Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

June 6, 2025 by M S R

.

ఓ హీరో… పుడుతూనే కదలిక లేక, సిగరెట్ పొగ పీల్చగానే ప్రాణం పోసుకుంటాడు… ఇక పొగ లేనిదే బతకలేడు… ఇక కథ అంతా పొగ చుట్టే తిరుగుతూ ఉంటుంది… ఏమిటీ పొగచూరిన కథ అంటారా..?

మరి ఏమనుకున్నారు..? జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరో మరి… (ఈరోజుకు తనను ఎన్టీయార్ బావమరిది అనే గుర్తిస్తున్నారు, గమనించగలరు…) ఎన్టీయార్‌కు రక్తంలోనే నటన ఉంది… సాన పెట్టుకున్నాడు… కానీ తన బావమరిది మాత్రం నటన విషయంలో ఇంకా మైళ్ల కొద్దీ ప్రయాణించాల్సి ఉంది…

Ads

సరే, హాస్పిటల్‌లో ఫినాయిల్ వాసనల మధ్య పుడితే ఇక అది లేకుండా బతకలేరా అనే చొప్పదంటు సందేహాలు అవసరం లేదు గానీ… చాలా వేగ్, వీక్ స్టోరీ లైన్… అప్పట్లో శతమానంభవతి డైరెక్టు చేసిన దర్శకుడు వేగేశ్న సతీష్ దీనికీ దర్శకుడు… ఫన్నీ స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు ట్రీట్‌మెంట్ అదిరిపోవాలి…

లేకపోతే జనాన్ని రంజింపచేయడం కష్టం… ఇందులో అదే జరిగింది… ఎప్పుడో 2022లో సినిమా స్టార్టయితే ఇన్నాళ్లకు పొగపోసుకుని, బయటికి వచ్చింది… హీరో గారు అందుకే డిఫరెంటు లుక్కుల్లో దర్శనమిస్తారు… హీరోయిన్ సంపద కాస్త బాగానే ఉన్నా ఫాఫం, మళ్లీ అయిపూజాడా లేదు…

మంచి పల్లెటూరి వాతావరణం, ఏమాత్రం అసభ్య వాసనలు లేకపోవడం బాగుంది… అయితే రావు రమేష్, సీనియర్ నరేష్ మంచి నటులు… మంచి పోటీ పాత్రలు పడాలే గానీ జీవించేయగలరు… కానీ ఆ ఇద్దరినీ వాడుకోవడంలో వైఫల్యం కనిపిస్తోంది…

ఏదో ఎంపీటీసీ పోటీ నేపథ్యంలో వియ్యంకులు కావల్సిన ఈ దోస్తులు పరస్పరం గొడవలు పడటం, పోటీలు, సవాళ్లు విసురుకోవడం, నెగ్గించుకునే ప్రయత్నాలు చేయడం మరీ ఏదో టీవీ సీరియల్‌లాగా ఉంది తప్ప రక్తికట్టలేదు పెద్దగా…

కథంతా సిగరెట్ చుట్టే… చివరకు టైటిల్‌ను కూడా సిగరెట్లు వంచి మరీ అక్షరాలను పేర్చారు… కథలో ట్విస్టు కూడా సిగరెట్ పెట్టేలో ఉంగరం తీసుకురావడమే… ప్చ్, థియేటర్లలో పొగ బంద్ కదా ఇప్పుడు, లేకపోతే ప్రేక్షకులు భరించలేక తాగే సిగరెట్ల పొగతో తెర నల్లబారిపోయి ఉండేదేమో…

మలయాళంలో వచ్చిన థివండి సినిమాను తెలుగీకరించి తీశారని అప్పట్లో వార్తలు చదివినట్టు గుర్తు… కానీ ఏం మార్చారు..? పెద్దగా ఏమీ లేదు… పర్లేదు, జూనియర్ బావమరిది కదాని మొహమాటం అక్కర్లేదు, అవాయిడ్ చేయవచ్చునేమో…

అన్నట్టు… గతంలో ఎక్కడో ఓ ఉదాహరణ ఉందని చెప్పారు… పొగ పీల్చగానే శిశువు బతికినట్టు… అదేదో యాక్సిడెంటల్ కావచ్చు, ఇంకేదో కారణం ఉండి ఉండవచ్చు… ఐనంతమాత్రాన ఈ కథకు జస్టిఫికేషన్ ఏమీ కాదు అది… పేరుకేమో సినిమా గోల్డ్ ఫ్లేక్ కింగ్… తెరపై గణేష్ బీడీ… పోనీ, ఘంట చుట్ట పొగ..!! లైటిల్ జస్టిఫికేషన్ అస్సల్లేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions