ఏదో టీవీలో మాట్లాడుతూ సినిమా నటి సమంత… తన విడాకులకు ఒకటీరెండు కారణాలను ప్రస్తావిస్తోంది… ఊ అంటావా ఊఊ అంటావా సినిమా పాట చేస్తానంటే వద్దన్నారనీ, ఇంట్లో కూర్చోమన్నారనీ ఆరోపిస్తోంది ఇప్పుడు… ఇదొక డిబేట్… పెళ్లికి ముందు చైతూ ఆమెను సినిమాలు మానేయాలని చెప్పాడా..? లేక నీ ఇష్టం అన్నాడా..? ఒకవేళ చేసినా సరే, అక్కినేని కుటుంబం అనే ఓ ట్యాగ్‌ను దృష్టిలో పెట్టుకుని, గౌరవప్రదమైన పాత్రలు మాత్రమే చేయాలని ఆ కుటుంబం ఆశపడిందా..?
సినిమా రంగంలో ఆడవాళ్లను ఎలా అంగడి సరుకుగా వాడేసుకుంటారో అందరికీ తెలుసు… సమంత మినహాయింపేమీ కాదు… కాకపోతే పెళ్లయ్యాక ఎంచుకునే పాత్రలు, వ్యవహారధోరణిలో మార్పుల్ని ఆ కుటుంబం ఆశించింది… అమలలాగా మారిపోవాలని ఆశిస్తే, సమంత దానికి తిరగబడింది… అఫ్కోర్స్, నాగార్జునకు ఈ కథలన్నీ తెలుసు, తనే పెద్ద గ్రంథసాంగుడు కదా… అమల అక్కినేని కుటుంబం కోరుకున్నట్టుగా మౌల్డయిపోయింది… అడ్జస్టయింది… స్థిరపడిపోయింది… సమంతకు అది చేతకాలేదు… అక్కడే దూరం పెరిగింది… మరీ ఓ వెగటు వ్యాంప్ పాట చేస్తాననేసరికి అక్కినేని వారి మగ ఇగో బాగా హర్టయిపోయింది…
సమంత కోరుకున్నట్టే క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లికి చైతూ రెడీ అన్నాడు… హిందూ వివాహ పద్ధతిలోనూ పెళ్లి చేసుకున్నాడు… కానీ ‘‘కుటుంబం’’లో ఆమె ఇమడలేదు… సమంత ఓ కంపు వ్యాంప్ ఐటమ్ సాంగ్ చేయడానికి అక్కినేని ఫ్యామిలీ అంగీకరించలేదు… అప్పటికే కోపంగా ఉన్న సమంత మరింత కసిగా ఆ పాట చేసి చూపించింది… కాకపోతే ఆమె ఆ సాంగ్‌కు నప్పలేదు… ఒక వ్యాంప్ పాత్రధారిణిలా మెప్పించలేదు… పాట, ట్యూన్‌కు తగిన స్టెప్పులు కావు అవి… అసలు సమంత ఆ వెకిలి పాట చేయడం సమంత ఫ్యాన్స్‌కు కూడా నచ్చలేదు… అప్పట్లో చైతూ, సమంత విడాకుల సందర్భంగా ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన ఓ ఆర్టికల్ గుర్తొచ్చింది… మరోసారి అది యథాతథంగా…
Ads
(రెండేళ్ల క్రితం నాటి స్టోరీ…)
చాలారోజుల క్రితమే చెప్పుకున్నాం కదా… సమంత, చైతూ విడిపోవడం ఖాయం అని… ఎప్పుడైతే ముచువల్ కాన్సెంట్ విడాకులు అడిగారో, ఓ దఫా కౌన్సిలింగ్ కూడా జరిగిందో… ఇక నాన్చడానికి ఏమీ లేదు, దాయడానికి కూడా ఏమీ లేదు… మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నది కూడా ఇదే… ఈ ప్రేమకథ ముగిసిపోయినట్టే, ఇక శృతి కుదిరే సూచనల్లేవు, ఆల్రెడీ ఆమె వేరే ఉంటోంది… బాలీవుడ్‌కు వెళ్లిపోతోంది అని…! ఇప్పుడు చైతూ క్లారిటీ ఇచ్చాడు… తమ దారులు ఇకపై వేర్వేరు అన్నాడు… తమ బ్రేకప్ గురించి హుందాగానే వ్యక్తీకరించాడు…
ఆమెకు ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా..? ముచువల్ కాన్సెంట్ డైవోర్స్ అన్నప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఉంటుందా..? ఇక అవన్నీ బయటికి రాకపోవచ్చు… సగటు ప్రేక్షకుడికి రాను రాను ఇక ఈ అంశంపై ఆసక్తి కూడా ఉండకపోవచ్చు… అంతా తేలిపోయాక ఇక ఇంట్రస్టు ఏముంటుంది..? సెలబ్రిటీలు కాబట్టి, ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న స్టార్స్ కాబట్టి ఈమాత్రం ఆసక్తి… నాలుగు రోజులు పోతే మరుగునపడిపోతుంది… అయితే… సమంత ఎందుకు ఇమడలేకపోయింది..? ఆ కుటుంబంలో ఎందుకు ఉండలేకపోయింది..?
