అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ షూటింగు తరువాత జూనియర్ ఎన్టీయార్ ప్లాన్ ఏమిటి..? బాహుబలి తరువాత ఆ స్థాయిలో రాజమౌళి తీసే ఆ సినిమా సంగతి కాసేపు ఇక పక్కన పెట్టేయండి… జూనియర్ దక్షిణ భారతంలో ఇంటింటికీ చేరగల ఓ భిన్నమైన ప్రాజెక్టు మీద సంతకం చేశాడు… నిజంగా తనకు పెద్ద ప్లస్… జస్ట్, ఇలా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు గుమ్మడికాయ కొట్టేయడం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ కావడం… వావ్…
అందరూ అనుకుంటున్నట్టు అది ఏ పాన్ ఇండియా సినిమా ప్రాజెక్టో… దక్షిణ భాషల బహుభాషా చిత్రమో కాదు… అదసలు సినిమాయే కాదు… టీవీ ప్రోగ్రామ్… ఓసోస్, టీవీ ప్రోగ్రామ్‌కు అంత సీన్ ఏముంది అని పెదవి విరిచేయకండి, ఒక సెలబ్రిటీని ఇంటింటికీ తీసుకెళ్లి, హుందాగా పరిచయం చేయగల సత్తా టీవీకే ఉంది… అమితాబ్ బచ్చన్ చూడండి… కౌన్ బనేగా కరోడ్‌పతి షో ద్వారా వారంవారం ఎందరిని పలకరిస్తున్నాడో… అవును, జూనియర్ కూడా అచ్చం అదే చేపట్టబోతున్నాడు…
Ads
ప్రస్తుత సమాచారం మేరకు… జూనియర్ సన్ టీవీతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు… సూపర్ అగ్రిమెంటు అది… కేబీసీ తరహాలోనే వాళ్లు ఓ పెద్ద షో ప్లాన్ చేశారు… దానికి హోస్ట్ జూనియర్ ఎన్టీయార్… తెలుగులో గతంలో నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరిట సేమ్ షో రన్ చేశాడు… బాగా సక్సెసయింది కూడా… నాగార్జున స్పాంటేనిటీ దానికి ప్లస్ అయ్యింది కూడా… కానీ అదే షో చిరంజీవి చేస్తే ఫెయిలైంది… కేబీసీ సీటులో ఓవర్ డ్రామా, ఓవర్ ఎమోషన్ వర్కవుట్ కావు… అది చిరంజీవికి తెలియదు… దాంతో మొత్తానికే ఆ షో నిలిచిపోయింది…
ఇక జూనియర్ విషయానికొస్తే తను టీవీకి కొత్తేమీ కాదు… బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌కు హోస్ట్ తనే… అదరగొట్టాడు… తరువాత హోస్టింగు చేసిన నాని అలా చేయలేకపోయాడు… స్ట్రేచర్ తక్కువైందేమో బహుశా… ఆ తరువాత నాగార్జున… పర్లేదు… తను కూడా మంచి హోస్ట్… యాంకరింగు వీజీగా లాగించేస్తున్నాడు…
అబ్బే, ఈ షోలతో ఒరిగేదేముంది అంటారా..? కాదు… అసలు ఓటీటీలు, ఏటీటీలు, వెబ్ సీరియస్, టీవీ సీరియళ్లు, సినిమాలకన్నా ఈ రియాలిటీ షోలే పవర్ ఫుల్… ప్రతి ఇంటికీ చేరవేస్తాయి… ఉదాహరణకు ఈ టేబుల్ చూడండి…
ఇది గతవారం తెలుగు బార్క్ వినోద చానెళ్ల ప్రముఖ ప్రోగ్రామ్స్, సీరియళ్ల రేటింగుల సంక్షిప్తం… మాటీవీలో బిగ్‌బాస్ తప్ప మరే రియాలిటీ షో లేదు… జీటీవీ రియాలిటీ షోల పరంగా అట్టర్ ఫ్లాప్… సరిగమప, బొమ్మ అదిరింది అట్టర్ ఫ్లాప్… జెమినిలో ఏమీ లేదు… ఈటీవీలో మాత్రమే పలు రియాలిటీ షోలు ఉన్నయ్… అన్నీ రేటింగుల్లో పర్లేదు… ఈ చార్టులో లేదు గానీ సుమ నిర్వహించే ఆఫ్టరాల్ సిల్లీ కిట్టీపార్టీ వంటి క్యాష్ ప్రోగ్రామ్ కూడా పర్లేదు… రియాలిటీ షోలకున్న రేటింగుల దమ్ము అది…
మరి సన్ టీవీకి అంత సీన్ ఎక్కడిది అనే మాట పొరపాటును కూడా అనొద్దు… ఏదో మనం తెలుగులో జెమిని టీవీ దురవస్థ చూసి అలా అనుకుంటాం గానీ… దక్షిణాదిన పవర్ ఫుల్ నెట్వర్క్ అది… యాజమాన్యం టీవీని పెద్దగా పట్టించుకోవడం లేదు, సరైన మేనేజర్లు లేక అలా తగలడింది… కానీ ఇప్పుడిప్పుడే ఆ సంస్థలోనూ మార్పులు మొదలయ్యాయి…
SD channels | |||||
---|---|---|---|---|---|
Category | Tamil | Telugu | Kannada | Malayalam | Bengali |
Entertainment | Sun TV | Gemini TV | Udaya TV | Surya TV | Sun Bangla |
Music | Sun Music | Gemini Music | Udaya Music | Surya Music | |
Movie | K TV | Gemini Movies | Udaya Movies | Surya Movies | |
Comedy | Adithya TV | Gemini Comedy | Udaya Comedy | Surya Comedy | |
Kids | Chutti TV | Kushi TV | Chintu TV | Kochu TV | |
Classic | Sun Life | Gemini Life | |||
News |
ఇదీ సన్ టీవీ నెట్వర్క్… జూనియర్ గనుక కేబీసీ తరహా షో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది జెమిని ప్లస్ సన్‌టీవీకి ప్రయోజనకరం… అలాగే జూనియర్‌కు కూడా ప్రయోజనకరమే… తన పాపులారిటీని ఇలాంటి షోలు కన్సాలిడేట్ చేస్తాయి… పిల్లలకు, పెద్దలకు కనెక్టవుతాయి… అది లాంగ్ రన్లో జూనియర్‌కు మేలు చేస్తుంది… మొత్తానికి మంచి ప్రాజెక్టే… తరువాత మరిన్ని వివరాలు ముచ్చటించుకుందాం… ప్రస్తుతానికి ఇంతే…
Share this Article