గుర్తుందా మీకు..? ఈమధ్య మనం ఓ స్టోరీ చెప్పుకున్నాం… మహేశ్‌బాబును తప్పుపట్టాం… సాయిపల్లవి వంటి వర్థమాన నటి కూడా సమాజానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనల్లో నటించడానికి అంగీకరించక, ఆ డబ్బును ఎడమకాలితో తోసేస్తుంటే… మహేశ్‌బాబు కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా యాడ్స్‌లో నటించడం ఏమిటనేది మన ప్రశ్న..! ఇప్పుడు మళ్లీ ఓసారి చెప్పుకోవాల్సి వస్తోంది… ‘‘మేం కాకపోతే మరో స్టార్ నటిస్తారు, ఆ ఉత్పత్తుల లాభనష్టాలతో మాకేం పని..? డబ్బు తీసుకుంటాం, నటిస్తాం’ అని వాదిస్తే అది సమర్థన అవుతుందా..? తమను ఇంతవాళ్లను చేసిన సొసైటీ పట్ల కనీస బాధ్యత ఫీలవ్వాల్సిన పనిలేదా..? సొసైటీకి ఎంతమేరకు తిరిగి ఇస్తున్నాం అనేది పక్కన పెడితే, నష్టం చేయొద్దు కదా… తమ పాపులారిటీని సమాజహితం కాని ఉత్పత్తులకు అమ్ముకోవాలా..? గతంలో చదవనివాళ్ల కోసం ఇదీ లింక్…
ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే..? అమితాబ్..! తప్పు అని తెలిసినప్పుడు, తప్పే అని అంగీకరించి, అవసరమైతే దిద్దుకుంటాడు… అవసరమైతే సారీ చెబుతాడు సొసైటీకి..! ఇండియాలో ఫరెవర్ వన్ ఓన్లీ సూపర్ స్టార్ అమితాబ్ సంస్కారం అది… ప్రస్తుతం తను ఓ పాన్ మసాలా యాడ్ నుంచి తప్పుకున్నాడు… అది కమల్ పసంద్ అనే పాన్ ఉత్పత్తికి సంబంధించి యాడ్… ఇప్పుడు దాన్నుంచి తప్పుకుని, ఆ యాడ్ కంట్రాక్టు రద్దు చేసుకుని, తన రెమ్యునరేషన్ కూడా వాపస్ ఇచ్చేశాడు… సూపర్… తమకు ఇవి సరోగేట్ యాడ్స్ అని తెలియదని, తెలిశాక తప్పుకోవడమే కరెక్టు అని బిగ్‌బి భావించాడని ఆయన టీం చెబుతోంది… అసలు ఏమిటీ సరోగేట్ యాడ్స్..?
Ads
ప్రభుత్వం సిగరెట్లు, మద్యం, గుట్కా తదితర యాడ్స్‌ను నిషేధించింది… ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగులు, పత్రిక ప్రకటనలు, టీవీ యాడ్స్… అసలు ఏరకమైన ప్రచారమైనా సరే నిషిద్దం… అవి ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులు కాబట్టి, వాటిని ఎవరూ ప్రమోట్ చేయొద్దు అనేది ఆ నిర్ణయంలోని ఆంతర్యం… ఆయా కంపెనీలు ఏం చేస్తాయంటే, డొంకతిరుగుడు పద్ధతిలో బ్రాండ్ ప్రమోషన్ చేపడతాయి… ఉదాహరణకు కింగ్‌ఫిషర్ బీర్‌ను నేరుగా ప్రమోట్ చేయరు, కింగ్‌ఫిషర్ పేరుతో ఓ సోడా లేదా మంచినీళ్ల సీసాను ప్రమోట్ చేస్తారు… అలాగే పాన్ గుట్కాల ప్రమోషన్ కూడా… నేరుగా గుట్కాను ప్రమోట్ చేయరు, పాన్ మసాలా పేరిట యాడ్స్ ఇస్తారు… ఇలాచీ, వక్కపొడి అంటూ ప్రకటనలు ఇచ్చి, బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటారు… అసలు ఉద్దేశం గుట్కా ప్రచారమే… అమితాబ్ మాత్రమే కాదు, చాలామంది ఈ పాన్ మసాలా యాడ్స్ చేశారు… ఆమధ్య ఓ అభిమాని ఈ చిల్లర పెంట సొమ్ము అవసరమా అని అడిగితే ఇదే అమితాబ్ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు, తరువాత తప్పు ఏమిటో తెలిసినట్టుంది… అందుకే ఆ కంట్రాక్టు నుంచి బయటికి వచ్చేశాడు… తప్పు దిద్దుకున్నాడు… అంటే ఒకరకంగా లెంపలేసుకున్నాడు… మరి మహేశ్‌బాబు ఏం చేస్తాడో… తను పాన్ బహర్ యాడ్స్‌లో చేస్తున్నాడు… పేరుకు అది మౌత్ ఫ్రెషనర్, ఇలాచీ యూనివర్స్ పేరిట ప్రచారం… అంతటి అమితాబుడే సొసైటీ కోణంలో అలాంటి పెంట డబ్బు తనకొద్దని నిర్ణయం తీసుకున్నాడు..? Why don’t mahesh babu..?!
Share this Article