LOCK UPP… ఈ ఓటీటీ రియాలిటీ షో పేరు చూసి… వాడేమిటి పేరు ఇలా పెట్టుకున్నాడు, స్పెల్లింగ్ కూడా తెలియదా అని ఆశ్చర్యపడకండి… BIGG BOSS అని చూడలేదా..? ఇదీ అంతే… లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త అన్నమాట… బిగ్‌బాస్ షో నిర్మించే ఎండెమాల్ సంస్థే ఇప్పుడు కంగనా రనౌత్ హోస్టుగా ఈ లాకప్ అనే సరికొత్త రియాలిటీ షోకు తెరలేపుతోంది… అనేకానేక దేశాల్లో రియాలిటీ షోలు, ఇతర టీవీ ప్రోగ్రాముల్ని నిర్మిస్తూ ఉంటుంది ఈ సంస్థ… బోలెడన్ని వినోద రంగాల్లోకి విస్తరించిన సబ్సిడరీ కంపెనీలు కూడా ఉన్నయ్…
అందరూ అదుగో తెలుగు బిగ్‌బాస్ ఓటీటీ వచ్చేస్తోంది, ప్రోమో మస్తుంది, ఆమె జాయిన్ అవుతుందట, ఇదుగో ఈ లిస్టులో ఉన్నవాళ్లే కంటెస్టెంట్లట అని వేల వార్తలతో కొన్నాళ్లుగా ఊదరగొడుతున్నారు… నిజం చెప్పాలంటే… ఈరోజుకూ ఆ లిస్టు లీక్ కాలేదు, పర్లేదు… బహుశా ఓంకారుడు అలా కట్టుదిట్టాలు చేసి ఉంటాడు… బూతు సరయు వంటి వాళ్లు బిగ్‌బాస్ షోలో తీవ్ర నిరాశకు గురయ్యారు… అలాంటివాళ్లు ప్లస్ కాస్త వివాదాస్పదంగా వ్యవహరించగలిగిన పాత బిగ్‌బాస్ కేరక్టర్లు ప్లస్ కొందరు కొత్తవాళ్లు ఉంటారట…
Ads
సరే… రోజూ ఓ గంటసేపు చూడమంటే చూస్తారు గానీ… ఇరవై నాలుగు గంటలూ అంటే ఎవడు చూస్తాడు..? పైగా తెలుగు బిగ్‌బాస్ మీద ప్రేక్షకుల్లో విపరీతంగా ఆసక్తి చచ్చిపోయింది… ఏదో నాగార్జున వచ్చే వీకెండ్ షోలకు తప్ప మామూలు రోజుల్లో దయనీయంగా టీఆర్పీలు వచ్చాయి… సిరి, షన్నూ కలిసి, తమ రొమాంటిక్ చేష్టలతో మరో సగం మంది వ్యూయర్స్ తగ్గేలా చేశారు… ఇప్పటికిప్పుడు బిగ్‌బాస్ టీవీ షో పెడితేనే పెద్దగా క్లిక్కయ్యే సీన్ కనిపించడం లేదు…
ఇక ఇదేమో ఓటీటీలో చూడాలి… టీవీ వీక్షణలకు దీటుగా ఓటీటీలో ఈ షో వీక్షించడం కష్టమే… బిగ్‌బాస్ ఓటీటీ పేరిట హిందీలో (వూట్ ఓటీటీ)… బిగ్‌బాస్ అల్టిమేట్ పేరిట తమిళంలో (హాట్ స్టార్) ఇలాంటి షోలు చేశారు గానీ పెద్దగా హిట్ టాక్ ఏమీ రాలేదు… కమల్‌హాసన్ కూడా ఈ బిగ్‌బాస్ హోస్టింగ్ వదిలేశాడు తాజాగా… తెలుగులో బిగ్‌బాస్ నాన్-స్టాప్ అని పేరు పెట్టారు… దీని కథేమిటో ఇక వేచిచూడాలి… దాన్నలా వదిలేస్తే…
కంగనా రనౌత్ హోస్ట్ చేసే లాకప్ మరీ డిఫరెంట్ కాన్సెప్ట్… ఆల్‌రెడీ కాంట్రవర్సీలకు పేరొందిన వాళ్లను కంటెస్టెంట్లుగా తీసుకున్నారు… బిగ్‌బాస్‌లో ఇల్లు ప్లస్ అందరూ కలిసి ఉంటారు కదా… తిండి గట్రా ఇస్తారు కదా… కానీ లాకప్‌లో జైల్ బ్యారక్స్‌లో ఉండాలి… తమకు అవసరమైన వస్తువులు, తిండి గట్రా కావాలంటే తాము అనుభవించిన డార్క్ సీక్రెట్స్ షేర్ చేసుకోవాలి…
అఫ్‌కోర్స్, ఎవరూ నిజాలు చెప్పరు… ఏవో కథలు చెబుతారు… కాకపోతే ఇదోతరహా వినోదం… ఇది ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీల్లో ప్రసారం అవుతుంది… అది ఈ షోకు పెద్ద మైనస్… ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ రీచ్ మరీ తక్కువ… ఏక్తాపూర్‌తో రిలేషన్ కోసం అంగీకరించినట్టుంది కానీ కంగనా దీనికి ఒప్పుకోవడం విశేషమే… పోనీలెండి సార్, ఎదవ రియాలిటీ షోలు అంటారా..? భలేవారే, మరీ సీపీఐ నారాయణలాగా మాట్లాడితే ఎలా..? ఈ షోలకు అయ్యే కోట్లాది రూపాయల ఖర్చు అంతిమంగా మన జేబుల నుంచే కొల్లగొట్టేది… మాట్లాడుకోకపోతే ఎలా…!! బిగ్‌బాస్, లాకప్ ఈ వారమే స్టార్ట్ అవుతున్నాయ్..! (కోట్లకుకోట్లు ఖర్చు పెడతారు గానీ వీళ్లకు లాకప్పుకూ, జైలుకూ తేడా తెలియదు… పెద్ద బుర్రలు కదా మరి…)
Share this Article