Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీట్‌లు, ఐఐటీ ర్యాంకులు రాకపోతే పిల్లలు చచ్చిపోవాలా..?!

April 12, 2025 by M S R

.

Murali Buddha …. పిల్లలను చంపకండి  … మావాడు చదువులో టాప్ … ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నాడు … అమెరికా వెళుతున్నాడు … మా వాడు టాప్ …

—-
కష్టం వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రేరేపించే మాటలు … ఎవడి పిల్లలు వాడికి ముద్దు, టాప్ అయితే ఏంటీ ?

Ads

మొన్న వరంగల్ నిట్ విద్యార్ధి ఆత్మహత్య – ఇది మొదటిది కాదు చివరిది కాదు … ఆమధ్య ఇంగ్లీష్ లో phd చేసినా ఉద్యోగం దొరకలేదని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు …

కరోనాలో ఉద్యోగం పోయింది అని ఓ అమ్మాయి ఆత్మహత్య… ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు .. ఇద్దరు టీచర్లు ఉద్యోగం పోయిన కూతురుకు తిండి పెట్టలేరా ? తిండికి లేక కాదు … మా అమ్మాయి టాపర్ అంటూ ఆమె మీద పెట్టిన ఒత్తిడి ఉద్యోగం పోయాక ఆత్మహత్య చేసుకునేట్టు చేసింది …

వికాస్ దివ్యకృతి అని హిందీ బెల్ట్ లో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి బాగా తెలిసిన పేరు … కొన్ని వందల మంది ఐఏఎస్ లను తయారు చేశారు …

అతను తన కుమారుడి గురించి చెబుతూ ప్రతి సంవత్సరం ఒక క్లాస్ మారితే చాలు, అంతకు మించి నీ మీద ఒత్తిడి తీసుకురాను అని చెప్పారు … ఆ మధ్య హిందీలో సూపర్ హిట్ అయిన 12 th ఫెయిల్ ips సినిమా కథ ఇతని విద్యార్థిదే …

వికాస్ దివ్యకృతి గుజరాత్ లో ఓ సమావేశంలో ఉపన్యసిస్తే గుజరాతీలు ఉద్యోగం గురించి ఏం చెబుతారు … దన్ధో ( వ్యాపారం ) కే బారేమే బాత్ కరియే అన్నారట .. మన వద్దనేమో వ్యాపారం అంటే నేరం అన్నట్టు ఆలోచన …

నిట్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నా , అమెరికాలో ఉద్యోగం పోయింది అని ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నా తల్లిదండ్రులు, బంధువుల ఒత్తిడి కారణం …

కోటాలో హాస్టళ్లలో ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్యలు… తెలుగు రాష్ట్రాల్లోనూ కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు… ఎందుకు..? ఎన్ఐటీలు, ఐఐటీ జేఈఈల ర్యాంకులు రాకపోతే చచ్చిపోవాలా..? ఇప్పుడు ఒకరూ లేదా ఇద్దరే కదా పిల్లలు… బతకలేకపోతారా..? ఏ పని చేసుకున్నా సరే… బంధుగణం మెచ్చుకోళ్ల కోసమే బతకాలా..?

మా వాడు టాప్ అంటూ వారి మీద ఒత్తిడి పెంచకండి … Phd చేసి ఆత్మహత్య చేసుకున్న వారిని చూశా – నాలుగవ తరగతి చదివి నెలకు 10 లక్షల సంపాదన ఉన్నవారిని చూశా …. పిల్లల గురించి నలుగురికి గొప్పగా చెబుతూ మీరు మురిసి పోతుండవచ్చు, కానీ అది పిల్లల మీద ఒత్తిడి పెంచుతుంది … జాగ్రత్త…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions