Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రియల్ నంబర్ వన్ ! సూర్యను చూసి తెలుగు హీరోలు నేర్చుకోవాలి !!

November 10, 2026 by M S R

.

( గోపు విజయకుమార్ రెడ్డి ) ….. సూర్య సినిమా ఆడకపోతే తమిళనాడుకంటే ముందే తెలుగునాట అభిమానులు కలవరపడతారు. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు అంతలా దగ్గరయ్యాడు. భాషతో సంబంధం లేకుండా ఒక హీరోను మన ఇంటి మనిషిలా గుండెల్లో పెట్టుకోవచ్చని నిరూపించిన నటుడు ఆయన. అందుకే ‘కంగువ’ దెబ్బకు సూర్య డీలా పడినప్పుడు ఆయన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికుడు కూడా బాధపడ్డాడు.

కానీ, దానం చేసిన చేతులు, దయ ఉన్న మనసు ఎప్పుడూ ఓడిపోవు అంటారు. అగరం ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద పిల్లల చదువుకు బాటలు వేసి, ఏకంగా దశాబ్దాలుగా ఉన్న సొంతింటినే దానం చేసిన ఆ ‘దాన కర్ణుడి’కి బాక్సాఫీస్ వద్ద విజయం మళ్లీ దాసోహమంది.

Ads

జ్ఞానవేల్ తప్పులు.. సూర్య బాధ్యత!
పదేళ్లకు పైగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో వచ్చిన ‘కంగువ’ 2000 కోట్లు కొడుతుందని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గొప్పలు చెప్పాడు. కట్ చేస్తే, 100 కోట్లు కూడా రాక డిజాస్టర్‌గా మిగిలింది. ఆ నష్టాన్ని సూర్య తన సొంత డబ్బుతో బయ్యర్లకు సెటిల్ చేశాడు. కార్తి ‘వా వాతియార్’ నిలిచిపోతే సాయం చేశాడు, మొన్నటికి మొన్న సమ్మర్‌లో ‘కరుప్పు’ రిలీజ్ ఆగిపోయే పరిస్థితి వస్తే క్రెడిట్ స్యూరిటీ ఇచ్చి మరీ సినిమా బయటకు తెచ్చాడు.

suriya

6 నెలలు.. 3 సినిమాలు.. 800 కోట్లకు పైగా విధ్వంసం!
ఈ దయాగుణమే కావచ్చు, 2026 సూర్యకు ఒక మైలురాయిలా మారింది. మొదట రిస్క్ చేసి విడుదల చేసిన ‘కరుప్పు’ 350 కోట్ల గ్రాస్‌తో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరో మూడు నెలలకే వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ 250 కోట్లు సాధించింది. ఇప్పుడు మలయాళ దర్శకుడు జిథు మాధవన్ తెరకెక్కించిన ‘సీన్’ 200 కోట్ల మార్కు వైపు దూసుకెళ్తోంది.

విశేషం ఏంటంటే.. ‘సీన్’ సినిమాను సూర్య, జ్యోతికల ప్రొడక్షన్ హౌస్‌లో తీశారు. అందులో అగరం ఫౌండేషన్ బాధ్యతలు చూసే మహిళను భాగస్వామిగా చేసి, వచ్చిన లాభాలను పిల్లల చదువులకే కేటాయించారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌తోనే కాస్ట్ రికవరీ చేసేయడంతో.. థియేట్రికల్ వసూళ్లన్నీ నిఖార్సయిన లాభాలుగా మారాయి.

షారూఖ్ రికార్డు సమం.. కానీ సూర్య రూటే వేరు!
ఒకే ఏడాది మూడు హిట్లు కొట్టిన రికార్డు 2023లో షారూఖ్ ఖాన్ (పఠాన్, జవాన్, డంకీ) పేరిట ఉంది. అయితే అందులో ‘డంకీ’ సాధించిన విజయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ సూర్య మాత్రం కేవలం 6 నెలల వ్యవధిలో 3 క్లీన్ అండ్ క్లియర్ బ్లాక్‌బస్టర్లు ఇచ్చి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

మన టాలీవుడ్ స్టార్లకు ఈ రియలైజేషన్ ఎప్పుడు?
పాన్ ఇండియా వ్యామోహంలో పడి, 3- 4 ఏళ్లకు ఒక సినిమా తీస్తూ, ఆ ఒక్క సినిమాలోనూ సరైన కంటెంట్ ఇవ్వలేక ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరుస్తున్న మన టాలీవుడ్ హీరోలు సూర్యను చూసి చాలా నేర్చుకోవాలి.

