

ఎస్, తప్పులేదు కదా… నాకు వైన్ ఇష్టం అని చెప్పడం అంటే మద్యపానాన్ని ప్రోత్సహించడం అవుతుందా..? తన ఇష్టాన్ని, తన అభిరుచిని చెప్పడం, అంతే… స్మోకింగ్ కూడా అంతే… నిజంగా స్మోకింగ్ ప్రమాదకరం, మద్యపానం కూడా అంతే కదా… వోకే, సొసైటీ పట్ల ఆ కన్సర్న్ ఉంటే…

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో తనే ధూమ, మద్యపానాన్ని డిస్కరేజ్ చేసే వీడియోల్ని తనే నటించి, తన మాటల్లోనే పోస్ట్ చేస్తే చాలా  బెటర్ కదా రష్మికా… కొత్తగా స్నాప్‌చాట్‌లో కూడా చేరావు… ఈ పనిచేస్తే నిజంగానే ‘మంచి పని’ చేసినదానివి అవుతావు… ఉత్త శుష్క ప్రకటనలు కాదు..!! వాట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ... నువ్వయినా చెప్పాలి కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తన తొలి మూవీ ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత
  • కథ, నటుడు, పాట, సంగీతం… అన్నీ పర్‌ఫెక్ట్ అంచనా వేయగల దర్శకుడు…
  • నయనతారపై మరో పిటిషన్… మెడకు చుట్టుకున్న ఆ డాక్యుమెంటరీ…
  • భద్రాచలంపై చంద్రబాబు సర్కార్ వక్రదృష్టి… రేవంతే స్పందించాలి…
  • ఏమి సేతురా లింగా..! భారీ లాసుల్లోకి కన్నప్ప… నితిన్ తన తమ్ముడే…!!
  • ఏకకాలంలో కేంద్రంతో, ఏపీతో… మూడు పార్టీలతో రేవంత్ పోరాటం..!!
  • ఆ ఒక్క సీన్… సాగరసంగమం సినిమాను అమాంతం పైకి లేపింది…
  • ప్లీజ్… నెత్తురు అంటిన ఆనాటి నా టోపీ ఒకసారి ఇప్పించండి యువరానర్…
  • ఒక అనసూయ… సూసైడ్ బాంబర్‌ను తరిమేసింది… కానీ చివరకు..?!
  • గుడ్ పేరెంటింగ్… చిన్నప్పటి నుంచే పిల్లలకు కష్టమేమిటో చెప్పాలి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions