………… By…. పార్ధసారధి పోట్లూరి…………. HAMMER- హామ్మెర్! HAMMER అంటే Highly Agile Modular Munition Extended Range or HAMMER. చాలామంది అపోహ పడుతున్నట్లు హామర్ అనేది మిసైల్ కాదు.ఎయిర్ to గ్రౌండ్ బాంబ్. జెట్ యుద్ధవిమానం నుండి భూమి మీద ఉండే హై వాల్యూ టార్గెట్ ని ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడెందుకు ఈ చర్చ ? 36 రాఫెల్ జెట్ల డీల్ లో భాగంగా వెపన్ పాకేజీ కూడా ఉంది.వెపన్ పాకేజీ లో హామ్మెర్ బాంబులు కూడా ఉన్నాయి.యూరోపియన్ కన్సార్టియం MBD వీటిని తయారుచేస్తుంది. ఇటీవలే ఇవి భారత్ కి చేరుకున్నాయి.
ఇంతకి వీటి ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం!
హామ్మెర్ తో మూడు రకాల గైడెన్స్ కిట్లు వస్తాయి. A.ఇనర్షియల్ గైడెన్స్ (గ్రావిటీ మీద ఆధారపడుతుంది కానీ గైడెన్స్ వల్ల ఖచ్చితంగా టార్గెట్‌ని కొడుతుంది. B.GPS గైడెన్స్, అఫ్కోర్స్ మన స్వంత GPS నావిక్ ని ఉపయోగించుకునేలా మార్పులు చేసింది MBD. C.లేజర్ గైడెన్స్.బాంబ్ లో ఉండే కంప్యూటర్ కి రాఫెల్ పైలెట్ టార్గెట్ ఎక్కడ ఉందో లేజర్ ద్వారా చూపించి వదులుతాడు ఆ టార్గెట్ ని ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ ద్వారా తన మెమరీలో స్టోర్ చేసుకొని టార్గెట్ మిస్ అవకుండా కొట్టేస్తుంది. ఇది 90 కిలోమీటర్ల వేగం తో ప్రయాణించే భూమిమీద వెళ్ళే ఏ టార్గెట్ ని అయిన కొట్టేస్తుంది. శత్రు టార్గెట్ జామ్ చేయాలని చూసినా ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ తో కొట్టేస్తుంది కాబట్టి ఒకసారి టార్గెట్ చూపించి వదిలితే తిరుగు ఉండదు. జస్ట్ ఫైర్ అండ్ ఫర్గెట్.
Ads
హామ్మెర్ కి ఉన్న మరో అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకే సమయంలో ఇనర్షియల్ గైడెన్స్, gps గైడెన్స్, మరియు లేజర్ గైడెన్స్ లని ఉపయోగిస్తూ దాడిచేయగలదు.
హామ్మెర్ కి ఉన్న థ్రస్టర్స్ ని వాడుకుంటూ ప్రొపెల్ అవుతూ 70 కిలోమీటర్లు ప్రయాణించ గలదు. 44,000 వేల అడుగుల ఎత్తు నుండి జారవిడిచినపుడు టార్గెట్లని పిన్ పాయింట్ యాక్యురేసి తో కొట్టింది.
బిన్ లాడెన్ మీద ‘ప్రయోగం’
రాఫెల్ తో 90 డిగ్రీల కోణంలో ఎగురుతూ ఉన్నప్పుడు (అంటే నిట్ట నిలువుగా గాల్లోకి ఎగురుతూ ఉన్నప్పుడు హామ్మెర్ ని ప్రయోగించినపుడు 70 km దూరంలో ఉన్న టార్గెట్ అదీ లోయలో చిన్న బండ రాయి చాటుగా ఉన్న టార్గెట్ ని కొట్టింది. ఇది బిన్ లాడెన్ కోసం ఆఫ్ఘనిస్తాన్ లో వెతుకుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా gps లొకేషన్ ఇస్తే రాఫెల్ 44000 వేల అడుగుల ఎత్తు నుండి ప్రయోగించారు ఫ్రెంచ్ పైలట్లు. లాడెన్ పాకిస్థాన్ వైపు వెళుతూ దారి మధ్యలో విశ్రాంతి కోసం ఆ లొకేషన్ లో ఉన్నాడని హామ్మెర్ ని ప్రయోగించారు. హామ్మెర్ గురి తప్పలేదు కానీ అప్పటికే కొద్దీ నిముషాల ముందే అక్కడనుండి వెళ్ళిపోయాడు లాడెన్. తరువాత సంకీర్ణ దళాల అధికారులు హామ్మెర్ బాంబు పడ్డ ప్రదేశం తాము హామ్మెర్ కి ఇచ్చిన gps కో ఆర్డినెట్స్ తో సరి పోల్చగా ఒక్క అడుగు కూడా గురి తప్పలేదు. రాఫెల్ తో హామ్మెర్ ని ప్రయోగిస్తే ఫలితం ఎలా ఉంటుందో మొదటిసారిగా ప్రపంచ దేశాల సైన్యానికి తెలిసొచ్చింది.
లిబియా మీద దాడి
2011 లో నాటో దళాలు లిబియా మీద దాడి చేసినపుడు కూడా హామ్మెర్ ని విజయవంతంగా ప్రయోగించారు ఫ్రెంచ్ పైలట్లు. లిబియా మీద దాడి చేసినప్పుడు ఫ్రెంచ్ రాఫెల్స్ మొదట దాడి చేస్తూ పోతే వెనక అమెరికన్, ఇతర నాటో దేశాల జెట్ల దాడి చేశాయి. రాఫెల్ ఎలెక్ట్రానిక్ జామర్లు లిబియా ఎయిర్ డిఫెన్స్ ని జామ్ చేస్తే మరో రాఫెల్ టీమ్ రాడార్లు,కమాండ్ కంట్రోల్ సెంటర్స్ మీద హామ్మెర్ ని ప్రయోగించి ధ్వంసం చేశాయి. రాఫెల్స్ వాటి వెపన్ పాకేజీ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తాయో ఆఫ్ఘనిస్తాన్, లిబియా దేశాలలో చేసిన దాడుల వల్ల తెలిసింది.
44,000 వేల అడుగుల ఎత్తు నుండి ప్రయోగించినపుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అదే సమయంలో తక్కువ ఎత్తునుండి ప్రయోగిచినపుడు కూడా అదే ఫలితాన్ని ఇవ్వగలదు హామ్మెర్. ఇలా తక్కువ ఎత్తునుండి ప్రయోగిస్తే మరే ఇతర లేజర్ గైడెడ్ బాంబులు టార్గెట్ ని కొట్టలేవు.అది రాఫెల్ నుండి హామ్మెర్ ని ప్రయోగిస్తేనే సాధ్యం.
ఉగ్రవాద కేంద్రాలపై పాశుపతం
ఇదే హామ్మెర్ బంకర్ బస్టర్ గా కూడా పనిచేస్తుంది. 3 అడుగుల మందం కలిగిన రీ ఇన్ఫోర్స్డ్ స్లాబ్ ని తొలుచుకుంటూ లోపలికి వెళ్లి అక్కడ పేలుతుంది. ఎంత ప్రిసైజ్ గా పేలుతుంది అంటే బిల్డింగ్ లేదా గుహ పై భాగాన్ని తాకే ముందు 10 మిల్లీ సెకండ్లు పాజ్ (ఆలస్యం) తీసుకొని స్లాబ్ ని చీల్చుకుంటూ వెళ్లి స్లాబ్ కింద భారీ పేలుడుని సృష్టిస్తుంది. భూగర్భ గృహంలో ఉన్నా హామ్మెర్ ధాటికి ఎవరూ బ్రతికి బట్టకట్టలేరు.
హామ్మెర్ ని రాఫెల్ తో ప్రయోగిస్తే? ఒక్కో రాఫెల్ 6 హామ్మెర్ బాంబులని తీసుకెళ్లగలదు. అలాగే ఒకే సమయంలో వేరే వేరే 6 టార్గెట్లని కొట్టగలదు. రాఫెల్ ఫార్మేషన్ (6 రాఫెళ్లు) దాడికి వెళితే ఏక కాలంలో 6X6=36 టార్గెట్లు, అవీ వేరు వేరుగా ఉన్నవాటిని జస్ట్ ఒక బటన్ ప్రెస్ తో ప్రయోగించవచ్చు. ఒక సారి లాంచ్ చేసాక అవి టార్గెట్లని కొట్టాయా లేదా అని చూసుకొనవసరం లేదు. 70 km దూరం నుండి ప్రయోగించి వెనక్కి వచ్చేయొచ్చు. 36 టార్గెట్లు నాశనం అయిపోయినట్లే లెక్క.