‘కంగువ’ లాంటి భారీ ప్రయోగం దెబ్బకొట్టగానే సూర్య వెంటనే రియలైజ్ అయ్యాడు. గ్రాఫిక్స్, అనవసరపు భారీతనం పక్కనబెట్టి.. కథలు, పాత్రల బలం ఉన్న సింపుల్ సినిమాలతో థియేటర్లలో వినోదం పండించాడు. ప్రమోషన్ల కోసం కాకుండా మనస్ఫూర్తిగా తెలుగు వారిని ప్రేమించే సూర్య సాధించిన ఈ సక్సెస్.. నిబద్ధతకు దక్కిన ప్రతిఫలం. మన హీరోలలో కూడా ఈ రియలైజేషన్ త్వరగా వస్తే చూడాలని సగటు సినిమా అభిమాని కోరుకుంటున్నాడు!



మలయాళం దర్శకుల గురించి… ఒక స్టార్ హీరోని పెట్టి కూడా ప్రొడక్షన్ బడ్జెట్ 23 కోట్లు దాటలేదు… సినిమా 90 కోట్లకు OTT నెట్ ఫ్లిక్స్ కొన్నది.. అంటే సినిమా రిలీజ్ కాకముందే ప్రాఫిట్… అదే మన తెలుగు హీరోలు పాన్ ఇండియా మోజులో పడి కనీసం other మార్కెట్స్ ప్రమోషన్స్ కి వెళ్లిన ఖర్చులు కూడా రాబట్టలేదు…

అలాంటిది ఒక పెద్ద హీరో 6 నెలల్లో మూడు సినిమాలు… దాదాపు 750 కోట్లు కలెక్షన్స్ అంటే సప్లై చైన్ (ప్రొడక్షన్, థియేటర్, OTT ) కి ఎంత ఫీడ్ ఇచ్చి ఉంటాడు సూర్య… నెక్స్ట్ సినిమా కూడా దాదాపు 60% షూటింగ్ అయిపోయిందట…

ఇంకా ఉంది… నెక్స్ట్ జై భీమ్ డైరెక్టర్ తో… తరువాత, DC సినిమా డైరెక్టర్ తో…, మళ్ళీ సీన్ 2 ప్రీక్వెల్…, తర్వాత మందాడి సినిమా డైరెక్టర్ తో… అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో లైనప్ ఉంది… విజయ్ సీఎం అయిపోయాక ఎవరు నెంబర్ వన్ అనే ప్రశ్న తలెత్తింది కదా… ఇప్పుడు జవాబు దొరికింది కదా…!!



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రియల్ నంబర్ వన్ ! సూర్యను చూసి తెలుగు హీరోలు నేర్చుకోవాలి !!
  • ఎవరో సరిగ్గానే చెప్పారు… హోమం చేసినా చేతులు కాలుతాయని!
  • రావణుడు ఎవరు..? వైకుంఠద్వారం దగ్గర అసలు కథ మొదలు..!!
  • ట్రంపు క్యాంపుపై డెమొక్రాట్ల దాడి మొదలు- ఒక అభిశంసన తీర్మానం!!
  • మూడో భార్యకూ పవన్ కల్యాణ్ విడాకులు- మొక్కవోని ‘ఆదర్శం’..!!
  • Nvidiaలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదా? అసలు కథ ఇదీ..!
  • సీతమ్మ పుట్టినిల్లు… నేపాల్ వాస్తు శిల్పం… తెరపై మరో ఆసక్తికర కోణం!
  • మన స్టారాధిస్టారులు – తెరపై భీకరమైన ‘నరుకాసురులు’…
  • రామాయణంలో పిడకల వేట & గుడ్డు మీద ఈకలు పీకడం!
  • నేలపై కూర్చున్నా చేతిలోనే కంచం! మారిన మన భోజన సంస్కృతి!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions