‘‘సిగ్గూశరం లేదు, ఇది ప్రివెడ్ షూట్ ఏమిట్రా… బురద గాడిదా..! ఇందులో క్రియేటివ్ రొమాంటిక్ ఫీల్ ఏముందిరా.., ఇది చూస్తూ పెళ్లిపందిట్లో భోజనాలకు ముందే వాంతులు చేసుకోవాలా గెస్టులు..? ఆ బురద పూసుకుని వధూవరులు పెళ్లికి ముందే ఏం చూసుకుంటున్నార్రా..? పోతార్రా, నాశనమైపోతార్రోయ్…’’ ఇలా చాలా వ్యాఖ్యలు కనిపిస్తున్నయ్ ఈ ఫోటో కింద…
నిన్నటి నుంచీ నాలుగైదు బురద ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నయ్… మెజారిటీ తిట్టిపోస్తున్నారు… అసలేమిటి ఇది..? ఓ ప్రివెడ్ షూట్… మన పెళ్లిళ్లకు అంటిన ఒమిక్రాన్ వైరస్ ఈ ప్రివెడ్ షూట్స్… ప్రత్యేకించి తెలుగు పెళ్లిళ్ల కోణంలో చూద్దాం… మంగళస్నానాలు, మెహందీ, సంగీత్ ఎట్సెట్రా పిచ్చి ధోరణులు మనల్ని ఆల్‌రెడీ కమ్మేశాయి…
ఇప్పటికే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పంతుళ్లను పక్కకు నెట్టేసి, వాళ్లే తంతు నిర్వహిస్తున్నారని తెలుసు కదా… రకరకాల ఈవెంట్ల పేరిట పెళ్లి తంతును హైజాక్ చేసేశారు వీళ్లు… అన్నింటికన్నా మెయిన్ ఈ ప్రివెడ్ షూటింగులు… లక్షల్లో చార్జి చేస్తారు… సరే, ఇదో దరిద్రం, సగటు పెళ్లికూతురి తల్లిదండ్రులకు భారం, తలనొప్పి అనుకుందాం…
Ads
కానీ అందులో కూడా రకరకాల పైత్యాలు, కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాల పేరిట పిచ్చి ధోరణులు… మనం ఇంతకుముందే చాలా చూశాం ఇలాంటి పెడపోకడల్ని… పలు సందర్భాల్లో ప్రమాదాలు జరిగిన వార్తల్నీ చదివాం… ఒకడినిచూసి మరొకడు… వన్ టైమ్ మెమరీ, ఖర్చు పోతేపోనీలే అనే మధ్యతరగతి బలహీనతల మీద ఆడుకుని, ఆర్జించే ధోరణి ఇది… చిల్లు పడేది సంప్రదాయానికి ప్లస్ పెళ్లికూతురి తండ్రికి…
పోనీ, అదైనా ఓ రీతిలో, ఓ పద్ధతిలా ఉంటుందా అంటే… అదీ లేదు… రకరకాల పెడధోరణులు… ఆమధ్య చూశాం కదా, పెళ్లికూతురు, పెళ్లికొడుకును దాదాపు బట్టల్లేకుండా షూట్ చేసి, వావ్, మాదే క్రియేటివిటీ అంటూ భుజాలు చరుచుకునే డర్టీ పోకడల్ని…! ఇది తాజా… బురద ప్రేమ… బురద రొమాన్స్… బురద క్రియేటివిటీ… ఎవ్వడూ ఏమీ అనడానికి లేదు… యువత కూడా కొత్తతరహా ప్రివెడ్ షూట్లను ఇష్టపడుతున్నారు మరి… వాళ్లు ఎదగకుండా, ఇవన్నీ వద్దనుకుంటే ఎలా..?
నిజానికి బురదలో పడిదొర్లడం మరీ అంత వ్యతిరేకించాల్సిన పనేమీ కాదు… మడ్ ఫెస్టివల్స్, మడ్ అకేషన్స్, మడ్ స్పోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా బోలెడు… వాటి గురించిన చర్చ ఇక్కడ అనవసరం… కానీ ఈ ప్రివెడ్ మడ్ రొమాన్స్ అవసరమా..? ఇది ఓ మెమరీయా..? ఇంకా నయం..? ఈ మడ్ ట్రెండ్‌ను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లలేదు…!!
విషయానికొస్తే… ఇది ఇండియాలో తీసిన ప్రివెడ్ ఫోటో సెషన్స్ ఏమీ కాదు… ఎవడో ఔత్సాహికుడు ‘‘జబర్దస్త్’’ టేస్టుతో శ్రీలంకలో తీసిందే… ఐనా ఏముందిలే… ఇదేదో బాగుంది అనుకుని ఇండియాలోకి వెంటనే తీసుకొచ్చేస్తారు మనవాళ్లు… మనికె మగే హితే అనే ఓ సాంగ్ ఇక్కడ కూడా ఎంత హిట్టయిందో తెలుసు కదా… ఈ ప్రివెడ్ మడ్ కల్చర్ పాకడం ఎంతసేపు..?
కల్యాణవేదిక దగ్గరకు రాగానే బురద… అందులో నడుచుకుంటూ వెళ్లడం, చుట్టూ బురద నడుమ పంతుళ్ల మంత్రోచ్ఛారణ… అక్కడి నుంచే బురదలో నడుస్తూ భోజనాలకు వెళ్లడం…. ఇలాంటివీ వెడ్ ప్లానర్స్ ఆలోచిస్తే ఏమీ చేయలేం… బురద మాంగల్యం తంతునానేనా..? కుమ్మేయండి బ్రదర్స్… మీదేకదా ఇప్పుడు వేల కోట్ల దందా…!!
ముక్తాయింపు :: మనం ఐటమ్ సాంగ్ అనుకున్నాం గానీ, తాజాగా పెళ్లిళ్ల సంగీత్ కార్యక్రమాల కోసం డాన్స్ ట్రెయినర్లు ‘ఊ అంటావా మామా, ఊఊ అంటావా’ అనే స్టెప్పులు నేర్పిస్తున్నారట…!!!
Share this Article