ఆంధ్రజ్యోతి పత్రిక పొద్దున్నే ఓ బాంబు పేల్చింది… సాక్షి టీవీకి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకుండా, అనుమతుల్ని రద్దు చేసిందనీ, హైకోర్టులో సాక్షికి తాత్కాలిక ఊరట దక్కిందనీ ఓ వార్త అచ్చేసింది… ఈమధ్యకాలంలో ఇంత ఆనందంగా ఏ వార్తా రాసుకుని ఉండదు బహుశా… అసలే సాక్షి, అందులో కేంద్రప్రభుత్వ నిర్ణయం, ఇంకేముంది..? వార్తను దంచికొట్టింది… తెలుగు జర్నలిస్టు సర్కిళ్లలోనే కాదు, పొలిటికల్, బ్యూరోక్రాటిక్ సర్కిళ్లలో పెద్ద టాపిక్ అయిపోయింది ఇది…
సహజమే కదా… సాక్షి cm జగన్ సొంత టీవీ… దానికి అనుమతులు రద్దు చేయడం, సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించడం ఖచ్చితంగా పెద్ద వార్తే… ఎందుకంటే..? పదేళ్లకోసారి లేదా షేర్ హోల్డర్లు మారినప్పుడు గానీ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాలి… ఈమధ్య కేంద్ర హోం శాఖ ఈ రెన్యువల్స్ సందర్భంగా చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటోంది… ఆమధ్య కేరళ బేస్డ్ మీడియా వన్ అనే చానెల్‌కు కూడా సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదు… ఆ షేర్ హోల్డర్లలో అధికులు జమాతే ఇస్లామీ వాళ్లేనట… ద్వేషప్రసారాలకు దిగుతోందని కేంద్రం భావన…
Ads
వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మాఫియా నేతల నేపథ్యం ఉన్న మీడియా చానెళ్లుగా కేంద్రం భావిస్తే… దేశభద్రతకు ప్రమాదం అనే కారణంతో సెక్యూరిటీ క్లియరెన్స్ నిలిపివేస్తుంటారు..! మరి సాక్షి టీవీకి ఎందుకు ఈ క్లియరెన్స్ నిలిపివేసినట్టు..? ఇదీ ప్రధానమైన ప్రశ్న… కేంద్రంలోని బీజేపీతో జగన్ సఖ్యతగానే ఉంటున్నాడు… తన ప్రత్యర్థి చంద్రబాబును మోడీ ఎంటర్‌టెయిన్ చేయడం లేదు… ఐనా జగన్ టీవీ మీద ఈ ధోరణి ఎందుకు తీసుకున్నట్టు..? పోనీ, సాక్షి టీవీ వెనుక వేర్పాటువాదం, ఉగ్రవాదం, మాఫియా తదితర నేపథ్యాలు కూడా ఏమీలేవు కదా… పైగా తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి…!
ఈ సాక్షి టీవీకి టెలిపోర్ట్ లైసెన్స్ నిలిపివేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందట… ఇప్పుడు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు… హైకోర్టు విచారించింది… తాత్కాలికంగా టీవీకి ఊరటనిచ్చింది…
2006లో సాక్షి టీవీకి అనుమతులొచ్చాయి… 2016లో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంది టీవీ… అంటే 2026 వరకూ పర్మిషన్స్ ఇవ్వాలని కోరింది… కానీ కేంద్రం నిరాకరించింది… ఈ నేపథ్యం అంతా సరేగానీ… మరి 2016లోనే క్లియరెన్స్‌ను నిరాకరిస్తే, తాపీగా ఇప్పుడు సమాచార, ప్రసారశాఖ మేలుకొని, సాక్షి టీవీకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఏమిటనేది మరో ప్రధానప్రశ్న…
నడుమ ఈ ఐదేళ్ల గ్యాప్ కారణమేంటి..? ఇప్పుడే హఠాత్తుగా మేలుకోవడం ఏమిటి..? ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు చానళ్ల జాబితా నుంచి సాక్షి టీవీ పేరును తొలగించడం ఏమిటి..? నిజానికి సాక్షి టీవీ వల్ల దేశ అంతర్గత భద్రతకు వచ్చిన ముప్పు ఏమిటి..? ఇవన్నీ ప్రశ్నలే… కేంద్రంతో జగన్ సఖ్యతకు గ్రహణం పడుతోందా..? దూరం పెరుగుతోందా..? అంత ఈజీగా ఓ సీఎం చానెల్ మీద ‘‘భద్రత ముప్పు’’ అనే ముద్ర ఎలా సాధ్యం..?
గతంలో జగన్ మీద బోలెడు అక్రమాస్తుల కేసులు పడ్డాయి కదా, ఈడీ కేసులు కూడా ఉన్నాయి కదా అని రాస్తూ… సాక్షి మీద అందుకే రద్దు వేటు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఏదో రాసుకొచ్చింది… కానీ బోలెడు చానెళ్ల మీద ఈడీ, ఐటీ కేసులున్నయ్… ఉదాహరణ ;: ఎన్డీటీవీ… పైగా ఆర్థికనేరాలు వేరు, అంతర్గత భద్రతకు థ్రెట్ వేరు… సాక్షిలో పెట్టుబడులపై న్యాయస్థానాల్లో విచారణలు సాగుతున్నయ్ కూడా…! అందుకే సాక్షికి అనుమతుల నిరాకరణ అనేది ఆశ్చర్యంగానే ఉంది అందరికీ..! సజ్జల గారికి ఓ విజ్ఞప్తి… ఇది కూడా చంద్రబాబు మేనేజ్ చేశాడని ఆరోపించకండి సార్, ప్లీజ్…!! అవునూ… సాక్షి టీవీ సరే, సాక్షి పత్రిక మీద మోడీజీ ధోరణి ఎలా ఉండబోతోందో…!! సాక్షి టీవీ, సాక్షి పత్రిక వేర్వేరు కాదు కదా…!!
Share this Article