ఆమధ్య మంచు విష్ణును వెక్కిరిస్తూ ఓ స్కిట్లో పంచులు పేలాడు కదా హైపర్ ఆది… అది బాగానే మండింది… రకరకాల వార్తలు వచ్చినయ్… మల్లెమాల సంస్థ కూడా ఇక ఢీ షోలో, జబర్దస్త్లో ఆదిని కంటిన్యూ చేస్తారా లేదా అనే డౌట్లు కూడా తలెత్తాయి… చివరకు అదంతా సద్దుమణిగింది… అంతేకాదు, ఇప్పుడు ఈటీవీ కామెడీ షోలలో ఆది ఏది చెబితే అదే… ఫుల్ గ్రిప్ పెరిగిపోయింది… ఎంత అంటే..? తమపై జోకులు వేస్తే ఉడుక్కునే వాళ్లు కూడా ఆది వేసే పంచుల్ని కిక్కుమనకుండా భరిస్తున్నారు… అంతగా ఆది డామినేషన్ పెరిగిపోయింది…
ఒకవైపు సుడిగాలి సుధీర్ ఎన్నాళ్లు కొనసాగుతాడో తెలియదు… ఆల్ రెడీ ఢీ షో నుంచి బయటికి పంపించేశారు, స్పెషల్ ఈవెంట్లలోకి రానివ్వడం లేదు… రష్మిని కూడా ఆ షో నుంచి పంపించేశారు… ఇంకేం..? ఆది రాజ్యమే ఇప్పుడక్కడ… ప్రియమణి మీద, నందితా శ్వేత మీద, డాన్సర్ల మీద, సుస్మిత మీద టైమానుసారం పంచులు పేలుతుంటయ్… ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా దాదాపు తన పంచులే అధికంగా పడుతుంటయ్… సుధీర్ కేవలం యాంకర్… ఫాఫం, ఈటీవీలో తన పొజిషన్ మరీ బలహీనమైపోయింది…
ఈమధ్య వింత పంచులతో రెచ్చిపోతున్న పంచ్ ప్రసాద్ సుధీర్ ఎదుట ‘‘నీ ఫ్యాన్స్ అయితేనేం..? నా విగ్గు కూడా పీకలేరు’’ అంటూ విగ్గు తీసి విసిరికొట్టాడు… తనకు అలవాటైన రీతిలో సుధీర్ దాన్ని కూడా లైట్ తీసుకున్నాడు… ఇక జబర్దస్త్ షో విషయానికి వస్తే… ఆదికీ, సుధీర్కూ నడుమ ఓ హిడెన్ కాంపిటీషన్ నడుస్తోంది… ఎక్సట్రా జబర్దస్త్లో సుధీర్, గెటప్ సీను, ఆటో రాంప్రసాద్ టీం ఎప్పుడూ హైలైట్ అవుతూ ఉంటుంది, వాళ్ల సీనియారిటీ, మెరిట్ కూడా ఆ షోకు అసెట్…
Ads
జబర్దస్త్లో మాత్రం హైపర్ ఆది టీమే హైలైట్… మిగతా టీంలు స్కిట్స్ చేస్తుంటయ్ కానీ పెద్దగా క్లిక్ కావడం లేదు… మొన్నామధ్య పుష్ప స్పూఫ్ను ఆది, సుధీర్ ఇద్దరూ చేశారు, రెండూ బాగున్నయ్… కానీ యూట్యూబ్ వ్యూస్, లైక్స్, కామెంట్స్ విషయంలో ఆ రెండు స్కిట్ల నడుమ విపరీతంగా పోటీ సాగింది… ఇదంతా వదిలేస్తే సుధీర్ బలహీనపడేకొద్దీ ఆది అక్కడ బలపడిపోయాడు… అభి కూడా వెళ్లిపోయాడు, సో, ఆది వేళ్లు బలంగా పాతుకుపోయినయ్…
దాంతో పంచుల యధేచ్ఛత పెరిగింది… అసలు అనసూయ ఎవరు తన మీద జోకినా సహించదు… అలాంటిది పుష్ప స్పూఫ్లో ‘‘పది వేలు ఇచ్చి పెద్ద పూజ’’ వంటి పంచ్ వదిలినా కిక్కుమనలేదు… అంతెందుకు..? రోజా మీద ఎవరూ పంచు వేయరు, భయం… ఆమె కూడా ఇష్టపడదు… కానీ ఆది ఆమె కూడా పంచులు వేస్తున్నాడు… ప్రత్యేకించి ఆమె వయస్సు మీద వెటకారాన్ని దట్టిస్తున్నా సరే, నవ్వుతోంది తప్ప ఏమీ అనడం లేదు… మొన్నామధ్య రోజా హోం టూర్ అని ఓ స్కిట్ చేశారు… అందులో ‘‘తాను స్వయంగా పెట్టిన సాల్టీ ఎలా ఉందని అడుగుతుంది రోజా… బాగుంది, కానీ టీ అయితే బాగుండేదని పంచ్…
కృష్ణ గారు కొడుకు మహేశ్ బాబుతో యాక్ట్ చేయాలని ఉంది అని రోజా దేవుడిని అడగడం, హాయిగా కృష్ణా రామా అనుకోకుండా మనకెందుకండీ ఈ కృష్ణ గారి కొడుకు, యాక్షన్ అని మరో సూపర్ పంచ్ ఆది నుంచి… వంట గ్యాస్ వెలిగించి, ఒలింపిక్ జ్యోతి వెలిగించినట్టు ఆనందపడుతోంది అని ఇంకో పంచ్… అక్కడితే అయిపోలేదు, జబర్దస్త్ తాజా షోలో కొనసాగింపు… కాస్త మేకప్పు అదీ బాగా పెంచింది, మార్చింది రోజా…
ఐషు ఆదిని అడుగుతుంది ‘రోజా హోం టూరే ఎందుకు చేశావ్’ అని… నాకెప్పటి నుంచో ఓల్డేజీ హోంటూర్ చేయాలని కోరిక, అందుకే చేశానంటూ ఆది పంచ్… టెన్షన్ లేకుండా అలా ఎలా ఉండగలుగుతోంది అని మళ్లీ అడుగుతుంది ఆమె… ఏముందీ పెన్షన్ తీసుకుంటోంది కదా, టెన్షన్ దేనికి అని ఇంకో పంచ్… అంటే ఓల్డేజీ పెన్షన్ అని…! జస్ట్, నవ్వి, ఆదిని మెచ్చుకోవడమే… అంతే మరి… ఇప్పుడు హైపర్ ఆది పొజిషన్ అలా ఉంది మరి…!!
Share this Article