Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెంపలేసుకున్నాడు… అందులోనూ దొంగ కన్నీళ్లు, అబద్ధాలు, ఆత్మవంచన…

January 12, 2022 by M S R

సిద్ధార్థ్ అనబడే ఓ సిగ్గూశరం లేని తమిళనటుడు చెంపలేసుకున్నాడు… ఈ డర్టీ కేరక్టర్ టపీటపీమని చెప్పుతో కొట్టేసుకున్నాడు… సైనా నెహ్వాల్‌కు అదే ట్వీట్టర్ ద్వారా ఓ క్షమాపణ లేఖ రాశాడు… అయితే అందులోనూ అబద్ధాలు, దొంగ కన్నీళ్లు, ఆత్మవంచన… డ్యామేజీ కంట్రోల్ డ్రామా… నిజానికి సిద్ధార్థ్ తత్వమే ఓ సిగ్గూశరం లేనిది… అదెప్పుడూ మారదు… ఇప్పుడు అకస్మాత్తుగా సైనా నెహ్వాల్‌కు క్షమాపణ చెప్పగానే, తనలోని ఏ జ్ఞానచక్షువులో తెరుచుకున్నాయని కాదు అర్థం… దాని వెనుకా ఓ లెక్క ఉంది… ఇమేజీ బిల్డప్ స్వార్థం ఉంది… చెప్పుకుందాం…

తనను కాక్ చాంపియన్ వంటి వెగటు పదజాలంతో తిట్టిపోసినా సరే, ఆమె చాలా హుందాగా స్పందించింది… తను ఏం చెప్పదలుచుకున్నాడో నాకు అర్థం కాలేదు, కాస్త మంచి పదాలు వాడితే బాగుండు అనిపించింది అని సింపుల్‌గా తేల్చేసింది… నిజానికి ఆమె స్పందన తీరు సిద్ధార్థ్‌ను ఈడ్చి తన్నినట్టుగా ఉంది… అది ఆమె సంస్కారం, ఇది ఇతడి సంస్కారం… ఇప్పుడు ట్విట్టర్‌లో పెట్టిన క్షమాపణ లేఖలో సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు…

saina

Ads

అది మరింత హాస్యాస్పదంగా ఉంది… తన మెంటాలిటీలాగే… నాకు ఏ దురుద్దేశమూ లేదు, నేను బలమైన ఫెమినిస్టు సానుభూతిపరుడిని, ప్రత్యేకించి లింగవివక్ష అస్సలు లేదు… అని నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెబుతూ పోయాడు… అసలు సైనాను వదిలేయండి, తను గతంలో ఇతరులపై చేసిన పలు ట్వీట్లు తన బొద్దింక మనస్తత్వాన్ని సూచిస్తూనే ఉన్నయ్… అందులో ఆడలేడీస్ కూడా బోలెడుమంది… అన్నట్టు ఈ సిద్ధార్థ సైనాను ఉద్దేశించి ఏం కూశాడో, ఆ వివాదం ఏమిటో తెలుసా మీకు..? ఈ లింక్ చదవండి…

డర్టీ కేరక్టర్‌..‍! సమంత ముందుగానే వదిలించుకుని బతికిపోయింది..!!

ఇప్పుడు క్షమాపణలు చెప్పుకునేంత సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది..? ఇదేనా మీ ప్రశ్న… తన ఫెమినిస్టు ఇమేజీకి డ్యామేజీ అయిపోయిందట… గతంలో పలు సందర్భాల్లో తను మగవివక్ష వ్యతిరేకిగా నిరూపించుకున్నాడు అట… కానీ ఇప్పుడు సైనా మీద చేసిన నీచ వ్యాఖ్యలతో ఆ ఇమేజీ అంతా కొట్టుకుపోయి, తన బట్టలు అన్నీ చిరిగిపోయి, తన అసలు స్వరూపం బట్టబయలు అయిపోయిందట… అదీ బాధ… అందుకే అర్జెంటుగా ఆమెకు సారీ చెప్పేసి, తప్పు దిద్దుకునే పనిలో పడ్డాడు… ఏ సమంతనైతే ఈ డర్టీ కేరక్టర్ మోసం చేశాడో, ఆ సమంతకు దోస్త్ శ్రీపాద చిన్మయి… సమంతకు కోపమున్నా సరే, చిన్మయి మాత్రం సిద్ధార్థ్‌ను ఏమీ అనేది కాదు, వేరేవాళ్ల మీద ఎగిరిపడుతూ ఉంటుంది…

siddharth

చివరకు ఇప్పుడు సుతిమెత్తగానైనా సిద్ధార్థ్‌ను లవ్వులవ్వుగానే తిట్టేసరికి, ఈ సిద్ధార్థ్‌కు ఎక్కడో తగిలింది… నిజానికి ఈ బూతు వ్యాఖ్యలు, పోస్టులు పూర్తిగా సిద్ధార్థ్‌ మెదడు నుంచి పుట్టినవి కావు… తన అభిప్రాయాల్ని అక్షరాల్లో పెట్టే ఆ తెలివి కూడా లేదు తనకు… 47 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న తన ట్విట్టర్ ఖాతాను ఓ టీం మెయింటెయిన్ చేస్తుంటుంది… అధికశాతం మోడీని తిట్టే పోస్టులే… లేదంటే వ్యక్తిగత నిందలు… ఓ మెచ్యూరిటీ కూడా ఉండదు… ఓ సగటు చిల్లర ట్విట్టర్ ఖాతాదారుడి వాల్ చూస్తున్నట్టే ఉంటుంది… ఇప్పుడు జనం బండబూతులు తిడుతున్నారనీ ఆ టీమే గుర్తించి, ఇదుగో ఈ క్షమాపణ లేఖ, సమర్థనకు నానా పాట్లు, ఆ దిశలోనే మళ్లీ అబద్ధాలు, ఆత్మవంచన..!! పైగా ఆ వ్యాఖ్య జోక్ అట..!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions