మన హైదరాబాదీయే… ఏదైనా ఘనత సాధించినప్పుడు కనిపించాలి కదా…! మెయిన్ స్ట్రీమ్‌లో ఓ చిన్న వార్తో రావాలి కదా… తుచ్ఛమైన రాజకీయ నాయకుల బూతులకు, ఒకడి మీద ఒకడు చేసుకునే దాడులకు ఇచ్చే ప్రయారిటీ మిగతావాటికి ఎందుకు దక్కదు..? మన ఖర్మ అంటారా..? సరే..! సునీల్ చెత్రి… ఇదీ తన పేరు… సికింద్రాబాదులో పుట్టాడు… ఫుట్ బాల్ ప్లేయర్… ప్రస్తుతం తన ప్లేసు ఏమిటో తెలుసా..? అంతర్జాతీయ గోల్స్ సాధించిన క్రీడాకారుల జాబితాలో సెకండ్ జాయింట్ నేమ్… అంటే లియోనెల్ మెస్సీతో కలిసి జాయింట్ ప్లేస్… తనకన్నా ముందున్నది, ఫస్ట్ ప్లేసులో క్రిస్టియానో రొనాల్డో మాత్రమే… (ఆట మొత్తమ్మీద ఫిఫ్త్ హయ్యెస్ట్ గోల్స్)… 2001 నుంచి వివిధ క్లబ్బులకు, దేశానికి ఆడుతూనే ఉన్నాడు… ప్రస్తుతం తన వయస్సు 37 ఏళ్లు… తాజాగా SAFF ఛాంపియన్ షిప్ సాధించింది ఇండియా… అందులో 80వ గోల్ సాధించిన చెత్రి ప్రపంచంలోనే రెండో స్థానానికి ఎగబాకాడు…
మన మీడియాకు, మన ప్రజలకు, మన ప్రభుత్వాలకు ఎంతసేపూ క్రికెట్… క్రికెట్… క్రికెట్… కాస్తోకూస్తో అప్పుడప్పుడూ టెన్నిస్… అంతే… ఈమధ్య కాస్త హాకీ… ఇంకే ఆటా పట్టదు… అందుకే సునీల్ చెత్రి సాధించిన ఘనత మనవాళ్లకు ఆనలేదు… కనీసం తెలంగాణ మీడియాకు పట్టాలి కదా అంటారా..? అదీ ఉండదు… సింధులు, సైనాలు, సానియాలు తప్ప ఈ చెత్రిలు, మిథాలీ రాజ్‌లు ఎందుకు కనిపిస్తారు..? మొన్నటి ఆటలో తన 80వ గోల్ సాధించడం ద్వారా చెత్రి జాంబియాకు చెందిన గాడ్ఫ్రే చిటాలు సాధించిన 79 గోల్స్ అధిగమించేశాడు… ప్రస్తుతం యాక్టివ్ క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో తరువాత ప్లేసు, అనగా రెండో ప్లేసులో ఉన్నది లియోనెల్ మెస్సీ, చెత్రి… ఈ SAFF (South Asia FootBall Federation) చాంపియన్ షిప్ కోసం ఆడటం ఇదే చివరిసారి అంటున్నాడు చెత్రి… 2023లో AFC (Asian FootBall Confederation) తన లక్ష్యం అని కూడా చెబుతున్నాడు…
Ads
Corps of Electronics and Mechanical Engineers ఆఫీసరుగా పనిచేసే కేబీ చెత్రి మన హీరో సునీల్ చెత్రి తండ్రి… తను కూడా ఓ ఫుట్‌బాల్ ప్లేయర్… ఇండియన్ ఆర్మీ టీం సభ్యుడు ఆయన… తల్లి పేరు సుశీల చెత్రి… ఆమె నేపాల్ నేషనల్ టీం కోసం ఆడేది… చెత్రికి ఇద్దరు కవల చెల్లెళ్లు కూడా నేపాల్ వుమెన్స్ నేషనల్ టీం తరఫున ఆడేవాళ్లు… చెత్రి పెళ్లి చేసుకున్నది తన గరల్ ఫ్రెండ్ సోనమ్ భట్టాచార్య… ఆమె ఎవరంటే..? ఇండియా జాతీయ టీం సభ్యుడు సుబ్రత భట్టాచార్య బిడ్డ… మొత్తం కుటుంబం అంతా ఫుట్‌బాల్ నేపథ్యమే… ఆ ఇల్లే ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్… భేష్ సునీల్ చెత్రి… భేష్ అవర్ హైదరాబాదీ… జయహో…!! We are proud to write about you…!!
Share this Article