సోషల్ మీడియా అంటేనే మాగ్జిమం ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్, ఫేక్ ఖాతాలు… మరీ పీకే వైరస్ ప్రబలిన తరువాత ఇది విపరీతంగా వ్యాపించింది… ఇంటింటికీ ఒమిక్రాన్ తరహాలో ఎటుచూసినా సోషల్ మీడియాకు కూడా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు… హఠాత్తుగా ఆంధ్రజ్యోతి సైటులో ఓ వార్త కనిపించింది… అసలే ఇది సోషల్ మీడియాను అనుసరిస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏదిపడితే అది రాసేస్తున్న దుర్దినాలు కదా… డౌటొచ్చింది…
తను ఏం రాశాడంటే… ‘‘సమంత టీ షర్ట్ మీద పదాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు… పెళ్లి పెటాకులయ్యాక మరీ ఎంజాయ్ చేస్తోంది… హవ్వ, ఈ టీ షర్ట్ చూశారా’’ అన్నట్టుగా ఏదేదో రాసిపడేశారు… సరే, ఆంధ్రజ్యోతి అంటేనే మనకు ఆ న్యూస్ మీద కాస్త అంచనా ఉంటుంది కదా… ఇదేమిటి ఈ ఫోటో మీద పదాలు మరీ చిల్లరగా, సమంత స్థాయికి తగినట్టు లేవు… అఫ్‌కోర్స్, పెళ్లి పెటాకులయ్యాక కాస్త ఆమె ఫ్రీడం పెద్ద రెక్కలు కట్టుకున్న మాట నిజమే గానీ, మరీ ఈ స్థాయికి పడిపోతుందా అనేది డౌట్…
Ads
డెస్క్ టాప్ మీద ఈ లింక్ ఓపెన్ చేస్తే 404 ఎర్రర్, అసలు ఈ వార్తే లేదు ఫోవోయ్ అని కనిపిస్తుంది కొన్నిసార్లు… అదే ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఓపెన్ చేస్తే ఆ స్టోరీ కనిపిస్తోంది… ఆ సైటులోకి వెళ్లి చూస్తేనేమో దొరకదు… అంతా ఓ గందరగోళం…
అయితే నిజంగా ఈ చిల్లర పదాలతో సమంత టీషర్ట్ వేసుకుందా… అంతటి అక్కినేని ఫ్యామిలీని వీడితే మాత్రం… మరీ ఊ అంటావా, ఊఊ అంటావా అని ఊపుళ్లు పాటలో నర్తిస్తే మాత్రం… ఈ స్థాయికి పడిపోతుందా అనే డౌట్‌తో ఆమె సోషల్ మీడియా ఖాతాలు చెక్ చేస్తే… ఇన్‌స్టాలో ఆ ఫోటో, వీడియో కనిపించలేదు… ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫోటో, వీడియో లేదు… ట్విట్టర్‌లోనూ లేదు… మరి ఈ ఫోటో ఆంధ్రజ్యోతికి ఎక్కడ దొరికినట్టు..? ఫేకా..? ఫేక్ అయితే నిర్ధారణ లేకుండా ఓ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా వార్తను కుమ్మేయొచ్చా…? ఏమోలెండి… అదసలే ఆంధ్రజ్యోతి..! సార్, నిజంగానే ఈ టీషర్ట్ నిజమైందేనా..?! ష్, ఈ టీషర్ట్ ఫోటో ఎక్కడ దొరికింది సార్… మనలోమనమాట…!!
Update :: ఒక వీడియోలో ఇలాగే కనిపిస్తోంది… హమ్మ సమంతా… https://www.youtube.com/watch?v=eIZaMPwcE_g జ్యోతి వార్త నిజమే అనిపిస్తోంది, అవును సమంతా, మరీ ఈ రేంజ్‌కు పడిపోవడం అవసరమా..?! ష్… ఈ ఫోటో కింద పెళ్లిళ్ల బ్యూరో యాడ్ మాత్రం నిజంగా నవ్వొచ్చింది…!!
Share this Article