.
ప్చ్… ఆంధ్రప్రభలో ఈ వార్త కనిపించిన రోజు నుంచీ… రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చివరకు మహా న్యూస్ కూడా ఫాలో అవుతున్నాను… కానీ ఈ వార్త కనిపించడం లేదు, వినిపించడం లేదు… పోనీ, ఆంధ్రప్రభ ఎక్స్‌క్లూజివ్ అనుకున్నా… ఇంత ముఖ్యమైన వార్తను మిగతావాళ్లు అందుకోవాలి కదా… లేదు…
విషయం ఏమిటయ్యా అంటే… కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానికే తలమానికంలాగా 600 అడుగుల ఎత్తున్న ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందట… మంత్రి నారాయణ ఓ పది మంది కన్సల్టెంట్లతో కూడా సంప్రదింపులు జరిపాడట…
Ads
10 నమూనాలు ప్రిపేర్ చేశారట, ఇక చంద్రబాబు సంతకం చేయడమే తరువాయి అని చెప్పింది ఆ వార్త… మిగతా వార్తలేమో గానీ… తెలుగు సెంటిమెంట్ ఎన్టీయార్ విగ్రహం మీద అబద్ధాలో, అతిశయోక్తులో రాసే సాహసం చేయదు కదా ఫాఫం ఆంధ్రప్రభ…
అది చదవగానే… అయ్యో, మా జగన్‌కు ఈ రేంజ్ వైఎస్ విగ్రహం పెట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదబ్బా అనిపించిన మాట కూడా నిజం… 118 వరకూ పథకాలకు వైఎస్ పేరు పెట్టాడు తప్ప ఇదెందుకు స్ట్రయిక్ కాలేదు తనకు..? సాయిరెడ్డి దూరమయ్యాడు సరే, సజ్జల లేదా సుబ్బారెడ్డి అయినా చెప్పాలి కదా…
అమరావతి మీద కోపం ఉండి, పఢావు పడేశాడు సరే… తన ప్యాలెస్ కట్టుకున్న ఆ రుషికొండ గుట్ట మీదే ఇదీ పెట్టేస్తే అద్దిరిపోయేది కదా… అవునూ, నిజంగానే ఈ విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు వోకే అని ఉంటే, పెద్ద వార్తే అయ్యేది కదా…
చిన్న చిన్న విషయాలకే చంద్రబాబు మీడియా బొంబాట్ చేస్తూ ఉంటుంది కదా… మరి ఈ భారీ విగ్రహం వార్తను ఎందుకు పట్టించుకోలేదబ్బా…!!! పైగా ఇదేమైనా తక్కువా..? మోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) కన్నా మూడు అడుగులు ఎక్కువ… ఎక్కడా తగ్గేదేలే…
అవును, ఆ విగ్రహం ఎత్తు 597 అడుగులు మాత్రమే, అంటే ఎన్టీయార్ మూడడుగుల ఎక్కువ ఎత్తు… ఎందుకు ఈ ఆలోచన చేయకూడదు చంద్రబాబు..? ఆయన పేరును, ఆయన పార్టీని, ఆయన ఎన్నికల గుర్తుతోసహా ఆయన లెగసీని కూడా హస్తగతం చేసుకుని, ఇప్పటికీ ఆయన జపమే చేస్తున్నప్పుడు… ఈమాత్రం విగ్రహం ఏర్పాటు సమంజసమే కదా…
మరేమైందో ఏమో గానీ… మంత్రి నారాయణ కూడా ఎక్కడా మాట్లాడినట్టు, వివరాలు చెప్పినట్టు వార్త కనిపించలేదు మరి…ఏమండీ బాబు గారూ… ఐకానిక్ కేపిటల్, ఐకానిక్ బ్రిడ్జి, ఐకానిక్ భవనాలు సరే, మరి ఈ ఐకానిక్ విగ్రహం వద్దా…?
ఇంకా వేల ఎకరాలు పూలప్ చేస్తున్నారు… ఇదొక అంతులేని విస్తరణ… ఎంతవరకో కూడా ఇప్పుడప్పుడే తేలేట్టు లేదు… నడుమ దీపస్థంభంలా ‘అన్న గారిని’ ప్రతిష్టించడం మర్యాదే కదా…!! మంత్రి గారూ మీరు పరిశీలించిన 10 నమూనాలు కూడా రాముడి రూపంలోనే కదా… లేకపోతే తెలుగు జనం ఒప్పుకోరు మరి..!!
Share this Article