చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య అని గాకుండా కామినేని ఉపాసనను ఇక్కడ అపోలో గ్రూపు హాస్పిటళ్ల వైస్ ఛైర్ పర్సన్‌గా ప్రస్తావించుకోవాలి… ఆమె తెలుగు మాట్లాడలేదు ఎందుకో… సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గానే ఉంటుంది… కొన్ని ఆలోచింపజేసే పోస్టులు కూడా కనిపిస్తుంటయ్… అదే సమయంలో అప్పుడప్పుడూ ట్రోలింగ్‌కూ గురవుతూ ఉంటుంది… ఆమధ్య ఏదో గుడి గోపురం మీద ఎవరెవరో నిలబడ్డ ఓ పిచ్చి ఫోటో పెట్టి బాగా ట్రోలింగుకు గురైంది…
స్థూలంగా చూస్తే, కాస్త వివేకం ఉన్న పోస్టులే కనిపిస్తుంటయ్… తాజాగా ఓ చిన్న వీడియో బిట్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది… ప్రేమ అనే జర్నలిస్టు చేసిన ఇంటర్వ్యూలో ఓ చిన్న పార్ట్… (ఎన్నిరోజుల క్రితం ఇంటర్వ్యూ అనేది తెలియదు)… అందులో ఉపాసన మాట్లాడుతూ… ‘‘మన పురాణాలు ఏమంటున్నాయంటే… ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు గనుక మహామృత్యుంజయ మంత్రాన్ని రెండుసార్లు జపిస్తే ఆ మెడిసిన్ మరింత బాగా పనిచేస్తుంది… నేనూ ఎక్కడో చదివాను ఇది…
ఇదెందుకు చెబుతున్నానంటే..? మెడిసిన్ అంటేనే జనం అందులో ఓ నెగెటివిటీని చూస్తారు… రోగం ఉంటేనే కదా మెడిసిన్ తీసుకునేది… దాన్ని తగ్గించడానికి ఓ పాజిటివిటీ అవసరం… దాన్ని ఈ మంత్రం అందిస్తుంది… ఈ మంత్రమే కాదు, అల్లాను తలుచుకోవచ్చు, క్రీస్తును తలుచుకోవచ్చు… ఓ పాజిటివ్ వైబ్ కోసం… వ్యాధి తగ్గడానికి హీలింగ్ ప్రక్రియలో ఏది ఉపయోగపడినా ఆహ్వానించాలి’’
Ads
చాలామంది నెటిజనం ఆమె వాదనతో ఏకీభవించడం లేదు… పైగా ట్రోల్ చేస్తున్నారు… ఓ ప్రఖ్యాత హాస్పిటళ్ల గ్రూప్ వైస్ ఛైర్‌పర్సన్‌వు, సైన్స్ టెంపర్‌మెంట్ దిశగా మాట్లాడాల్సింది పోయి మూఢత్వాన్ని ప్రమోట్ చేస్తావా..? రోడ్డు పక్కన తాయెత్తులు అమ్మే తరహాలో మాట్లాడితే ఎలా..? అనేది ఆ ట్రోల్స్ సారాంశం… కానీ ఆమె చెప్పిందాంట్లో పెద్ద తప్పేమీ లేదు, రిస్క్ లేదు, అఫ్ కోర్స్, దేవుడిని నమ్మేవాళ్లకు మాత్రమే ఆమె సూచన…
సైన్స్‌ను ప్రమోట్ చేయడం అంటే దేవుడి ఉనికిని తిరస్కరించడం కాదు కదా… ఒక విశ్వాసిగా ఉండటాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… అదేసమయంలో సైన్స్‌నూ ఇగ్నోర్ చేయాల్సిన పనిలేదు… కావచ్చు, ఒక మంత్రాన్ని రెండుసార్లు జపిస్తే, తనకు దేవుడి సాయం అందాలనే ఆకాంక్షను ఆ రోగి అలా వ్యక్తీకరిస్తే అందులో ఎవరికైనా ఏం నష్టముంది..? రోగి బలమైన ఆకాంక్ష కొంతైనా విశ్వాసాన్ని, కోలుకోవాలనే సంకల్పాన్ని పెంచి ఎంతోకొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది…
ఐనా ఆమె తాను ఎక్కడో చదివానని చెబుతోంది తప్ప అందరూ దీన్ని పాటించండని పిలుపునివ్వడం లేదు… తన అభిప్రాయాన్ని, తన నమ్మకాన్ని వ్యక్తీకరిస్తోంది… అందరూ ఏకీభవించాలని ఏమీలేదు… అలాగని ఆమెను తప్పుపట్టాల్సిన అవసరమూ లేదు… ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటారా..? ‘‘ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్’’
ఇదిగాకుండా మహామృత్యుంజయ స్తోత్రం వేరే ఉంటుంది… అందులోని చిన్న పార్ట్ ఇదుగో…
ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిం – నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం – నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం – నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం – నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||
Share this Article