(ఇది చైతూ ట్వీట్… సేమ్ ఇదే కంటెంట్… సామ్ అనే పదం దగ్గర చై అని రాసి సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది…)
ఫిలిమ్ సర్కిళ్లలో చెప్పుకునేది ఏమిటంటే..? నాగచైతన్య నిజంగానే ఓ సిన్సియర్ లవర్… అందుకే నాగార్జున వద్దన్నా వినలేదు, సమంత కావల్సిందే అన్నాడు… నాగార్జున ఒప్పుకోక తప్పలేదు, సమంతను కోడలిగా అంగీకరించక తప్పలేదు… కానీ బంధం బలపడలేదు… ఎందుకు..? అక్కినేని అనే ఇంటిపేరే ఆమెకు ఓ బందిఖానా అయిపోయింది… అమలలాగే ఆమె కూడా ఓ జీవకారుణ్యసంస్థో పెట్టేసుకుని, పక్కా ఇంటిమనిషిగా మారిపోతే సమంత కూడా అక్కినేని కుటుంబసభ్యురాలిగా ఉండగలిగేది…
కానీ ఆమెలోని నటి ఆమెనలా ఉండనివ్వలేదు… ముందే చైతూతో చెప్పింది, తన నటజీవితాన్ని కొనసాగిస్తానని…! కానీ అది ఆచరణకొచ్చేసరికి ఇబ్బందిగా మారింది… ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయడానికి లేదు… ఎక్స్పోజింగ్ గట్రా కుదరవు… వేరే హీరోలతో చెట్టపట్టాలు, రొమాన్స్ (తెర మీదే) అస్సలు కుదరవు… ప్రతి దానికీ అక్కినేని కుటుంబసభ్యురాలు అనే లెక్కలు అడ్డం వస్తుంటాయి… హీరోయిన్ ఓరియెంట్ పాత్రలు మూడునాలుగు చేసింది… ప్చ్, ఆమెలోని నటికి తృప్తి లేదు, ఆహా ఓటీటీలో ఏదో ఓ పిచ్చి చాట్ ప్రోగ్రాం చేసింది కొన్నాళ్లు… నో… ఆమెలో నటి మొరాయించసాగింది…
దీనికితోడు ఆమె చుట్టూ ఓ పిచ్చి సర్కిల్ ఏర్పడింది… ఆమె పర్సనల్ స్టాఫ్ నుంచి మొదలుకొని ఆమె ఫ్రెండ్స్… ఆ ప్రేమ కుటుంబాన్ని కుదురుకోనివ్వలేదు… ఆమెలో భ్రమలు, కొత్త కొత్త బంధాలు మళ్లీ రెక్కలు కట్టుకొమ్మన్నాయి… అంతే, తెగదెంపులు… ఎక్స్పోజింగ్ పిక్స్, ఓ పర్సనల్ స్టాఫ్ ఒడిలో తలపెట్టుకుని పడుకున్న పిక్స్ వంటివి అక్కినేని కుటుంబానికి ‘‘పరువు సమస్య’’గా మారాయి క్రమేపీ…
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సక్సెస్ ఆమెను ఇంకా పునరాలోచనలో పడేసింది… ఆ సీరీస్‌లో సమంత నటించిన కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ డిలిట్ చేయించడానికి నాగార్జున ఫ్యామిలీ చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చిందట… అప్పటికే ఆమె ఓ స్థిర నిర్ణయానికి వచ్చింది… విడిగా ఉండటం స్టార్ట్ చేసింది, అంటే, ఇక నాకూ నీకూ పడదు అని చైతూతో చెప్పేసినట్టే… ఇప్పుడిక ఆమె స్వేచ్ఛాజీవి… ఆమె కెరీర్ ఆమె ఇష్టం… ఏ ‘‘పెద్దింటి పేరు’’ ఆమెను కట్టిపడేయలేదు… ఏ ట్యాగూ ఆమెను బంధించి ఉంచలేదు… ఈ స్వేచ్ఛను ఆమె సరిగ్గా వినియోగించుకుంటుందా..? లేక… ఎప్పుడో ఏదో ఓ దశలో… చైతూతో బంధాన్ని కాలదన్నుకుని తప్పు చేశాననే భావనకు లోనవుతుందా..? ఏమో… కాలం చెప్పాలి…!!
Share this Article