రాఫెల్ ప్యాకేజీలో ఇవీ ఉన్నయ్
యూరోపియన్ కన్సార్టియం MBD సంస్థ రాఫెల్, యూరో ఫైటర్ లకే అమ్ముతుంది వీటిని కాబట్టి చైనా, పాకిస్థాన్ లు వీటిని ఎదుర్కోలేవు.
రాఫెల్ జెట్ల ఎందుకు అంత ఖరీదు పెట్టి కొన్నారో అర్ధమవుతున్నదా? వెపన్ పాకేజీ తో కలిపితేనే అంత ఖరీదు. ముందే కొంటె విడిగా కొనే ధర కంటే తక్కువకి ఇస్తారు. వెపన్ పాకేజీ లో ఎన్ని ఉన్నాయో రహస్యంగా ఉంచారు.
కాంగ్రెస్ బేరం ఆడింది రాఫెల్ -2 మోడల్. అదీ వెపన్ పాకేజీ కాకుండా, 10 ఏళ్ళు మెయింటనెన్స్ కాకుండా.
మోడీ కొన్నది రాఫెల్-3 మోడల్, విత్ వెపన్ పాకేజీ+10 సంవత్సరాల నిర్వహణ బాధ్యత దస్సల్ట్ దే.
కాంగ్రెస్ బేరం ఆడింది రాఫెల్ with PESA రాడార్ తో ఉన్నప్పుడు.
మోడీ కొన్నది రాఫెల్ విత్ అధునాతన AESA రాడార్ తో.
కాంగ్రెస్ బేరం ఆడినప్పుడు రాఫెల్ కి ఉన్నది చాలా తక్కువ సామర్ధ్యం ఉన్న EW సూట్ ఉన్నది.
మోడీ కొన్నది స్పెక్ట్రమ్ EW సూట్ ఉన్నది. ఇప్పుడు రాఫెల్ లో ఉన్న ఎలెక్ట్రానిక్ వార్ ఫెర్ సూట్ దాదాపుగా F-35 కి ఉన్నదానితో పోల్చవచ్చు.
కాంగ్రెస్ బేరం ఆడింది కోల్డ్ స్టార్ట్ లేకుండా.
మోడీ కొన్న రాఫెల్ కి కోల్డ్ స్టార్ట్ ని ప్రత్యేకంగా బిగించి ఇచ్చింది దస్సల్ట్.
మైనస్ 20 డిగ్రీల దగ్గర జెట్ ఇంజిన్లు వెంటనే స్టార్ట్ చేయలేరు. ముందుగా ఇంజిన్ ఉన్న ప్రాంతాన్ని కృత్రిమంగా వేడి చేయాలి తర్వాతే ఇంజిన్ స్టార్ట్ చేస్తారు. లాడఖ్ లాంటి చోట్ల శీతాకాలంలో రాఫెల్ కోల్డ్ స్టార్ట్ సహాయంతో వెంటనే స్టార్ట్ చేయవచ్చు.
అంటే దాడి చేయాలి అంటే వేచి చూసే అవసరం లేదు రాఫెల్ కి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడిగిన 7 అదనపు అవసరాల కోసం దస్సాల్ట్ ఎయిర్ ఫ్రెమ్ ని రీ డిజైన్ చేయాల్సి వచ్చింది. దీనికి ఏ జెట్ తయారీ సంస్థ ఒప్పుకోదు. రీ డిజైన్ చేయాలంటే స్క్రాప్ నుండి మొదలుపెట్టాలి. దస్సాల్ట్ ని ఒప్పించారు మోడీ!
ఇప్పుడు భారత్ కి చేరుకున్న హామ్మెర్ లేజర్ గైడెడ్ బాంబులు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చాయి.
చైనా కానీ, పాకిస్థాన్ కానీ ఎలాంటి దుస్సాహసానికి పూనుకున్నా దెబ్బతినాల్సిందే.
Share this Article